parliamentarians
-
విజయసాయిరెడ్డికి సన్సద్ రత్న అవార్డు
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి ‘సన్సద్ రత్న’(పార్లమెంటరీ రత్న) అవార్డుకు ఎంపికయ్యారు. 2023 ఏడాదిగానూ సన్సద్ రత్న అవార్డు విజేతల లిస్ట్‌ను ప్రకటించారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. ఇందులో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ తరపున రవాణా, పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. సన్సద్ రత్న అవార్డుకు ఎంపికైన ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా అభినందనలు తెలియజేశారు. జ్యూరీ కమిటీ ఈఏడాదికిగానూ పదమూడు మంది ఎంపీలతో పాటు 2 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు, 1 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులను ప్రకటించింది. ఇందులో.. సీపీఐ(ఎం) సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు టీకే రంగరాజన్‌కు ఈ ఏడాది ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రకటించారు. Congratulations to the MP colleagues who will be conferred the Sansad Ratna Awards. May they keep enriching parliamentary proceedings with their rich insights. https://t.co/IqMZmLfC1l — Narendra Modi (@narendramodi) February 22, 2023 పార్లమెంట్లో సభ్యుల పనితనానికి గౌరవసూచీగా ఈ అవార్డులను అందిస్తున్నారు. ఐఐటీ మద్రాస్ సహకారంతో.. సన్సద్ రత్న అవార్డులను 2010 నుంచి అందిస్తున్నారు. దేశ మాజీ రాష్ట్రపతి, సైన్స్ మేధావి ఏపీజే అబ్దుల కలాం సూచన మేరకు.. ఆయన గౌరవార్థం ఈ అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు. తొలి ఎడిషన్ చెన్నైలో జరగ్గా.. ఆయన స్వయంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు కూడా. సంసద్ రత్న అవార్డులను భారత ప్రభుత్వం అందించదు. అయినప్పటికీ జ్యూరీలో మాత్రం ప్రభుత్వంలో వ్యక్తులను చేరుస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రాం మేఘ్ వాల్.. సన్‌సద్‌రత్న అవార్డుల జ్యూరీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే.. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ చైర్మన్ టీఎస్ కృష్ణమూర్తి సహ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్లో సభ్యులు అడిగే ప్రశ్నలు, ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్స్ బిల్లులు, ప్రారంభించిన చర్చలు, హాజరు, వినియోగించిన నిధులు మొదలైన అంశాల ఆధారంగా జ్యూరీ అవార్డులకు విజేతలను ఎంపిక చేస్తుంది. సభ్యుల పనితీరు డేటా PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ అందించిన సమాచారం ఆధారంగా పరిగణనలోకి తీసుకుంటుంది జ్యూరీ. ఇప్పటిదాకా 90 మంది పార్లమెంటేరియన్లకు ఈ అవార్డులను అందించారు. తాజాది 13వ ఎడిషన్ కాగా.. మార్చి 25వ తేదీన న్యూఢిల్లీలో అవార్డుల ప్రదాన కార్యక్రమం జరగనుంది. -
ఉత్తమ పార్లమెంటేరియన్‌గా కవిత
సాక్షి, న్యూఢిల్లీ: ఫేమ్ ఇండియా–ఏషియా పోస్ట్ ప్రకటించిన ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు (శ్రేష్ట్ సంసద్)ను టీఆర్ఎస్ ఎంపీ కె.కవిత గురువారం ఢిల్లీలో అందుకున్నారు. ప్రజాదరణ, కార్యశీలత, సామాజిక సేవా దృక్పథం, లోక్‌సభకు హాజరు, చర్చల్లో చురు గ్గా పాల్గొనడం, ప్రశ్నలడగడం, పార్లమెంటు నియమ నిబంధనలను పాటించడం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న సదరు సంస్థ కవితకు అవార్డు ప్రకటించింది. తెలం గాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కవిత క్రీయాశీలకంగా పనిచేస్తున్నారని సంస్థ కొనియాడింది. ఢిల్లీలో గురువారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా కవితతో పాటు మరో 25 మంది ఎంపీలు అవార్డులు అందుకున్నారు. బడ్జెట్లో రూ. 24 వేల కోట్లు ఇవ్వండి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, నీతి ఆయోగ్ ప్రతిపాదించినట్టు మిషన్ భగీరథ, కాకతీయ పథకాలకు రూ. 24 వేల కోట్లు మంజూరు చేయాలన్నారు. ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే విషయమై శుక్రవారం ఢిల్లీలో సమావేశం కానున్న ప్రతిపక్ష పార్టీల తీరును కవిత తప్పుబట్టారు. ఓటమిపాలైన ప్రతిపార్టీ ఈవీఎంలపై విమర్శలు చేస్తున్నాయన్నారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన అనంతరం ఫలితాలు వెలువడక ముందు ప్రభుత్వ ఏర్పాటుకు తమకే మొదటగా అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరిన కాంగ్రెస్ నేతలు, ఓటమిపాలవ్వగానే ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహా జన్ను కలసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత జితేందర్‌రెడ్డి, బూర నరసయ్యగౌడ్, సంతోశ్‌కుమార్, కొత్తా ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్ పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రజలే కారణం తాను ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎన్నికయ్యానంటే దానికి నిజామాబాద్ ప్రజలే కారణమని, గత ఎన్నికల్లో తన ను ఎంపీగా ఎన్నుకోవడం వల్ల సమస్యలపై పార్లమెంటులో ప్రశ్నించగలిగానని కవిత అన్నారు. గురువారం పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై కవిత స్పందిస్తూ.. కేంద్రం చేసిన చిన్నచిన్న పనులను పెద్దగా చూపే ప్రయత్నం జరిగిందని, ప్రవేశపెట్టిన పథకాల ఫలితాలను ఎక్కడా వెల్లడించలేద న్నారు. నేడు కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడితే తెలంగాణ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. -
సునాయిక
సకల సుగుణ నాయిక సుష్మాస్వరాజ్! వాగ్ధాటి, సుపరిపాలన, సత్వర ప్రతిస్పందన, సంస్కృతి, సంప్రదాయం, మానవత కలగలిసిన రాజనీతిజ్ఞురాలు.. సుగుణాలకే వన్నెతెచ్చిన నాయిక.. సునాయిక..సుష్మాస్వరాజ్. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం. ప్రత్యర్థి పార్టీలు కూడా గౌరవించే వ్యక్తిత్వం. దేశ రాజధానికి... ముఖ్యమంత్రి అయిన తొలి మహిళ. మూడు సార్లు ఎమ్మెల్యే... ఏడుసార్లు ఎంపీ. ‘బెస్ట్ లవ్డ్ పొలిటీషియన్’.. వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రశంస. ‘బెస్ట్ అవుట్‌స్టాండింగ్ పార్లమెంటేరియన్’.. మన దేశం. కొత్త తరం పొలిటీషియన్లకు రోల్‌మోడల్. అన్నీ కలిస్తే.. సుష్మా స్వరాజ్. ఓ రోజున సుష్మా స్వరాజ్ ట్విట్టర్ అకౌంట్‌కి ‘మేడమ్ ప్లీజ్ హెల్ప్’ అంటూ ఒక ట్వీట్ వచ్చింది. అది దోహా ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన తన సోదరుడిని రక్షించమని కోరుతూ ప్రన్షు సింఘాల్ అనే వ్యక్తి చేసిన ట్వీట్. మూడవ రోజునే ‘నా సోదరుడు అంకిత్ క్షేమంగా విడుదలయ్యాడు. కృతజ్ఞతలు’ అంటూ మరో ట్వీట్ చేశాడు ప్రన్షు సింఘాల్. అంతకంటే ముందు... బెర్లిన్‌లో పాస్‌పోర్టు, డబ్బు ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను పోగొట్టుకున్న అగర్త అనే అమ్మాయి నుంచి సుష్మకు ఒక ట్వీట్ వచ్చింది. ఆ మరుసటి రోజే ‘ఈ రోజు ఇండియన్ ఎంబసీకి వెళ్లి పాస్‌పోర్టుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక అనుమతి తీసుకున్నాను. కృతజ్ఞతలు’ అంటూ ఎంబసీ ఉద్యోగుల పేర్లతో సహా మరో ట్వీట్ చేసింది అగర్త. మరికొన్నాళ్లకు.. దేవ్ తంబోలి అనే వ్యక్తి నుంచి ఓ ట్వీట్.. ‘మా చెల్లెలు ఉద్యోగం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి వెళ్లింది. ఆమెను ఓ గదిలో బంధించారు. రక్షించండి’ అంటూ తన ఫోన్ నంబరు కూడా ఇచ్చాడతడు. కొన్ని గంటల్లోనే దేవ్ ట్విట్టర్ అకౌంట్‌కి ‘యుఎఈ అంబాసిడర్‌ని సహాయం అడిగాను. ఆయన మీతో మాట్లాడతారు, వివరాలు చెప్పండి’ అని భారత విదేశాంగ మంత్రి నుంచి రిప్లయ్ ట్వీట్ వచ్చింది. ఆ రోజు సాయంత్రానికే ‘దుబాయ్ పోలీసుల సహాయంలో మీ చెల్లెల్ని రక్షించాం. ఇప్పుడామెను దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీ షెల్టర్‌కు చేర్చడమైంది’ అని దేవ్‌కి ట్వీట్ చేశారు భారత విదేశాంగ మంత్రి. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకే కాదు, మనదేశంలో చిక్కుకుపోయిన విదేశీయులకూ అంతే వేగంగా సుష్మ నుంచి సేవలు అందుతున్నాయి. సుజాన్నె లుగానో అనే డచ్ మహిళ తన సోదరి సబినె హార్మెస్ భారత పర్యటనలో రిషికేశ్‌లో తప్పి పోయిందని ట్వీట్ చేసింది. సోదరిని గుర్తుపట్టడానికి ఆనవాళ్లను కూడా వివరించింది సుజాన్నె. ఆ ట్వీట్‌కు బదులుగా ‘మా అధికారులు సబినె హార్మెస్ను కనుగొన్నారు. ప్రస్తుతం ఆమె స్వతంత్ర ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటోంది. డెహ్రాడూన్‌లోని పాస్‌పోర్టు అధికారి ఆమెను స్వయంగా కలిశారు’ అని ఒక ట్వీట్. మరి కొన్ని గంటలకు ‘ఆమె కాళ్లకు గాయాలయ్యాయి. ఆమె మానసికంగా కూడా స్థిమితంగా లేదు. నిర్మల్ జాలీ గ్రాంట్ హాస్పిటల్’లో చేర్చి చికిత్స చేస్తున్నారు’ అని మరో ట్వీట్ చేశారు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్. ఇవి మాత్రమే కాదు.. ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయుల వీడియో చూసి మనోవేగంతో స్పందించారు సుష్మ. ఆపదలో ఉన్న వారిని విడిపించారు, మరణించిన వారిని వారి బంధువులకు అప్పగించారామె. ఇవన్నీ భారతీయులుగా మన ఛాతీ ఉప్పొంగే సేవలైతే... సోనూ అనే చిన్నారిని రక్షించడంలో ఆమెలో అమ్మతనం దేశం హృదయాన్ని తాకింది. సోనూ నాలుగేళ్ల కుర్రాడు. ఢిల్లీలో ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండగా 2010లో ఇద్దరు మహిళలు ఆ చిన్నారిని అపహరించుకుని వెళ్లారు. సుష్మ దృష్టికి వచ్చిన తర్వాత సోనూ కోసం శోధించి 2016లో బంగ్లాదేశ్‌లోని షెల్టర్ హోమ్‌లో ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆ ప్రభుత్వంతో సంప్రదించి సోనూను ఇండియాకు రప్పించి అతడి తల్లిదండ్రులకు అప్పగించినప్పటి దృశ్యం దేశ ప్రజల గుండెల్ని కదలించింది ఆ స్థానంలో మగవాళ్లు ఉంటే ఆ సందర్భం కర్తవ్య నిర్వహణలో భాగంగానే ఉండేది. మీడియా కోసం ఫొటోకి పోజిచ్చి, పిల్లాడిని అమ్మానాన్నలకు అప్పగించేవాళ్లు్ల. సుష్మాస్వరాజ్ మంత్రిగా మాత్రమే కాదు, ఓ తల్లిలా కూడా స్పందించారు. సోనూను దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. తన బిడ్డే తప్పిపోయి తిరిగి దగ్గరకు చేరితే తల్లిపేగు కన్నీరు పెట్టుకున్నట్లు స్పందించారామె. ఇలా ఆమెలో దేశాన్ని తల్లిలా భావించే లక్షణం కూడా ఆమెతోపాటే పెరిగింది. పాలకులు ప్రజలను బిడ్డల్లా పాలించాలనే తత్వాన్ని ఆమెకు పొలిటికల్ సైన్స్ నేర్పించింది. హరియాణా అమ్మాయి సుష్మాస్వరాజ్ పూర్వికులు లాహోర్ (పాకిస్థాన్)లోని ధరంపురా నుంచి హరియాణాకు వచ్చారు. తండ్రి హర్దేవ్ శర్మ ఆర్ఎస్ఎస్లో క్రియాశీలక సభ్యుడు. అంబాలా కంటోన్మెంట్లో స్థిరపడ్డారాయన. సుష్మ బాల్యం, కాలేజ్ చదువు అంతా అంబాలాలోనే. వరుసగా మూడేళ్లు బెస్ట్ ఎన్సీసీ క్యాడెట్ అవార్డు నుంచి బెస్ట్ హిందీ స్పీకింగ్ అవార్డు, బెస్ట్ స్టూడెంట్ అవార్డు, సంగీతం, సాహిత్యం, లలిత కళలు, నాటకాలు, వక్తృత్వం... అన్నింటిలోనూ ఆమెకు ప్రవేశం ఉండేది. పంజాబ్ యూనివర్సిటీలో ఎల్ఎల్బి చదివే రోజుల్లో విద్యార్థి పరిషద్‌లో చురుగ్గా పాల్గొంటున్నప్పుడు ఆమె ఊహించి ఉండరు.. దేశంలో ఇంతటి క్రియాశీలకమైన రాజకీయవేత్తగా మారతానని. లా కోర్సు పూర్తయిన తర్వాత అందరిలాగానే న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. జార్జి ఫెర్నాండెజ్ లీగల్ డిఫెన్స్ టీమ్‌లో చేరడం... ఆమె జీవితాన్ని మలుపు తిప్పి, ఇప్పుడు మనం చూస్తున్న గమ్యానికి చేర్చింది. సుష్మ... స్వరాజ్ 1975, జూలై 13. అప్పటి వరకు ఆమె కేవలం సుష్మ, ఆ రోజు నుంచి సుష్మా స్వరాజ్. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తూ.. ఫెర్నాండెజ్, జయప్రకాశ్ నారాయణ్లతోపాటు సుష్మ ఉద్యమించిన సమయంలోనే ఫెర్నాండెజ్ టీమ్‌లో చేరి, పరిచయం అయిన న్యాయవాది కౌశల్ స్వరాజ్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. తర్వాత రెండేళ్లకు హరియాణా శాసనసభకు ఎన్నికలు వచ్చాయి. జనతాపార్టీకి చురుకైన అభ్యర్థులు కావాల్సి వచ్చింది. పార్టీ నాయకులకు సుష్మాస్వరాజ్ కనిపించారు. పాతికేళ్లకే ఆమె శాసన సభకు పోటీ చేయడం, గెలవడం, దేవీలాల్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణం చేయడం జరిగిపోయాయి. మరో రెండేళ్లకే పార్టీ రాష్ట్ర బాధ్యతలు స్వీకరించారు. విప్లవాత్మక నిర్ణయాలు సుష్మాస్వరాజ్ దేశంలో అనేక రాజకీయ అనిశ్చితులకు ప్రత్యక్ష సాక్షి. ఎమర్జెన్సీ నుంచి సంకీర్ణ యుగం వరకు, పదమూడు రోజుల ప్రభుత్వం వంటి ఒడిదుడుకులను కూడా చూశారు. సమాచార ప్రసార మంత్రిగా పార్లమెంట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలనే విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆరు ఎయిమ్స్‌ల స్థాపన ఆమె చొరవే. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ల తనిఖీ వంటి సాహసోపేతమైన అడుగులు కూడా వేశారు. అప్పట్లో ఉల్లిపాయలు కేజీ ఐదు నుంచి యాభై రూపాయలను చేరడం భారత దేశం ఊహించని పరిణామం. ఆ ఫలితాన్ని ఆమె ఢిల్లీ ఎన్నికలలో మోయాల్సి వచ్చింది. భారతీయత– విదేశీయత సుష్మాస్వరాజ్ రాజకీయ జీవితం ఇందిరా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా మొదలవడం అనుకోకుండా జరిగిపోయింది. భారత విదేశాంగ శాఖను నిర్వహించిన మహిళల్లో ఇందిరాగాంధీ తర్వాత సుష్మ పేరు చేరడం కూడా యాదృచ్చికమే. అయితే 1999లో గాంధీ కుటుంబంతో బరిలో దిగడం మాత్రం అప్పటి రాజకీయ అవసరం. సోనియా గాంధీ కర్నాటకలోని బళ్లారి లోక్‌సభ స్థానానికి కూడా పోటీ చేశారు. అప్పుడు అద్వానీ, వాజ్‌పేయి వంటి పార్టీ పెద్దలు సుష్మాస్వరాజ్ వైపు మొగ్గుచూపారు. భారతీయతకు– విదేశీయతకు మధ్య పోటీగా రూపుదిద్దుకున్న ఆ ఎన్నికల్లో చివరి నిమిషంలో బరిలో దిగిన సుష్మాస్వరాజ్... ప్రచారంలో కన్నడ భాషలో మాట్లాడి కన్నడిగులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. మూడున్నర లక్షల ఓట్లు తెచ్చుకున్నారు. కొద్ది తేడాతో విజయానికి దూరంగా ఉండిపోయినప్పటికీ ఆ ఎలక్షన్ సుష్మ పొలిటికల్ చరిష్మా గ్రాఫ్‌ను పెంచింది. నిత్య విద్యార్థి సుష్మా స్వరాజ్ కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. టెక్నాలజీతోపాటు అప్డేట్ అవుతుంటారు. ట్విటర్‌ను పరిపాలనకు ఆమె ఉపయోగించినంత విరివిగా మరెవరూ వాడి ఉండరు. ఏ క్షణమైనా ప్రపంచానికి ఒక ట్వీట్ దూరంలోనే ఉంటారు. సుష్మాస్వరాజ్... స్మార్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎలాగన్నది చేతిలో స్మార్ట్‌ఫోన్‌తో చేసి చూపిస్తున్నారు. అదే వేదికగా ప్రజాభిమానాన్ని కూడా చూరగొంటున్నారు. ఆమెకు కిడ్నీ సమస్య వచ్చినప్పుడు వెల్లువెత్తిన అభిమానం రాజకీయ పార్టీల హద్దులను చెరిపేసింది. తమ కిడ్నీ ఇస్తామంటూ అభిమానుల నుంచి ట్వీట్లు వచ్చాయి. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఆమె సంపాదించుకున్న స్థిరాస్తి అది. నాయకులు రెండు రకాలు. తమకు మార్గదర్శనం చేసిన వారి అడుగుజాడల్లో నడిచేవాళ్లు, తర్వాతి తరం కోసం తమ పాదముద్రలతో పథనిర్మాణం చేయగలిగిన వాళ్లు. సుష్మా స్వరాజ్‌ది రెండో కోవ. ప్రధాని అవుతారా?! సుష్మా స్వరాజ్ గత వారం... తన ఆరోగ్య రీత్యా రాబోయే 2019 ఎన్నికల్లో పోటీ చేయలేనని యథాలాపంగా అన్నట్లు అన్నారు. ఆ మాట ప్రజల దృష్టిని ఆకర్షించింది. రాజకీయాల నుంచి రిటైర్ అవుతారా? అన్ని పార్టీల్లోనూ సందేహం. ‘ఎన్నికల్లో పోటీ చేయకపోతే రాజకీయాల నుంచి రిటైర్ అయినట్లేనా? రాజ్యసభ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యి ప్రధానమంత్రి కావచ్చు కదా, ఇందిరాగాంధీలాగా’ అని సీనియర్ జర్నలిస్టు బర్ఖాదత్ ఆశాజనకమైన సందేహాన్ని వ్యక్తం చేశారు. అదే నిజం కావాలని కోరుకునే వాళ్లు దేశంలో చాలామంది ఉన్నారు. తొలి మహిళ రికార్డులు ► ఢిల్లీ ముఖ్యమంత్రి ► భారత పార్లమెంట్లో ప్రతిపక్ష నేత ► జాతీయ పార్టీకి అధికార ప్రతినిధి ► అవుట్ స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డు ► హరియాణా క్యాబినెట్ మంత్రి ► హరియాణా జనతాపార్టీ అధ్యక్షురాలు బర్ఖాదత్, సీనియర్ జర్నలిస్టు కూతురు బాన్సూరి కౌశల్‌తో సోనూను తల్లిదండ్రులకు అప్పగిస్తూ.. భర్త స్వరాజ్ కౌశల్‌తో (పెళ్లి ఫొటో) సుష్మలాగ అభినయిస్తున్న చిన్నారి (ఫ్యాన్సీ డ్రస్ పోటీ) – వాకా మంజులారెడ్డి -
పార్లమెంటుపై నమ్మకం పోతోంది
న్యూఢిల్లీ: పార్లమెంటు సజావుగా నడవడంలో ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రయోజనం లేదని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంటుపై, ఎంపీలపై ప్రజలకు నమ్మకం పోతోందన్నారు. లోక్‌సభ, రాజ్యసభ సమర్థవంతంగా నడిచేలా ఎంపీలు బాధ్యత తీసుకోవాలని మోదీ సూచించారు. సామాన్య ప్రజల సమస్యలను తెలపడం, వారి సంక్షేమానికి కృషిచేసేందుకు ప్రతి ఎంపీకీ అవకాశం రావాలన్నారు. లేదంటే దేశం చాలా నష్టపోతోందన్నారు. 2014–17 కాలానికి ఉత్తమ పార్లమెంటేరియన్లకు పార్లమెంటు సెంట్రల్ హాల్లో అవార్డులిచ్చిన సందర్భంగా మోదీ మాట్లాడారు. నజ్మా హెప్తుల్లా, హుకుమ్‌దేవ్ నారాయణ్ యాదవ్, గులాంనబీ ఆజాద్, దినేశ్ త్రివేది, భర్తృహరి మహతాబ్ ఈ అవార్డులందుకున్నారు. ఎంపీలు ఓ పార్టీకో, ఓ నియోజకవర్గానికో పరిమితం కారాదని ప్రజల సమస్యల పరిష్కారంలో విస్తృతాంశాలపై చర్చించాలని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేయడం కోసం విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని వెంకయ్య నాయుడు అన్నారు. చాలాసార్లు అధికార పార్టీ ఎంపీలే పార్లమెంటును అడ్డుకున్నారని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. -
మాజీ ఎంపీల పెన్షన్లపై పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: మాజీ పార్లమెంటేరియన్లకు ఇచ్చే పెన్షన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మాజీ ఎంపీలకు పెన్షన్లు, రవాణ భత్యం, ఇతర సేవలు అందించడాన్ని సవాలు చేస్తూ ‘లోక్ ప్రహరి’అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం కొట్టేసింది. అలహాబాద్ హైకోర్టు తమ పిటిషన్ కొట్టేయడంతో ఈ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సంబంధిత చట్టాన్ని రూపొందించకుండా మాజీ ఎంపీలకు పెన్షన్లు అందించేందుకు పార్లమెంటుకు అధికారాలు లేవని ఆ సంస్థ తన పిటిషన్లో పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ‘రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ఒకటో జాబితా 73వ ఎంట్రీలో ఎంపీల ‘అలవెన్సుల’ గురించి ప్రస్తావన ఉంది. పెన్షన్, ఇతర ప్రయోజనాలు దాని కిందకే వస్తాయి’ అని పేర్కొంది. అయితే ఎంపీల పదవీ కాలం ముగిసినప్పటికీ వారు గౌరవ ప్రదంగా ఉండేందుకు పెన్షన్లు, ఇతర అలవెన్స్‌లు, సేవలు అందించడం సబబేనని విచారణ సందర్భంగా కేంద్రం చెప్పింది. -
జీవితకాల నిషేధమే సరైన శిక్ష
రాంచి: రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. కేసుల్లో దోషులుగా తేలిన వ్యక్తులపై ఎన్నిల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ రకమైన నిర్ణయం తీసుకుంటే అందరూ హర్షిస్తారని.. ఇది నిష్పాక్షికంగా ఉంటుందని ఆయన చెప్పారు. శిక్ష ఖరారైన ప్రజాప్రతినిధులను ఎన్నికల్లో పాల్గొనకుండా జీవిత కాల నిషేధాన్ని విధించాలని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టును కోరిన గంటల వ్యవధిలోనే లాలూ ప్రసాద్ యాదవ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. పార్లమెంట్ సభ్యులు, శాసనభ్యులపై నమోదైన కేసులను త్వరతగతిన విచారించేందుకు ప్రత్యేక, ఫాస్ట్ ట్రాక్ కోర్టులును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు.. కేంద్రప్రభుత్వాన్ని కోరింది. శిక్ష పడిన ప్రజాప్రతినిధులపై జీవితకాల నిషేధాన్ని విధించే అంశంపై న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘంను సంప్రదించి సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
భారీగా పెరిగిన ఎంపీల వేతనాలు
న్యూఢిల్లీ : పార్లమెంట్ సభ్యులకు శుభవార్త. ఎంపీల వేతనాలు 100 శాతం పెంపుకు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) ఆమోదం తెలిపింది. దీంతో పార్లమెంట్ సభ్యులకు ప్రస్తుతమున్న వేతనం రూ.50 వేల నుంచి రెండింతలు పెరిగి లక్ష రూపాయలకు చేరుకుంది. కేవలం వేతనాలను మాత్రమే కాక, అలవెన్స్‌లను కూడా పీఎంవో సమీక్షించింది. పీఎంవో ఆమోదంతో మొత్తంగా పార్లమెంట్ సభ్యులు అందుకునే వేతనాలు నెలకు రూ.1,90,000 నుంచి రూ.2,80,000 కు ఎగిశాయి. ఈ వేతన ప్రతిపాదనను బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యానాథ్ అధినేతగా పార్లమెంట్ సభ్యుల వేతన, అలవెన్స్ జాయింట్ కమిటీ రూపొందించింది. అంతకముందు ఎంపీల వేతన పెంపుకు ప్రధాని మోదీ ఓ ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటుచేశారు. కానీ పార్లమెంట్ సభ్యుల నుంచి వచ్చిన ఒత్తిడి క్రమంలో ఈ కమిషన్‌ను మోదీ రద్దుచేశారు. పార్లమెంట్ సభ్యుల అలవెన్స్ చూసుకుంటే, ప్రతినెలా వారికి ఇచ్చే నియోజకవర్గ భత్యం రూ.45,000 ల నుంచి రూ.90,000కు పెరిగింది. సెక్రటరీ సహాయం, కార్యాలయ భత్యం కింద నెలకు రూ. 90,000ను పార్లమెంట్ సభ్యులు అందుకోనున్నారు. అదేవిధంగా రాష్ట్రపతి వేతనాన్ని కూడా రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రపతి వేతనంతో పాటు గవర్నర్ వేతనాన్ని కూడా రూ.1.10 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచనున్నారు. -
సాధ్వి వ్యాఖ్యల పై రాజ్యసభలో మోదీ వివరణ
-
బంద్ ప్రశాంతం
మిన్నంటిన నిరసనలు ఎన్జీవోల బంద్ విజయవంతం వైఎస్సార్సీపీ పూర్తి సహకారం మూతపడిన ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలు ప్రధాన కూడళ్లలో మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలు పార్లమెంట్లో రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఏపీ ఎన్జీవోలు గురువారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలను ఏపీ ఎన్జీవోలు మూయించారు. కలెక్టరేట్ ఆవరణలో మోకాళ్లపై నడిచి కేంద్ర హోం మంత్రి షిండే దిష్టి బొమ్మను దహనం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్ని నియోజక వర్గాల్లో ఆందోళనలు చేపట్టారు. టీడీపీ నాయకులు, న్యాయవాదులు, వైద్యులు, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు, విద్యార్థి నాయకులు నిరసనలతో హోరెత్తించారు. సాక్షి, విశాఖపట్నం : సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు సీమాంధ్ర బంద్ గురువారం విజయవంతమైంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలను ఏపీ ఎన్జీవోలు మూయించారు. లోక్ సభలో ‘టి’ బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఎన్జీవోలు కలెక్టరేట్ ఆవరణలో మోకాళ్లపై నడిచి నిరసన వ్యక్తం చేశారు. అంతటితో ఆగక కేంద్ర మంత్రి షిండే దిష్టి బొమ్మను దహనం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులుఅన్ని నియోజకవర్గాల్లోనూ మద్దతు తెలిపాయి. భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ర్యాలీలు నిర్వహించి, ఏపీ ఎన్జీవోలకు మద్దతుగా నిలిచారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన అనకాపల్లి పట్టణ బంద్ విజయవంతమయింది. కొణతాల లక్ష్మీనారాయణ (పెదబాబు) ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యాన నియోజకవర్గంలో గురువారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. యలమంచిలి మెయిన్‌రోడ్డుపై ర్యాలీ నిర్వహించారు. దిమిలి రోడ్డు జంక్షన్లో ఉన్న పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తహశీల్దార్ కార్యాలయం మొయిన్‌రోడ్డుపై బైఠాయించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. అరకులోయలో నియోజకవర్గ సమన్వయకర్తలు కుంభా రవిబాబు, కిడారి సర్వేశ్వరరావుల ఆధ్వర్యంలో వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. పాడేరులో నియోజకవర్గ సమన్వయకర్త గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో రోడ్డు దిగ్బంధించి రాస్తారోకో చేశారు మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్త పూడి మంగపతిరావు ఆధ్వర్యంలో కె.కోటపాడులో, మరో సమన్వయకర్త బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో దేవరాపల్లిలో బంద్ నిర్వహించారు. చోడవరంలో మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఎన్జీవోల సమ్మెకు మద్దతు తెలిపారు. పాయకరావుపేటలో నియోజకవర్గ సమన్వయకర్త చెంగల వెంకటరావు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.