
రాంచి: రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. కేసుల్లో దోషులుగా తేలిన వ్యక్తులపై ఎన్నిల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ రకమైన నిర్ణయం తీసుకుంటే అందరూ హర్షిస్తారని.. ఇది నిష్పాక్షికంగా ఉంటుందని ఆయన చెప్పారు.
శిక్ష ఖరారైన ప్రజాప్రతినిధులను ఎన్నికల్లో పాల్గొనకుండా జీవిత కాల నిషేధాన్ని విధించాలని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టును కోరిన గంటల వ్యవధిలోనే లాలూ ప్రసాద్ యాదవ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. పార్లమెంట్ సభ్యులు, శాసనభ్యులపై నమోదైన కేసులను త్వరతగతిన విచారించేందుకు ప్రత్యేక, ఫాస్ట్ ట్రాక్ కోర్టులును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు.. కేంద్రప్రభుత్వాన్ని కోరింది. శిక్ష పడిన ప్రజాప్రతినిధులపై జీవితకాల నిషేధాన్ని విధించే అంశంపై న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘంను సంప్రదించి సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment