
కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి నాల్గోటౌన్‌లో ఉంచిన దృశ్యం
నిజామాబాద్ సిటీ(నిజామాబాద్ అర్బన్) : ఎస్సారెస్పీ కాకతీయ కెనాల్ పరివాహక ప్రాంతాల గ్రామాల రైతులను పరామర్శించేం దుకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో కాకతీయ కెనాల్ పరివాహక ప్రాంతా ల గ్రామాల ప్రజలను పోలీసులు దిగ్భందించడంతో వారిని పరామర్శించేందుకు వెళ్లాలని గత బుధవారం అఖిల పక్షం సమావేశంలో తీ ర్మానించారు.
ఈ మేరకు శుక్రవారం పరివా హక గ్రామాలకు వెళ్లే నాయకులను శుక్రవారం తెల్లవారు జామున వారి ఇళ్లలో నుంచి అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. డీసీసీ అధ్యక్షుడు తాహెర్బిన్ హందాన్, పీసీసీ కార్యదర్శి భూంరెడ్డి, కిసాన్ కేత్ జిల్లా అధ్యక్షుడు ముప్పా గంగారెడ్డి, వామపక్షాల నాయకులు ఆకుల పాపయ్య, నూర్జహాన్‌లను అరెస్టు చేసి నాలుగో టౌన్‌కు తరలించారు.
పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, టీపీసీసీ అధికార ప్రతినిధి మానాల మోహన్‌రెడ్డి, సీపీఐఎం నాయకులు రమేశ్‌బాబులను పోలీసులు అరెస్టు చేసి మూడోటౌన్‌కు తరలించారు.
ఏఐసీసీ నాయకుల ప్రశంసలు
రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న కాం గ్రెస్ నాయకులను అరెస్టు చేసిన విషయంపై ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాసన్, కుంతియా, సీఎల్పీ నేత జానారెడ్డిలు పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్‌కు ఫోన్ చేసి రైతుల ఆం దోళన గురించి వాకబు చేశారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంపై పార్టీ నాయకులను ప్రశంచినట్లు గడుగు తెలిపారు.
రైతు ఉద్యమాలకు ఎమ్మెల్సీ ఆకుల లలిత మద్దతు
పంటలకు నీళ్లు అడిగితే రైతులను ప్రభుత్వం దిగ్భందిచడం అన్యాయమని ఎమ్మెల్సీ ఆకుల లలిత తెలిపారు. రైతు ఉద్యమాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment