సాక్షి, నిజామాబాద్ : టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిజామాబాద్ జిల్లా నుంచి పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు నిజామాబాద్‌లోని గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఈ సభలో మరికాసేపట్లో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. గులాబీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపుతున్న ఈ సభ అప్‌డేట్స్ ఇవి..
ప్రసంగిస్తున్న కేసీఆర్..
- తెలంగాణ అభివృద్దిన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులు వెస్తున్నారు.
- తెలంగాణకు కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టుపైనే 196 కేసులు వేశారు.
- ఆనాడు మహారాష్ట్రా గోదావరిపై అక్రమంగా ప్రాజెక్టులు కడుతుంటే గుడ్లుఅప్పగించి చూసింది మీరు కాదా..
- రైతు సమన్వయ కమిటీలకు వేతనం కూడా చెల్లిస్తాం.
- రాష్ట్రంలో అమలు అవుతున్న పెన్షన్లను కూడా పెంచుతున్నాం.. త్వరలోనే వెల్లడిస్తాం
- రైతుబంధు పథకం అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
- రాష్ట్రాన్ని 1956లో తెలంగాణకు ఆంధ్రలో కలిపి అన్యాయం చేసింది కాంగ్రెస్ కాదా..
- కార్మికులను గుర్రాలతో తొక్కించిన ఘనత తెలుగుదేశంది
వ్యవసాయానికి కేరాఫ్ నిజామాబాద్!
- కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ కవిత అన్నారు. నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్ నిర్వహించిన ప్రజాశీర్వాద సభలో ఆమె ప్రసంగించారు. తెలంగాణలో వ్యవసాయానికి కేరాఫ్ అడ్రస్ నిజామాబాద్ జిల్లా అని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ కరెంటు కోతలు లేకుండా చేశారని, ఇంటింటికీ నల్లాల కోసం రూ. 4వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. జిల్లాలో లక్షా 5వేల కేసీఆర్ కిట్‌లు పంపిణీ చేశామని, 4లక్షల 72వేలమంది రైతులకు రైతుబంధు చెక్కులు పంపిణీ చేశామని చెప్పారు. టీఆర్‌ఎస్ హయాంలో నిజామాబాద్‌కు 292 పరిశ్రమలు వచ్చాయని తెలిపారు.
- సభలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాకారుల ఆటపాటలతో ఉత్సాహం తెచ్చుకున్న ఆపద్దర్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభావేదికపైకి ఎక్కి నృత్యం చేశారు. ఆయన నృత్యం గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది.
- సభాప్రాంగణం చేరుకున్న ఆపద్ధర్మ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్..
- సభావేదిక మీద ఎమ్మెల్సీలు సుధాకర్ రెడ్డి, వీజీ గౌడ్, జడ్పి చైర్మన్లు డీ రాజు, తుల ఉమ, తాజా మాజీ ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, గంప గోవర్ధన్, హన్మంత్ షిండే
ముందస్తుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వివరించనున్న కేసీఆర్
- నాలుగేళ్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ గెలవాల్సిన ఆవశ్యకతను సీఎం కేసీఆర్ ఈ సభలో తెలపనున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని బహిరంగ సభ వేదికగా ప్రజలను కోరనున్నారు. ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని పదేపదే అడ్డుకోవడం వల్లే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందని ప్రజలకు వివరించనున్నారు. ప్రజలు స్పష్టమైన తీర్పుతో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే స్వాభిమానంతో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని, అన్ని రంగాల్లోనూ తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో కొనసాగుతుం దని హామీ ఇవ్వనున్నారు. మొత్తంగా టీఆర్‌ఎస్ బహిరంగ సభలతో ఎన్నికల్లో రాజకీయ వేడి మరింత రాజుకోనుంది.
వరుసగా సభలు..
- ఉమ్మడి జిల్లాలవారీగా సభలు నిర్వహించేందుకు టీఆర్‌ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. నిజామాబాద్ సభ అనంతరం ఈ నెల 4న నల్లగొండలో, 5న వనపర్తిలో, 7న వరంగల్, 8న ఖమ్మంలో ఉమ్మడి జిల్లాల బహిరంగ సభలు నిర్వహించనుంది. బహిరంగ సభల ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ ఆయా జిల్లాల మంత్రులు, పలువురు అభ్యర్థులతో ఇప్పటికే ఫోన్లలో మాట్లాడారు. బహిరంగ సభలకు జనం త్వరగా వచ్చేలా చూడాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment