మాజీ ఎమ్మె ల్యే హన్మంత్‌సింధే
జుక్కల్ (నిజామాబాద్): మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణాని కి అడ్డుపడిన కేసులో జుక్కల్ తాజా మాజీ ఎమ్మె ల్యే హన్మంత్‌సింధే ఉన్నారు. దీంతో అరెస్టు వారెం ట్ జారీ అయ్యేనా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2010లో నాటి ఉమ్మడి ఏపీలో టీడీపీ అధినేత బాబ్లీ ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా చంద్రబాబుతోపాటు ఎమ్మెల్యేల్లో హన్మంత్ సింధే ఉన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నీటి సమస్య కావడం, ఓవైపు తెలంగాణ ఉద్య మం ఉండడం బాబ్లీ ప్రాజెక్ట్‌కు వెళ్లిన టీడీపీ బృందాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసి జైలులో పెట్టారు.
ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలవ్వడం, ప్రస్తుతం హన్మంత్ సింధే ఎన్నికల ప్రచారం లో బిజీగా ఉన్నారు. దీం తో చంద్రబాబు ఉచ్చు త న మెడకు బిగిస్తుందా అని హన్మంత్‌సింధే ఆం దోళన లో ఉన్నారు. ఎమ్మెల్యే నాన్ బెయిల్‌బుల్ వారెంట్ నోటీసులు అందితే చంద్రబాబుతో సహ హన్మంత్‌సింధే కూడా జైలుకు వెళ్లె పరిస్థితి ఉందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. బాబ్లీ కేసు తో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఎలా బయటపడుతారో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment