TRS MLA candidate
-
కంటతడి పెట్టిన కంచర్ల దంపతులు
నల్లగొండ రూరల్ : కాంగ్రెస్ ఓటమి భయంతోనే దాడులకు దిగుతోందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేం దర్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ నల్లగొండ ఎమ్మె ల్యే అభ్యర్థి కంచర్ల భూ పాల్‌రెడ్డిని గెలిపిం చాలని కోరుతూ ఆయ న సతీమణి రమాదేవి ఎస్ఎల్బీసీలో ప్రచారం నిర్వహిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ ప్రచార రథం ఫ్లెక్సీలను చించివేసి, డ్రైవర్‌పై దాడి చేశారని ఆరోపిస్తూ ఆ పార్టీ శ్రేణులు శనివారం స్థానిక క్లాక్‌టవర్ సెంటర్లో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓటమి ఖాయమని తేలిపోవడంతోనే ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నుతున్నారని, గులాబీ శ్రేణులు శాంతి యుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ను గెలిపిస్తాయన్నారు. నల్లగొండలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. లక్ష చేతులతో ఓడిస్తా : కంచర్ల కోమటిరెడ్డి దగ్గరుండి కార్యకర్తలతో భౌతిక దాడులు చేయిం చడం దుర్మార్గమైన చర్యని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. ఆటోడ్రైవర్‌పై దాడి చేయడం, ప్రచార రథం ఫ్లెక్సీని చించి తనను ఉద్దేశించి అవహేళనగా మాట్లాడడం సరికాదన్నారు. తన అవిటితనాన్ని ఉద్దేశించి అవహేళన వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డిని వచ్చే ఎన్నికల్లో లక్ష చేతులతో ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు తనపై చేసిన అవహేళన వ్యాఖ్యలు ఎంతో బాధిస్తున్నాయని గద్గదస్వరంతో అంటూ కాన్నీరు కార్చడంతో ఆయన సతీమణి, కూతురు కూడా కంటతడిపెట్టారు. సాగర్ రోడ్డులో రమాదేవి నిరసన.. కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ ప్రచారరథంపై ఉన్న ఫ్లెక్సీలను చించి, డ్రైవర్‌పై దాడి చేశారని ఆరోపిస్తూ కంచర్ల సతీమణి రమాదేవి చర్లగౌరారం స్టేజ్ వద్ద నిరసనకు దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలపై ఎస్పీకి ఫిర్యాదు నల్లగొండ క్రైం : కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ ప్రచార రథం ఫ్లెక్సీల తొలగింపు, డ్రైవర్‌పై దాడి, మహిళ కౌన్సిలర్లను అవమానించారని ఆరోపిస్తూ ఆ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, పార్టీ ఎన్నికల పరిశీలకులు రవీందర్రావు, మాజీ మున్సిపల్ చైర్మెన్ బోయపల్లి కృష్ణారెడ్డి, నిరంజన్‌వలీ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్ఎల్బీసీలో జరిగిన దాడి ఘటనపై టీఆర్ఎస్ నాయకుడు రామ రాజు యాదవ్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నర్సింగ్శ్రీనివాస్, డబ్బ వెంకన్న.చింతల విజయ్, మంగలి శ్రీను, కడారి వెంకన్న, నల్లబొతు శంకర్, మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మురళి తెలిపారు. -
టీఆర్ఎస్ నేతల హత్యకు మావోయిస్టుల పక్కా ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రజాప్రతిధులను మావోయిస్టులు టార్గెట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోములను ఎలాగైతే హత్య చేశారో అదే తరహాలో.. తెలంగాణలోని ఎమ్మెల్యేలను అంతం చేస్తామని మావోయిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మావోయిస్టు యాక్షన్ టీమ్స్.. తెలంగాణకు చెందిన ఓ ఆపద్ధర్మ మంత్రి, స్పీకర్‌ను టార్గెట్ చేసినట్టు సమాచారం. అదేవిధంగా తాడ్వాయి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డిని హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. మావోయిస్టుల కుట్రను పసిగట్టిన తెలంగాణ పోలీసులు అలర్ట్ కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. మావోయిస్టుల ముప్పు గురించి పోలీసులు సమాచారం ఇవ్వడంతో మంత్రి అజ్మీరా చందూలాల్ తాడ్వాయ్ మండలంలోని కటాపూర్‌లో ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే ముగించి వెనుదిరిగారు. ఈ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా రంగంలోకి దిగిన 30 మంది మావోయిస్టులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఓటు బ్యాంకుపై నజర్
బలాబలాలపై పార్టీల్లో చర్చ మొదలైంది. ఓటు బ్యాంకుపై ఆయా పార్టీల నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో పోలైన ఓట్లను కాపాడుకుంటే విజయం సాధించవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా ఓటు బ్యాంకు దెబ్బతినకుండా అన్నిపార్టీల నేతలు గట్టిగా కృషి చేస్తున్నారు. ఓటర్లను తమ వైపునకు తిప్పుకునే పనిలో నిమగ్నమయ్యారు. సంక్షేమ పథకాలే అస్త్రంగా అధికార పార్టీ దూసుకుపోతుండగా, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రతిపక్షాలు ఎండగడుతున్నాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా: టీఆర్ఎస్ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించడంతో ప్రచారంRANGAలో దూసుకెళ్తున్నారు. ఇక మహాకూటమిలో మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐల సీట్ల సర్దుబాటు కూడా ఇక కొలిక్కి వచ్చినట్లే. బీజేపీ కొన్ని సీట్లను ప్రకటించింది. అయితే, ఇటీవల మరో కొత్త చర్చ తెరమీదకు వచ్చింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో పార్టీలకు ఏ మేరకు బలాబలాలు ఉన్నాయనే అంశంపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చజరుగుతోంది. 2014 నాటి ఎన్నికల్లో ఆయా పార్టీలకు దక్కిన ఓట్ల శాతాన్ని పరిగణలోకి తీసుకుని అభ్యర్థులు లెక్కలు వేస్తూ గెలుపు ఓటములపై అంచనాలు మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో టీడీపీ,బీజేపీకే మొగ్గు: ఉమ్మడి జిల్లా పరిధిలోని 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీల బలాబలాల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆయా పార్టీలకు దక్కిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. గత ఎన్నికల సమయంలో 53.49 లక్షల మంది ఓటర్లు ఉండగా.. మొత్తం 29.89 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్కు 28.90 శాతం, కాంగ్రెస్‌కు 22.60 శాతం, టీడీపీ–బీజేపీకి అత్యధికంగా 30.83 శాతం ఓట్లు దక్కాయి. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇతర పార్టీల గుర్తుపై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరుకున్నారు. వీరిని కొంతమేర పార్టీశ్రేణులు, అనుయాయులు అనుసరించారు. ఈనేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలు కాస్త మారాయి. ఇదిలా ఉండగా, కొంకాలం క్రితం ఎన్నికల సందడి మొదలైనప్పటి నుంచి టీఆర్ఎస్లోకి వలసలు పెరిగాయి. ఇదే సమయంలో టీఆర్ఎస్ పాలనపై ఆగ్రహంతో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్ తదితర పార్టీల తీర్థం పుచ్చుకుంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్లినవారు.. తిరిగి సొంతగూటికి చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలా ఆయా నియోజకవర్గాల్లో మార్పులుచేర్పులు జరుగుతున్నాయి. ఓటు బ్యాంకుపై నజర్ : అప్పటి ఓటు బ్యాంకును కాపాడుకుంటే గెలుపు తథ్యమనే మహాకూటమి అభ్యర్థులు ధీమాతో ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగెస్, టీడీపీకి దక్కిన ఓట్ల శాతం 53.43. ముఖ్యంగా వలసలు అధికంగా ఉన్న కూకట్పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ సెగ్మెంట్లలో టీడీపీకి ఏకపక్షంగా ఓట్లు పడ్డాయి. ఇక మేడ్చల్, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ భారీగానే ఓట్లు సంపాదించింది. చేవెళ్ల, పరిగిలో కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీనిని పక్కనబెడితే.. 14 అసెంబ్లీ సెగ్గెంట్లలో వికారాబాద్, తాండూరు మినహా కాంగ్రెస్, టీడీపీకి దక్కిన ఓట్లు.. టీఆర్ఎస్కు లభించిన ఓట్ల కంటే ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఈ ఓటు బ్యాంకును కాపాడుకుంటే తమకు తిరుగు ఉండదన్న ధీమాను మహాకూటమి నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే.. చేరికలతో ఆ పార్టీ క్రమంగా బలపడుతోంది. దీనికితోడు నాలుగున్నరేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపెట్టుకున్న బీజేపీ ఈసారి ఒంటిరిగానే బరిలోకి దిగుతోంది. గత ఎన్నికల్లో ఉప్పల్‌లో బీజేపీ అభ్యర్థి గెలుపొందగా.. ఈసారి జిల్లాలో సాధ్యమైనంత మేర సీట్ల సంఖ్య పెంచుకునే లక్ష్యంతో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. పార్టీకి చెందిన జాతీయ నేతలను రంగంలోకి దింపింది ఇప్పటికే. మొత్తం మీద నాలుగున్నరేళ్లలో మారిన రాజకీయ పరిణామాలతో ఓటర్లు ఎవరివైపు ఉన్నారు.. విజయం ఎవరికి వరించనుందో అనే అంశాలపై నేతలు చర్చించకుంటున్నారు. ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు మహాకూటమి శక్తిమేర ప్రయత్నిస్తుండగా.. ఆ ఓట్లను చీల్చేందుకు టీఆర్ఎస్ కూడా గట్టిగానే పోరాటం చేస్తోంది. 2014లో మొత్తం ఓటర్లు: 53,49,742 పోలైన ఓట్లు: 29,89,027 కాంగ్రెస్‌కు దక్కిన ఓట్లు : 22.60 % టీఆర్ఎస్కు వచ్చిన ఓట్లు : 28.90 % టీడీపీ–బీజేపీకి లభించిన ఓట్లు: 30.83 % 2014 ఎన్నికల్లో పార్టీల వారీగా దక్కిన ఓట్ల శాతం : కాంగ్రెస్ టీఆర్ఎస్ టీడీపీ మేడ్చల్ 58,016 (22.05) 114235 (43.41) 70,780 (26.90) మల్కాజిగిరి 37,201 (16.12) 77,132 (33.42) 74,364 (32.22) (బీజేపీ) కుత్బుల్లాపూర్ 40,283 (13.87) 75,339 (25.94) 114,363 (39.38) కూకట్పల్లి 23,321 (10.04) 56,688 (24.41) 99,874 (43.00) ఉప్పల్ 34,331 (15.20) 68,226 (30.20) 82,395 (36.47) (బీజేపీ) ఇబ్రహీంపట్నం 36,865 (20.32) 21,779(12.00) 48,397 (26.67) ఎల్బీనగర్ 56,489 (22.52) 71,791 (28.62) 84,316 (33.61) మహేశ్వరం 62,521 (28.72) 42,517 (19.53) 93,305 (42.86) రాజేంద్రనగర్ 51,962 (22.63) 29,870 (13.01) 77,843 (33.91) శేరిలింగంపల్లి 43,384 (15.33) 53,539 (18.92) 129,796 (45.87) చేవెళ్ల 63,401 (39.48) 64,182 (39.00) 15,117 (9.30) పరిగి 68,098 (45.34) 62,935 (41.91) 13,355 (8.89) (బీజేపీ) వికారాబాద్ 54,520 (39.54) 64,592 (46.84) 6,335 (4.59) (బీజేపీ) తాండూరు 45,219 (33.92) 61,293 (45.97) 11,362 (8.52) మొత్తం 6,75,611 (22.60) 8,64,118 (28.90) 9,21,602 (30.83) -
కింకర్తవ్యం!
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ అసంతుష్టులు కొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నారు. అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా ఇన్నాళ్లు నిరసనగళం వినిపించినా ఫలితం లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ముందుచూపుతో ఇప్పటికే కొందరు ఇతర పార్టీలోకి జంప్ చేయగా మరికొందరు వేరు కుంపటి పెట్టేశారు. టీఆర్ఎస్ అధిష్టానం సెప్టెంబర్ 6న టికెట్లను ప్రకటించడమే తరువాయి.. టికెట్లను ఆశించిన ఔత్సాహికుల ఆశలు అవిరయ్యాయి. టికెట్లు తమకేనని ధీమా ప్రదర్శించిన వారంతా ఢీలా పడ్డారు. కష్టకాలంలో పార్టీ వెన్నంటి నిలిచినవారిని కాదని కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే తమ అనుచరులతో సుదీర్ఘ మంతనాలు సాగించిన అసమ్మతివాదులు పార్టీ నాయకత్వంపై ధిక్కార స్వరం వినిపించారు. అభ్యర్థిని మార్చాలని అన్ని రకాల ప్రయత్నాలను సాగించారు. అయినప్పటికీ, అధిష్టానం దిగిరాకపోవడంతో రూటు మార్చాలని తాజాగా నిర్ణయించారు. జంపింగ్ జపాంగ్! చేవెళ్ల సెగ్మెంట్ నుంచి 2014లో టీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిపోయిన కేఎస్ రత్నంకు ఈసారి చుక్కెదురైంది. గత ఎన్నికల్లో ఆయనపై గెలిచి.. ఆ తర్వాత పార్టీ మారిన కాంగ్రెస్ అభ్యర్థి కాలె యాదయ్యకే టీఆర్ఎస్ టికెట్టు దక్కింది. ఈ పరిణామంతో కంగుతిన్న రత్నం.. ‘కారు’ దిగి ‘చేయి’ పట్టుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగడానికి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ‘కొత్త’ దారిలో.. టీఆర్ఎస్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో మహేశ్వరం స్థానం నుంచి పోటీచేసి పరాజయం పాలైన కొత్త మనోహర్‌రెడ్డిది ఇదే పరిస్థితి. తనపై నెగ్గిన తీగల కృష్ణారెడ్డి(టీడీపీ)ని అక్కున చేర్చుకోవడమేగాకుండా టికెట్ కూడా కేటాయించడంతో మనోహర్‌రెడ్డి నిరాశకు గురయ్యారు. కొన్నాళ్లు అధిష్టానానికి సానుకూలంగా.. అభ్యర్థికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపించిన ఆయన ఇక లాభం లేదనుకొని కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. బీజేపీ అగ్రనేతలతో మంతనాలు జరిపిన ఆయనకు టికెట్‌పై స్పష్టమైన హామీ లభించిందో లేదో తెలియదు కానీ ప్రచారరథాలను కూడా రెడీ చేసుకుంటున్నారు. వీర్లపల్లి దారెటు? షాద్‌నగర్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అభ్యర్థిత్వాన్ని నిరసిస్తూ ఆ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. ఇప్పటికే మండలాల వారీగా పర్యటిస్తూ మద్దతు కూడగడుతున్న ఆయనకు ఇటీవల సీనియర్ నేత అందె బాబయ్య ఎమ్మెల్యే శిబిరంలోకి చేరి గట్టి షాక్ ఇచ్చారు. అంజయ్యను ఓడించడమే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని శంకర్ తేల్చిచెబుతున్నారు. శంకర్‌ను బుజ్జగించేందుకు అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించనట్టు కనిపిస్తోంది. కల్వకుర్తిలోనూ లొల్లే.. కల్వకుర్తి టికెట్టును జైపాల్‌యాదవ్‌కు ఖరారు చేయడంతో టీఆర్ఎస్లో అసమ్మతి భగ్గుమంది. వైరివర్గమంతా నిరసన గళం వినిపించినా చివరకు మెత్తబడింది. అయితే, స్థానిక ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గం మాత్రం ఇంకా గుర్రుగానే ఉంది. జైపాల్ అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా పోటీ చేయాలని కసిరెడ్డిపై ఒత్తిడి చేస్తోంది. అనుచరుల ఒత్తిడికి తలొగ్గి రంగంలోకి దిగడానికి సమాలోచనలు జరిపిన నారాయణరెడ్డి ప్రస్తుతం ఒకింత వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. త్వరలోనే ఆయన భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశముంది. అసమ్మతివాదులు పోటీకి దూరంగా ఉన్నా.. జైపాల్‌కు వ్యతిరేకంగా చాపకింద నీరులా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పిలుపు కోసం.. రాజేంద్రనగర్ టికెట్ రాకపోవడంతో నిరాశకు గురైన సీనియర్ నేత తోకల శ్రీశైలంరెడ్డి కూడా అధిష్టానంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను ఓడించడానికి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా కాకుండా బీజేపీ నుంచి బరిలో దిగడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ పెద్దలతో టచ్‌లో ఉన్నారు. -
ప్రచారంలో వ్యహలపై కేసీఆర్ దిశా నిర్దేశం
-
నష్టం జరగబోతోంది..!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి పొగలు గక్కుతోంది. టికెట్ రాని నేతలు ఎదురు తిరుగుతున్నారు. కారును వదిలి హస్తం, కమలం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీని నమ్ముకుంటే మట్టే మిగిలిందనే కసితో ఉన్న ఇంకొందరు నేతలు కేసీఆర్ బొమ్మ పెట్టుకుని ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. భూపాలపల్లి, స్టేషన్ ఘన్పూర్, వరంగల్ తూర్పు, పాలకుర్తి, జనగామ, మహబూబాబాద్, ములుగు నియోజకవర్గాల్లో రెబల్స్ రెడీ అయ్యారు.’ అని ఇంటెలిజెన్సీ విభాగం ‘గులాబీ’ అధినేత కేసీఆర్‌కు ఉప్పందించినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. స్వతంత్రులతోనే మోసం.... భూపాలపల్లి, స్టేషన్ ఘన్పూర్, ములుగు నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులు స్వతంత్రంగా బరిలో నిలబడేందుకు మానసికంగా సిద్ధమయ్యారు. భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ, స్టేషన్ ఘన్‌పూర్‌లో రాజారపు ప్రతాప్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వర్గం, ములుగులో చందూలాల్ వ్యతిరేక కూటమి తో భారీ ప్రమాదం ఉందని ఇంటెలిజెన్సీ పసిగట్టినట్లు తెలిసింది. ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులు కేసీఆర్ బొమ్మ పెట్టుకుని టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారని, వీళ్ల చర్యల మూలంగా టీఆర్ఎస్ పార్టీ ఓట్లు భారీగా చీలిపోయే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. భూపాలపల్లిలో భారీ సంక్షోభం.. భూపాలపల్లి నియోజకవర్గంలో మధుసూదనాచారికి టికెట్ కేటాయించిన రోజు నుంచే గండ్ర సత్యనారాయణరావు తిరుగుబాటు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తానని ప్రకటించిన ఆయన తన పని తాను చేసుకుపోతున్నారు. తనకు సహకరించాలని ప్రచారం సైతం మొదలుపెట్టారు. గండ్ర సత్యనారాయణకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతోందని.. భారీ ఎత్తున ఓట్లు చీల్చే ప్రమాదం ఉందని.. ఇది కాంగ్రెస్‌కి మేలు చేస్తుందని.. ఇప్పటికే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి భారీగా నష్టం జరిగిందని ఇంటెలిజెన్సీ వర్గాలు హెచ్చరించినట్లు తెలిసింది. రాజయ్య నైతికతపై దాడులు.. స్టేషన్ ఘన్‌పుర్‌లో డాక్టర్ రాజయ్యపై అసమ్మతి సెగలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాజారపు ప్రతాప్ తిరుగుబాటుతో రాజుకున్న అసమ్మతిని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అనుచర వర్గం అందుకుంది. రాజయ్యకు టికెట్ ఇవ్వొద్దనే డిమాండ్‌తో ఇప్పటికీ ధర్నాలు, నిరసనలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో రోజుకో చోట ముఖ్య కార్యకర్తల సమావేశాలు జరుగుతున్నాయి. అవినీతి, కమీషన్ల దందా ఉన్న రాజయ్యకు టికెట్ ఇస్తే తాము సహకరించబోమని ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. సోషిల్ మీడియా మాధ్యమంగా రాజయ్య నైతికతపై దాడులకు తెగబడుతున్నారు. 20 రోజుల కిందట ఒక మహిళతో సెల్ఫోన్లో చేసిన సంభాషణను వైరల్ చేశారు. దళిత ఉప జాతులను ఉద్దేశించి మాట్లాడినట్టు రాజయ్య స్వరాన్ని పోలిన మాటల వీడియో తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పరిస్థితి ఇలానే కొనసాగితే అక్కడ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ములుగులో ముసలం.. ములుగు నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మాజీ మంత్రి చందూలాల్‌కు ఇచ్చిన టికెట్ రద్దు చేయాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. మొదట అబ్బాపురం ఎంపీటీసీ సభ్యుడు గోవింద్ నాయక్ లేవనెత్తిన తిరుగుబాటుకు ఇతర ద్వితీయ శ్రేణి నాయకత్వం జత కలిసింది. ములుగు జెడ్పీటీసీ సభ్యుడు, జెడ్పీ ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్, మంగపేట జెడ్పీటీసీ సభ్యుడు సిద్ధంశెట్టి వైకుంఠంతోపాటు పలువురు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అబ్బాపురం ఎంపీటీసీ సభ్యుడు పోరిక గోవింద్‌నాయక్‌కుగానీ, మరెవరికైనా టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. నియోజకవర్గంలోని దాదాపు 20 మంది టీఆర్ఎస్ ముఖ్యనేతలు మంగపేటలో సమావేశమై చందూలాల్‌కు సహకరించబోమని తీర్మానించారు. వాళ్ల ఆధ్వర్యంలో ఇటీవల ములుగులో భారీ ర్యాలీ నిర్వహించి సత్తా చాటారు. చందూలాల్‌కు కాకుండా మరో వ్యక్తికి టికెట్ ఇస్తే గెలుపించుకుని కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తామని, లేకుంటే స్వతంత్రంగా బరిలో నిలబడుతామని వారు హెచ్చరించారు. ఆ నాలుగు నియోజకవర్గాల్లో ... పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు అభ్యర్థిత్వాన్ని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు వ్యతిరేకిస్తున్నారు. ఎర్రబెల్లితో పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి ఆగిపోయిందని విమర్శిస్తున్నారు. ఇటీవల తక్కెళ్లపల్లి మద్దతుదారులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. తన మద్దతుదారులతో కలిసి గ్రామల్లో తిరుగుతున్నారు. మహబూబాబాద్ నుంచి టీఆర్ఎస్ టికెట్‌ను ఆశించి భంగపడిన మోహన్‌లాల్ తిరిగి టీడీపీలోకి వెళ్లిపోయారు. ఎక్సైజ్ అధికారిగా పనిచేస్తున్న ఆయన గత ఎన్నికల్లో టీడీపీ తరఫున మహబూబాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. టికెట్ రాకపోవడంతో ఆయన తిరిగి సొంత గూటికి వెళ్లిపోయారు. మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత వర్గం కూడా శంకర్ నాయక్‌కు సహకరించే యోచనలో లేనట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఇక డోర్నకల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన సత్యవతి రాథోడ్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు గానీ.. ఎంత కాలం ఇలా మౌనంగా ఉందామని, తిరిగి సొంత గూటికి వెళ్లిపోదామని కార్యకర్తలు ఆమెపై ఒత్తిడి తెస్తున్నట్లు గుర్తించారు. జనగామ నియోజకవర్గంలో కూడా ఓ వర్గం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకు చీలిపోయే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు తెలిసింది. -
ఎక్కువ ఓట్లు వేయిస్తే నగదు నజరానాలు
గీసుకొండ: అధికంగా ఓట్లు వేయించిన కార్యకర్తలు, నాయకులకు రూ.50 వేలు నజరానాలు ఇస్తానని పరకాల తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుకొండ మండలం కొనాయమాకులలో బుధవారం సంగెం మండల టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ కమిటీల సభ్యులతో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికంగా ఓట్లు పడిన గ్రామానికి రూ.లక్ష నగదును నజరానాగా ఇస్తానని ప్రకటించారు. -
రైట్.. రైట్.. !
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సార్వత్రిక ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా రేసు గుర్రాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. పలు సర్వేల ఫలితాలే కాకుండా స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకుని టీఆర్ఎస్ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు కావడంతో వారందరూ ప్రచారంలో నిమగ్నమయ్యారు. మరోవైపు విపక్షాలు మహాకూటమిగా బరిలో నిలవాలనే నిర్ణయానికి వచ్చినా సీట్ల కేటాయింపు ఓ కొలిక్కి రాకపోవడంతో కొంత సందిగ్ధత నెలకొంది. అయితే ఉమ్మడి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చేసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు. సందిగ్ధత విపక్ష పార్టీలన్ని కలిసి మహాకూటమిగా ఎన్నికల బరిలో నిలవడానికి కసరత్తు చేస్తున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో అయోమయం నెలకొంది. కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల మాత్రమే కాస్త స్పష్టత ఉంది. అంతేకాదు పార్టీ ఆధ్వర్యాన దరఖాస్తులు ఆహ్వానించగా సిట్టింగ్‌లు ఉన్న చోట ఇతరులెవరూ పెద్దగా పోటీకి రాలేదు. దీంతో తాజా మాజీలకే కాంగ్రెస్ తరఫున టికెట్లు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొడంగల్, గద్వాల, అలంపూర్‌తో పాటు కల్వకుర్తి విషయంలో స్పష్టత వచ్చేసినట్లయింది. అయితే, అధికారికంగా మాత్రం పేర్లు ప్రకటించలేదు. ఇక మహాకూటమి ఏర్పాటు కానున్న నేపథ్యంలో టీడీపీ, తెలంగాణ జనసమితి పార్టీలు జిల్లా నుం చి కొన్ని స్థానాలను కోరుతున్నాయి. అదే విధంగా కూటమి, మిత్రపక్షాలతో సంబంధం లేకపోయినా నారాయణపేట, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాలలో బరిలో నిలిచే ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. గద్వాల ఈసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాన దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం గద్వాల. ఇక్కడి నుంచి వరుసగా కాంగ్రెస్ అభ్యర్థి డీకే.అరుణ గెలుపొందడం.. రాష్ట్ర స్థాయిలో కీలక నేతగా ఎదగడంతో టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. కాంగ్రెస్‌కు బలంగా ఉన్న నియోజకవర్గాన్ని ఢీకొట్టాలని టీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి టికెట్ కేటాయించిన అధిష్టానం.. అసమ్మతి నేతలను సైతం దారిలో పెడుతోంది. మరోవైపు కాంగ్రెస్ తరఫున డీకే.అరుణ బరిలో నిలవడం దాదాపు ఖరారు కావడంతో.. ఆమె కూడా ప్రచారంలో మునిగిపోయారు. కాంగ్రెస్‌కు కంచు కోటలా తయారైన గద్వాలలో మరోసారి జెండా ఎగురవేయాలని ఆమె ఉవ్విళ్లూరుతున్నారు. అలాగే ఈ నియోజకవర్గం నుంచి ఈసారి బీజేపీ కూడా బరిలో నిలవాలని కసరత్తు చేస్తోంది. అందుకోసం రాజవంశానికి చెందిన వెంకటాద్రిరెడ్డిని పోటీలో దించాలని అధిష్ఠానం యోచిస్తోంది. అలంపూర్ నడిగడ్డకు చెందిన మరో కీలకమైన నియోజకవర్గం అలంపూర్‌లో ఈసారి పోరు రసవత్తరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే ఎస్.ఎ.సంపత్‌కుమార్‌కు టికెట్ ఖరారయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడి నుంచి ఆర్డీఎస్లో ఈఈగా పనిచేసి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్న వరప్రసాద్ కూడా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ తాజా మాజీ కావడంతో సంపత్‌కే టికెట్ దక్కొచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక టీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహంకు టికెట్ ఖరారు కాగా ఆయన ముమ్మర ప్రచారం చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడి నుంచి వైఎస్సార్ సీపీ తరఫున జెట్టి రాజశేఖర్ బరిలో నిలవడం దాదాపు ఖాయమైంది. ఈ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్‌కు ఆనుకుని ఉండడం.. వైఎస్సార్సీపీ కాస్త పటిష్టంగా ఉండడంతో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో అలంపూర్‌లో త్రిముఖ పోరు నెలకొంటుందని చెప్పొచ్చు. కల్వకుర్తి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచే కల్వకుర్తిలో ఈసారి పోరు రసవత్తరంగా మారుతోంది. గతంలో ఎన్టీ.రామారావును ఓడించడంతో పాటు 2014 ఎన్నికల్లో కేవలం ఈవీఎం లు మొరాయించడం, మళ్లీ నిర్వహించిన పోలింగ్‌లో కేవలం 74 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడం వంటి అంశాలు ఈ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. అయితే ఈసారి నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొనే అవ కాశం ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి అభ్యర్థిత్వం దాదా పు ఖరారైనట్లే. అయితే ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్ బరిలో నిలవాలని యోచిస్తున్నా... వంశీచంద్ తాజా మా జీ కావడంతో మరోసారి అవకాశం లభించొ చ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. టీఆర్ఎస్ తరఫున ఇది వరకే మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు టికెట్ ఖరారు చేశారు. మరోవైపు బీజేపీ తరఫున తన్నోజు ఆచారి బరిలో నిలవడం దాదాపు ఖాయమైంది. బీజేపీ తరఫున ఆచారి గత నాలుగు పర్యాయాలుగా పోటీ చేయడం, గత ఎన్నికల్లో అతి స్వల్ప తేడాతో ఓటమి పాలవడంతో ఈసారి విజయం సాధించాలన్న కృతనిశ్చయంతో ముమ్మర కసరత్తు చేస్తున్నారు. కొడంగల్ మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలో పరిధిలో ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డికి టికెట్ ఖరారు చేశారు. దీంతో ఆయన నియోజకవర్గం మొత్తంలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో తమకు కొరకరాని కొయ్యలా తయారైన రేవంత్‌రెడ్డిని ఈసారి ఎలాగైనా మట్టి కరిపించాలని కసరత్తు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ తరఫున రేవంత్‌రెడ్డి బరిలో నిలవడం దాదాపు ఖరారైంది. సిట్టింగ్ అభ్యర్థి కావడంతో పాటు ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం దరఖాస్తులు ఆహ్వానించగా రేవంత్ నుంచి మాత్రమే దరఖాస్తు అందింది. దీంతో మరెవరి నుంచి పోటీ లేకపోవడంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థి విషయంలో స్పష్టత వచ్చేసినట్లయింది. అదే విధంగా వైఎస్సార్సీపీ నుంచి నియోజకవర్గ సమన్వయకర్త తమ్మళ్లి బాల్‌రాజ్, బీజేపీ నుంచి నాగూరావ్ నామాజీ పోటీలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీల అధిష్టానాలు ఆయా నేతలకు సూచనప్రాయంగా చెప్పేయడంతో పోటీలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. -
కారు ఎందుకు దిగుతున్నారు?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది మరోసారి అధికారం కైవసం చేసుకోవాలని భావిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి అసంతృప్త నేతల నుంచి సెగ తాకుతోంది. అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే ఉమ్మడి పాలమూరులోని 14 అసెంబ్లీ స్థానాలకు బరిలో నిలిచే అభ్యర్థులను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అయితే ఉమ్మడి జిల్లాలోని నాలుగైదు చోట్ల అసంతృప్తులు భగ్గుమన్నారు. కల్వకుర్తి, అలంపూర్, గద్వాల, మక్తల్, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో అసంతృప్తనేతలు ఆందోళనలు, ప్రత్యేక సమావేశాలు చేపట్టారు. దీంతో ముఖ్యనేతలు రంగప్రవేశం చేసి అసంతృప్తులను శాంతింపజేసేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే, ఒక మక్తల్ నియోజకవర్గంలోని అసంతృప్త నేతలను ఇప్పటివరకు ముఖ్యనేతలు పిలిచి మాట్లాడకపోవడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పైగా ఈ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా గళాలు రోజురోజుకు పెరుగుతుండడంపై ఆయన అనుచరులు అనుమాలు వ్యక్తం చేస్తున్నారు. చిట్టెంపై కుట్ర జరుగుతోందని వారు మండిపడుతున్నారు. దీంతో మక్తల్ రాజకీయ వ్యవహారం ఎటు దారి తీస్తుందోననేది చర్చనీయాంశంగా మారింది. సముదాయించిన నేతలు రానున్న ఎన్నికల్లో బరిలో నిలవాలని ఆశించిన భంగపడిన వారిని ముఖ్యనేతలు రంగంలోకి దిగి సముదాయిస్తున్నారు. కల్వకుర్తిలో టిక్కెట్టు ఆశించి దక్కకపోవడంతో ఏకంగా బాలాజీసింగ్ అనుచరులు ఏకంగా పార్టీ అధినేత కేసీఆర్ దిష్టిబొమ్మనే దగ్ధం చేశారు. అలాగే ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయాణరెడ్డి అనుచరులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కల్వకుర్తిలో పార్టీ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌కు సహకరించాలంటూ ఏకంగా మంత్రి కేటీఆర్ బుజ్జగించారు. జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా ఎమ్మెల్సీ కసిరెడ్డితో పాటు గోలి శ్రీనివాస్‌రెడ్డి, బాలాజీసింగ్, మార్కెట్‌కమిటీ చైర్పర్సన్ విజితారెడ్డి తదితరులను మంత్రి కేటీఆర్ వద్దకు తీసుకెళ్లి సముదాయించారు. అలాగే అలంపూర్, గద్వాల నియోజకవర్గాలలో నెలకొన్న పరిస్థితిని మంత్రి హరీశ్‌రావు సరిదిద్దారు. అలంపూర్‌లో మాజీ ఎంపీ మందా జగన్నాథం, అతని కుమారుడు మందా శ్రీనాథ్‌ను పిలిపించి భవిష్యత్‌లో పార్టీ మరిన్ని అవకాశాలు కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. అలాగే గద్వాల నియోజకవర్గానికి సంబంధించి గట్టు తిమ్మప్ప, బక్క చంద్రన్న, ఆంజనేయులు గౌడ్ వంటి నేతలను మంత్రి హరీశ్‌రావు పిలిపించుకుని పార్టీ అభ్యర్థి బండ్ల చంద్రశేఖర్‌రెడ్డికి సహకరించాలని సూచించారు. ఇలా మొత్తం మీద ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్త జ్వాలలు కాస్త సద్దుమణిగాయి. మక్తల్ విషయంలో కాస్త భిన్నం ఉమ్మడి జిల్లాలోని అసంతృప్తులను సముదాయించిన టీఆర్ఎస్ ముఖ్యనేతలు.. మక్తల్ విషయం లో కాస్త భిన్నంగా వ్యవహరించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. మక్తల్‌లో టీఆ ర్ఎస్ నేతలు కాంట్రాక్టర్ జలంధర్‌రెడ్డి, నేతలు రాజుల ఆశిరెడ్డి, గవినోళ్ల గోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గంగాధర్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఎల్కోటి ఎల్లారెడ్డి నలుగురు కుమారులు అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. ఆత్మగౌరవ నినాదం పేరిట ప్రతీ మండల కేంద్రాల్లో సభలు నిర్వహిస్తున్నారు. టికెట్ ప్రకటన వచ్చిన నాటి నుంచి బుధవారం వరకు కూడా రోజుకో చోట ఈ సభలు జరుగుతూనే ఉన్నాయి. అయితే గతంలో వీరిని మంత్రి కేటీఆర్ పిలిచి మాట్లాడినట్లు ప్రచారం జరిగింది. అసంతృప్తనేతలు మాత్రం తమను ఎవరూ పిలవలేదని, సంప్రదింపులు చేపట్టలేదని ప్రకటించారు. మక్తల్‌లో అభ్యర్థిని మార్చే వరకు ఆందోళనలు చేపడతామని స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని అసంతృప్తులను సముదాయించిన ముఖ్యనేతలు మక్తల్ విషయంలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశమైంది. అనుచరుల ఆందోళన మక్తల్ తాజా మాజీ ఎమ్మెల్యే, రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పట్ల కుట్ర జరుగుతోందని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ప్రగతి నివేదన సభకు ఒక రోజు ముందు అసంతృప్తనేతలంతా సమావేశం కావడం, అనంతరం వారందరూ మంత్రి లక్ష్మారెడ్డి కలవడం చకచకా జరిగిపోయాయి. తాజాగా టికెట్లను ప్రకటించిన తర్వాత ఉమ్మడి జిల్లాలోని అసంతృప్తులను శాంతపరిచిన ముఖ్యనేతలు మక్తల్ విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదనేది అంతుచిక్కని ప్రశ్నగా మారిందంటున్నారు. అంతేకాదు ఆందోళనను ముందుండి నడిపిస్తున్న వారందరూ.. పార్టీలోని జిల్లా ముఖ్యనేతలతో అత్యంత సన్నిహితంగా మెలుగుతారనే ప్రచారం ఉంది. సదరు నేతలైనా అసంతృప్తులను పిలిచి వివాదాన్ని చల్లార్చాల్సి ఉన్నా.. వారు మౌనంగా ఉండడం చిట్టెం వర్గీయుల ఆందోళనకు కారణమవుతోంది. అభ్యర్థిని మార్చండి.. పార్టీని బతికించండి.. కృష్ణా (మాగనూర్): మక్తల్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని మా ర్చాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు పలువు రు ‘చిట్టెం హఠావో.. టీఆర్ఎస్ బచావో’ నినా దంతో బుధవారం కృష్ణా మండల కేంద్రంలో ఆత్మగౌరవ సభను నిర్వహించారు. ఈ సభకు కృష్ణా, మాగనూర్ ఉమ్మడి మండలాల నుండి కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజుల ఆశిరెడ్డి, గవినోళ్ల గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌గుప్తా, జలేందర్‌రెడ్డి, ఎల్కోటి జనార్దన్‌రెడ్డి, పురం వెంకటేశ్వర్‌రెడ్డి, నర్వ వెంకట్‌రెడ్డి, నీలప్ప, మల్లేష్, తాయప్పగౌడ్ మాట్లాడారు. నియోజకవర్గంలోని ఏ గ్రామంలో చూసినా టీఆర్ఎస్ హయాంలో జరిగిన పనులే కనిపిస్తున్నాయని తెలిపారు. కేసీఆర్ హయాంలో అభివృద్ధి ఎంతో గొప్పగా జరిగినా.. తాజా మాజీ ఎమ్మెల్యే కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా వ్యహరిస్తున్నాడని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలు, రైతులకు సబ్సిడీ ట్రాక్టర్ల మంజూరులో అక్రమాలు జరిగాయన్నారు. కాంగ్రెస్ నుంచి తనతో వచ్చిన వారికే అవకాశాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. అయితే, తాజా మాజీ ఎమ్మెల్యేనే మళ్లీ అభ్యర్థిగా ప్రకటించినందున... మార్చాలనే డిమాండ్‌తో ఉద్యమకారుల ఆధ్వర్యాన ఆత్మగౌరవ సభలను ప్రతీ మండలంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. కాగా, రాంమోహన్‌రెడ్డికి కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా విజయం సులవవుతుందని వారు తెలిపారు. సమావేశంలో నాయకులు ఆంజనేయులు, కృష్ణయ్య, నీలకంఠరాయ, లక్ష్మణ్, జనార్దన్, మొల్ల బాబు, భీంసీ, తదితరులు పాల్గొన్నారు. -
‘కారు’ స్పీడ్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ముందస్తు ఎన్నికలకు వెళ్తూ.. ముందు చూపుతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభ్యర్థులను ఖరారు చేయగా... విపక్షాలు ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. పొత్తులు, ఎత్తులతో విపక్ష పార్టీలు వ్యూహరచనల్లో మునిగి ఉంటే... అధికార పార్టీ అభ్యర్థులు మాత్రం జనంలోకి చొచ్చుకుపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులంతా దాదాపుగా ప్రచార కార్యక్రమానికి తెరలేపారు. మహాకూటమిగా ప్రజల వద్దకు వెళ్లాలని భావిస్తున్న కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్, సీపీఐ పొత్తు ఇప్పట్లో పొడిచే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్, ఇతర పక్షాల అభ్యర్థులనుప్రకటించిన తరువాత వ్యూహాత్మకంగా కమలం అభ్యర్థులను రంగంలోకి దించాలని బీజేపీ చూస్తోంది. ఈ నెలాఖరు వరకు ఈ తతంగం కొనసాగుతూనే ఉంటుందని భావిస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని కార్యక్షేత్రంలోకి దిగారు. వినాయక నిమజ్జనం తరువాత మరింత దూకుడుగా ముందుకు సాగాలని పలువురు టీఆర్ఎస్ అభ్యర్థులు భావిస్తున్నారు. భిన్న మార్గాల్లో మంత్రుల వ్యూహాలు ఆదిలాబాద్ నియోజకవర్గంలో మంత్రి జోగు రామన్న ప్రచారంలో ఇప్పటికే దూసుకుపోతున్నారు. ఆదిలాబాద్, జైనథ్, బేల మండలాల్లో మూడురోజులుగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లో తిరుగుతూ మరోసారి తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. వందలాది మంది కార్యకర్తలు, స్థానిక ప్రజలతో కలిసి రామన్న చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కూడా బాగానే ఉంది. మరో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వ్యూహాత్మకంగా నిర్మల్‌లో పావులు కదుపుతున్నారు. ప్రచారానికి చాలా సమయం ఉందన్న ఉద్దేశంతో విపక్ష పార్టీల నుంచి ముఖ్య నాయకులుగా ఉన్న వారిని టీఆర్ఎస్లోకి తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థిగా మహేశ్వర్‌రెడ్డి బరిలో నిలవనుండడం, బీజేపీలో ఇటీవల చేరిన మాజీ డిప్యూటీ స్పీకర్ భీంరెడ్డి కూతురు డాక్టర్ స్వర్ణారెడ్డి పోటీ చేయనుండడంతో ఆయన తనదైన శైలిలో ఆయా పార్టీలను బలహీనపరిచే దిశగా చర్యలు చేపట్టారు. మండలాల నుంచి చేరికలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తేలని కూటమి లెక్కలతో విపక్షాలు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎఫ్, సీపీఐ పార్టీలు కూటమిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పది స్థానాల్లో ఏ పార్టీకి ఎక్కడ సీటు దక్కే అవకాశం ఉందో తెలియని స్థితి నెలకొంది. పదింట కనీసం రెండింటిని మిత్రపక్షాలకు వదిలేసే పరిస్థితి కాంగ్రెస్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు సీటు కోసం ప్రయత్నాలు చేసే పనిలోనే పడ్డారు. కాగా సీటు ఖాయమన్న ధీమాతో ఉన్న నాయకులు మాత్రం తమదైన శైలిలో జనంలోకి వెళుతున్నారు. నిర్మల్‌లో సీటు ఖాయమైన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తన వర్గానికి సీట్లు ఇప్పించుకునే బిజీలో ఉన్నారు. మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు గత 15 రోజులుగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సాగిస్తున్నారు. ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న చీరల పంపిణీ కార్యక్రమానికి గ్రామాల్లో మంచి స్పందనే లభిస్తోంది. కొత్తగా పార్టీలో చేరిన పాల్వాయి హరీష్‌రావు ఇప్పటికే సిర్పూరును చుట్టి వచ్చారు. ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు తనకే టిక్కెట్టు ఖాయమన్న ధీమాతో ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమయ్యారు. మిగతా చోట్ల టికెట్ల పాట్లతో పాటు పొత్తుల్లో సీట్లు పోకుండా కాపాడుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్ నేతలున్నారు. బీజేపీలో కొత్త నేతలను వ్యతిరేకిస్తున్న సీనియర్లు ఉమ్మడి జిల్లాలో బోణీ కొట్టాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ గూటికి వచ్చిన వారందరినీ పార్టీలో చేర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో టికెట్లపై జరుగుతున్న ప్రచారాన్ని సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మంచిర్యాలలో పార్టీ అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డిని కాదని ఎన్నారైని ప్రోత్సహిస్తుండడాన్ని స్థానిక పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. మంచిర్యాలలో మల్లారెడ్డికే సీటు ఇవ్వాలనే డిమాండ్ పెరిగింది. ఆసిఫాబాద్‌లో తాజా మాజీ సర్పంచి సరస్వతిని బీజేపీలోకి తీసుకొచ్చి టికెట్టు ఇవ్వాలని జరుగుతున్న ప్రయత్నాలపై సిర్పూరు(టి) జెడ్పీటీసీ అజ్మీరా రాంనాయక్ వర్గం భగ్గుమంది. ఆసిఫాబాద్‌లో రాంనాయక్కే టికెట్టు ఇవ్వాలని బీజేపీ నాయకులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ మేరకు అధిష్టానానికి కూడా లేఖలు పంపారు. పార్టీ కోసం అహర్నిషలు పాటుపడుతూ, ప్రజా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజాభిమానం చూరగొన్న నాయకులకు అన్యాయం చేయవద్దని పేర్కొన్నారు. ఇతర పార్టీల తరహాలో బీజేపీలో కుట్రలకు ఆస్కారం ఉండదని, తనకే ఆసిఫాబాద్ టిక్కెట్టు అని రాంనాయక్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ప్రచారానికి తాజా మాజీల శ్రీకారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది మంది టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంతో జనంలోకి వెళ్తున్నారు. మంచిర్యాల తాజా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అభ్యర్థిత్వం ఖరారైన నాటి నుంచే ప్రచారంలో మునిగిపోయారు. మంచిర్యాల పట్టణంతో పాటు దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లోని గ్రామాల్లో ప్రతిరోజు పర్యటిస్తున్నారు. బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య కాసిపేట, బెల్లంపల్లిలో ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. చెన్నూరులో అభ్యర్థిగా ఖరారైన పెద్దపల్లి ఎంపీ వారం క్రితమే భారీ ర్యాలీతో ప్రచారం ప్రారంభించారు. అయితే టికెట్టు కోల్పోయిన తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అనుచరుడు గట్టయ్య ఆత్మహత్యాయత్నం, తర్వాత అతడి మృతి కొంత ఇబ్బందిని కలిగించింది. గత సోమవారం గద్దెరాగడిలో సొంతిల్లు నిర్మాణానికి భూమిని కొనుగోలు చేసేందుకు వచ్చిన సుమన్ 22వ తేదీ నుంచి ప్రచారాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించారు. సిర్పూరులో కోనేరు కోనప్ప రోజుకో మండలంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మందీ మార్బలంతో ఆయన చేస్తున్న ప్రచారం గిరిజన గ్రామాల్లో ఉత్సాహంగా సాగుతోంది. ఆసిఫాబాద్‌లో కోవ లక్ష్మి ఇప్పటికే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ముధోల్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి చేరికలకు ప్రాధాన్యతనిస్తున్నారు. బోథ్‌లో రాథోడ్ బాపూరావు, ఎంపీ జి.నగేష్ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఖానాపూర్‌లో రేఖానాయక్ అసమ్మతిని ఎదురొడ్డి తనదైన శైలిలో ప్రజల ముందుకు వెళ్తున్నారు. -
గులాబీ పార్టీలో తగ్గని అసమ్మతి
రాష్ట్ర శాసనసభ రద్దుతో పాటు ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. జహీరాబాద్ మినహా జిల్లాలోని మిగతా నాలుగు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. పేర్లను ఖరారు చేసి పది రోజులు కావస్తున్నా పార్టీ నేతల్లో నెలకొన్న అసమ్మతి పర్వానికి తెరపడడం లేదు. టికెట్లు ఆశించి భంగపడిన నేతలు, అభ్యర్థులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నాయకులు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. అసమ్మతిని చల్లార్చేందుకు ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పటాన్చెరు, నారాయణఖేడ్‌లో అసమ్మతి స్వరం తీవ్ర స్థాయిలో ఉండడంతో ప్రత్యేక దృష్టి సారించారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా నుంచి రాష్ట్ర శాసనభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఈ నెల 7న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. జహీరాబాద్ స్థానంలో అభ్యర్థి పేరును ఖరారు చేయకుండా పెండింగ్‌లో పెట్టారు. అందోలు నియోజకవర్గంలో తాజా, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ను తప్పించి, ఆయన స్థానంలో పాత్రికేయుడు క్రాంతి కిరణ్‌కు అవకాశం ఇచ్చారు. జిల్లాలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించి పది రోజులు కావస్తున్నా, అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. అభ్యర్థులను ప్రకటించిన వెంటనే జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అసమ్మతి నేతలు స్వరం విప్పారు. పటాన్చెరు, నారాయణఖేడ్, సంగారెడ్డి, నర్సాపూర్‌లో పార్టీ ప్రకటించిన అభ్యర్థులను మార్చాలంటూ సొంత పార్టీ నేతల నుంచే డిమాండ్లు వినిపించాయి. ఉద్యమ సమయంలో పదవీ త్యాగం చేసిన తనకు టికెట్ ఎందుకు ఇవ్వరంటూ సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ ప్రెస్‌మీట్ నిర్వహించి తన ఆవేదన వెల్లగక్కారు. పటాన్చెరులో సపాన్‌దేవ్, గాలి అనిల్ కుమార్, కొలను బాల్‌రెడ్డి, జె.రాములు తదితర నేతలు ఉమ్మడి ప్రెస్మీట్లో అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు. నారాయణఖేడ్‌లో పార్టీ అభ్యర్థి భూపాల్‌రెడ్డిని మార్చాలంటూ అసమ్మతి నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నర్సాపూర్‌లో తాజా మాజీ ఎమ్మెల్యేకు సహకరించేది లేదని హత్నూర జెడ్పీటీసీ సభ్యులు జయశ్రీ తదితరులు తెగేసి చెప్పారు. అసమ్మతి వర్గంతో మంతనాలు.. పార్టీలో నెలకొన్న అసమ్మతిని అభ్యర్థులే పరిష్కరించుకోవాలని టీఆర్ఎస్ అధిష్టానం నుంచిసంకేతాలు అందాయి. అసమ్మతికి దారితీస్తున్న కారణాలను విశ్లేషించుకుని పనితీరు మార్చుకోవాల్సిందిగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 8న హైదరాబాద్‌లో జరిగిన పార్టీ అభ్యర్థుల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పార్టీ వైఖరిని స్పష్టం చేసినట్లు తెలిసింది. పార్టీ సంకేతాలను సీరియస్‌గా తీసుకున్న సంగారెడ్డి, పటాన్చెరు, అందోలు అభ్యర్థులు అసంతృప్తి నేతలతో వరుసగా మంతనాలు జరుపుతున్నారు. నేరుగా వారికి ఇళ్లకు వెళ్లి ఎన్నికల్లో మద్దతు పలకాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. నారాయణఖేడ్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులుగా మరోమారు అవకాశం దక్కించుకున్న తాజా మాజీ ఎమ్మెల్యేలు మాత్రం అసమ్మతి నేతలతో దూరం పాటిస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో రోజురోజుకూ విభేదాలు మరింత తీవ్రం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అసమ్మతి నేతలతో హరీశ్ భేటీ.. పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో అసమ్మతి స్వరం బలంగా వినిపిస్తున్న నేతలతో మంత్రి హరీశ్‌రావు మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని తన నివాసంలో భేటీ అయ్యారు. సపాన్‌దేవ్, అనిల్‌కుమార్, బాల్‌రెడ్డి, జయరాములుతో పాటు కొందరు తాజామాజీ సర్పంచ్‌లు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. పార్టీకి నష్టం కలిగించే రీతిలో తొందరపాటు చర్యలకు పూనుకోవద్దని హరీశ్ అసమ్మతి నేతలకు సర్ది చెప్పినట్లు సమాచారం. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు సమయం తీసుకుంటానని హామీ ఇవ్వడంతో బుధవారం వరకు వేచి చూడాలని అసమ్మతి స్వరం వినిపిస్తున్న నేతలు నిర్ణయించుకున్నారు. సంగారెడ్డిలో అసమ్మతి నేతలతో సఖ్యత కోసం పార్టీ అభ్యర్థి చింతా ప్రభాకర్ సొంత ప్రయత్నాలు చేస్తుండగా, ఒకరిద్దరు నేతలతో త్వరలో హరీశ్ భేటీ కానున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో అసమ్మతి నేతలతో సంప్రదింపుల బాధ్యతను పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్‌కు అప్పగించారు. ఇప్పటికే ఒక దఫా అసమ్మతి నేతలతో హరీశ్ సమావేశం కాగా, మరోసారి పూర్తి స్థాయిలో భేటీ జరపాలని నిర్ణయించారు. జిల్లాలోని అసమ్మతి నేతల జాబితాపై ఇప్పటికే స్పష్టత వచ్చిందని, వారం రోజుల్లో పార్టీలో అసమ్మతి, అసంతృప్తి సమసిపోతుందని భేటీల ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్న నేత ఒకరు వ్యాఖ్యానించారు. పటాన్చెరు, నర్సాపూర్‌కు చెందిన ఇద్దరు అసమ్మతి నేతలు మాత్రం టికెట్ దక్కకుంటే వేరే పార్టీలోకి వెళ్తామంటూ సంకేతాలు ఇస్తున్నారు. -
బాబ్లీ కేసులో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే
జుక్కల్ (నిజామాబాద్): మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణాని కి అడ్డుపడిన కేసులో జుక్కల్ తాజా మాజీ ఎమ్మె ల్యే హన్మంత్‌సింధే ఉన్నారు. దీంతో అరెస్టు వారెం ట్ జారీ అయ్యేనా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2010లో నాటి ఉమ్మడి ఏపీలో టీడీపీ అధినేత బాబ్లీ ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా చంద్రబాబుతోపాటు ఎమ్మెల్యేల్లో హన్మంత్ సింధే ఉన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నీటి సమస్య కావడం, ఓవైపు తెలంగాణ ఉద్య మం ఉండడం బాబ్లీ ప్రాజెక్ట్‌కు వెళ్లిన టీడీపీ బృందాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసి జైలులో పెట్టారు. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలవ్వడం, ప్రస్తుతం హన్మంత్ సింధే ఎన్నికల ప్రచారం లో బిజీగా ఉన్నారు. దీం తో చంద్రబాబు ఉచ్చు త న మెడకు బిగిస్తుందా అని హన్మంత్‌సింధే ఆం దోళన లో ఉన్నారు. ఎమ్మెల్యే నాన్ బెయిల్‌బుల్ వారెంట్ నోటీసులు అందితే చంద్రబాబుతో సహ హన్మంత్‌సింధే కూడా జైలుకు వెళ్లె పరిస్థితి ఉందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. బాబ్లీ కేసు తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలా బయటపడుతారో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ
- మండిబజార్‌లో ఉద్రిక్తత - ఆందోళనతో దుకాణాలు - మూసివేయించిన పోలీసులు పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : వరంగల్ నగరంలోని మండిబజార్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఆదివారం సాయంత్రం జరి గిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు రంగం ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేయడంతో వివాదం సద్దుమణిగింది. వివరాలి లా ఉన్నాయి. నగ రంలోని మండిబజార్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఆదివా రం సాయంత్రం ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని కొండా సురేఖకు వ్యతిరేకంగా ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేస్తుండగా, అదే సమయంలో ఆమె ర్యాలీగా ప్రచారం చేస్తూ అక్కడికి చేరుకున్నారు. ర్యాలీని చూడగానే సురేఖకు వ్యతిరేకంగా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహించిన టీఆ ర్ఎస్ కార్యకర్తలు వారి దగ్గర ఉన్న కరపత్రాల ను లాక్కున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ వారు దాడులు చేశారని ఆరోపిస్తూ మండిబజార్‌లో సురేఖ బైఠాయిం చారు. న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ ఘటనతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న వరంగల్ డీఎస్పీ హిమావతి చేరుకుని ధర్నా విరమించాలని సురేఖను కోరారు. ఆమె వినకపోవడంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. ఈ క్ర మంలో ఆందోళనకారులు డీఎస్పీ హిమావతిని నె ట్టేశారు. దీంతో పోలీసులు కొందరు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక మండిబజార్‌లో షాప్‌లను మూయించా రు. ఎట్టకేలకు ఇరువర్గాలను శాంతింపజేసి ఎటువాళ్లను అటు పంపించారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో తెలంగాణ బీసీ జేఏసీ వరంగల్ తూర్పు మాజీ కన్వీనర్ మడిపెల్లి సుశీ ల్ గౌడ్, బండారి సదానందం, బోయిని దుర్గాప్రసాద్, చాగంటి నాగేందర్, విజయ్ ఉన్నారు. మట్టెవాడలోనూ స్వల్ప ఉద్రిక్తత నగరంలోని మట్టెవాడలోనూ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ పక్క మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, మరోవైపు బస్వరాజు శ్రీమాన్ ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రచార ర్యాలీలు ఎదురుపడగానే కార్యకర్త లు నినాదాలు రెట్టించారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మట్టెవాడ పోలీసులు చేరుకుని ఇరు పార్టీల వారిని శాంతింపజేశారు. ప్రచారం ముగించుకుని వెళుతున్న కొండా ము రళీ కారుకు కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురొచ్చి చేయి గుర్తుకు ఓటేయాలని...జై కాంగ్రె స్.. జైజై కాంగ్రెస్.. అని నినాదాలు చేశారు. పోలీసులు వచ్చి ఆయన కారు వెళ్లేలా సైడ్ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలకు మురళీ చిరునవ్వుతో అభివాదం చేసుకుంటూ ముందుకెళ్లా రు. వెనుకాల వస్తున్న ఎంబాడి రవీందర్ వాహనాన్ని కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నా రు. పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టారు.