టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ | trs,congress leaders centralis clash | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ

Published Mon, Apr 28 2014 4:16 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

trs,congress leaders centralis clash

- మండిబజార్‌లో ఉద్రిక్తత
- ఆందోళనతో దుకాణాలు  
- మూసివేయించిన పోలీసులు

 
 పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : వరంగల్ నగరంలోని మండిబజార్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఆదివారం సాయంత్రం జరి గిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు రంగం ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేయడంతో వివాదం సద్దుమణిగింది. వివరాలి లా ఉన్నాయి. నగ రంలోని మండిబజార్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఆదివా రం సాయంత్రం ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని కొండా సురేఖకు వ్యతిరేకంగా ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేస్తుండగా, అదే సమయంలో ఆమె ర్యాలీగా ప్రచారం చేస్తూ అక్కడికి చేరుకున్నారు. ర్యాలీని చూడగానే సురేఖకు వ్యతిరేకంగా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహించిన టీఆ ర్‌ఎస్ కార్యకర్తలు వారి దగ్గర ఉన్న కరపత్రాల ను లాక్కున్నారు.

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ వారు దాడులు చేశారని ఆరోపిస్తూ మండిబజార్‌లో సురేఖ బైఠాయిం చారు. న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ ఘటనతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న వరంగల్ డీఎస్పీ హిమావతి చేరుకుని ధర్నా విరమించాలని సురేఖను కోరారు. ఆమె వినకపోవడంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. ఈ క్ర మంలో ఆందోళనకారులు డీఎస్పీ హిమావతిని నె ట్టేశారు.

దీంతో పోలీసులు కొందరు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక మండిబజార్‌లో షాప్‌లను మూయించా రు. ఎట్టకేలకు ఇరువర్గాలను శాంతింపజేసి ఎటువాళ్లను అటు పంపించారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో తెలంగాణ బీసీ జేఏసీ వరంగల్ తూర్పు మాజీ కన్వీనర్ మడిపెల్లి సుశీ ల్ గౌడ్, బండారి సదానందం, బోయిని దుర్గాప్రసాద్, చాగంటి నాగేందర్, విజయ్ ఉన్నారు.


 మట్టెవాడలోనూ స్వల్ప ఉద్రిక్తత
 నగరంలోని మట్టెవాడలోనూ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ పక్క మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, మరోవైపు బస్వరాజు శ్రీమాన్ ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ప్రచార ర్యాలీలు ఎదురుపడగానే కార్యకర్త లు నినాదాలు రెట్టించారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మట్టెవాడ పోలీసులు చేరుకుని ఇరు  పార్టీల వారిని శాంతింపజేశారు. ప్రచారం ముగించుకుని వెళుతున్న కొండా ము రళీ కారుకు కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురొచ్చి చేయి గుర్తుకు ఓటేయాలని...జై కాంగ్రె స్.. జైజై కాంగ్రెస్.. అని నినాదాలు చేశారు.

పోలీసులు వచ్చి ఆయన కారు వెళ్లేలా సైడ్ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలకు మురళీ చిరునవ్వుతో అభివాదం చేసుకుంటూ ముందుకెళ్లా రు. వెనుకాల వస్తున్న ఎంబాడి రవీందర్ వాహనాన్ని కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నా రు. పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement