
కొండా దంపతులు
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌లో తమకు టికెట్ కేటాయించలేదని పార్టీ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై తీవ్రంగా ధ్వజమెత్తిన కొండా సురేఖ, మురళీ దంపతులు.. కాంగ్రెస్ గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలి సింది. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ కుటుం బంపై విమర్శలు చేసిన తర్వాత సాయంత్రానికి వారిద్దరూ ఢిల్లీ చేరుకున్నారు. దీంతో అందరూ ఊహించినట్టుగానే వారు కారు దిగి హస్తం గూటికి చేరబోతున్నట్టు స్పష్టమైంది.
బుధవారం ఉదయం 10 గంటల సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌తో భేటీ కానున్నారని సమాచారం. తమకు కేటాయించాల్సిన సీట్లపై పూర్తి స్థాయిలో హామీ తీసుకున్న అనంతరమే పార్టీలో చేరే విషయంపై నిర్ణయం తీసుకుం టామని కాంగ్రెస్ వర్గాలకు స్పష్టంచేసినట్టు తెలుస్తోంది. అయితే, ఆజాద్ భేటీ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరతారని తెలంగాణ కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలి సింది.
కొండా దంపతులు కాంగ్రెస్‌లోకి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవైపు కేటీఆర్‌కు సవాల్ విసిరిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరడాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సైతం స్వాగతిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment