
కిడ్నాప్‌కు గురైన బాలికను తల్లిదండ్రులకు అప్పగిస్తున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, పోలీసులు
నందిపేట(ఆర్మూర్): మండలంలోని వన్నెల్ కే గ్రామానికి చెందిన కిడ్పాప్‌నకు గురైన ఆరేళ్ల మనీశ్వరి గురువారం తల్లిదండ్రుల వద్దకు చేరింది. మండలంలోని వన్నెల్ కే గ్రామానికి చెందిన మద్ది హారిక– రమేష్ దంపతుల కూతురు మనీ శ్వరి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటుంది. కాగా రమేష్‌తో అక్రమ సం బంధం ఉన్న ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన రజిత ఈనెల 5న పాఠశాలకు వెళ్లి చాక్లెట్టు కొనిస్తానని చెప్పి మనీశ్వరిని కిడ్నాప్ చేసింది.
ఈ సంఘటనలో జిల్లాలో సంచలనం రేపగా సీపీ కార్తికేయ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దార్యప్తు చేశారు. దీనిలో భాగంగా నిందితురాలు రజిత తన కూతురుతో పాటు కిడ్నాప్ చేసిన మనీశ్వరిని కేరళకు చేరుకుంది. ఆ రాష్ట్రంలోని తిరువనంతపురంలో పోలీసులకు పట్టుబడింది. కేరళ పోలీసుల సమాచారంతో ప్రత్యేక బృందమై న సీసీఎస్ సిబ్బందితో పాటు నందిపేట పోలీసు సిబ్బంది తిరువనంతపురం వెళ్లి నిందితురాలు రజితతో పాటు మనీశ్వరిని నందిపేటకు తీసుకు వచ్చారు.
గురువారం ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎస్‌ఐ సంతోష్‌కుమార్, స్థానిక పోలీసులు మనీశ్వరిని వన్నెల్ కే గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితురాలు రజితను రిమాండ్ చేసి ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ఆర్మూర్ ముందు హాజరుపరిచారు. కిడ్నాప్‌నకు గురైన మనీశ్వరి తల్లిదండ్రుల చెంతకు చేరింది. దీంతో వారు ఆనందంతో కన్నీళ్ల పర్యంతమై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
బాలిక కిడ్నాప్ కేసులో మహిళ అరెస్టు
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): ఈనెల 2న నందిపేట మండలం వన్నెల్‌కు చెందిన మనిశ్వరిని కిడ్నాప్ చేసిన రజితను అరెస్టు చేసి బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించినట్లు గురువారం సీపీ కార్తికేయ వెల్లడించారు. మచ్చర్లకు చెందిన రజిత మనిశ్వరి చదువుతున్న గీతా కాన్వెంట్ స్కూల్ నుంచి బాలికను కిడ్నాప్ చేసింది. దీనిపై మనీశ్వరి తల్లి హరిత నందిపేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
పోలీసులు ఈనెల 5న కేరళలోని తిరువసంతపురంలో ఉన్నట్లు గుర్తించామన్నారు. రజితను అక్కడి పోలీసుల సహాయంతో పట్టుకున్నారు. అనంతరం 8న నిందితురాలు రజితను నందిపేట్‌కు తెచ్చారు. రజితను ఆర్మూర్ కోర్టు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా, కోర్టు రజితను రిమాండ్‌కు తరలించినట్లు సీపీ కార్తికేయ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment