
కేరళలో పట్టుబడిన రజిత, ఇద్దరు పాపలు
నందిపేట(ఆర్మూర్) : మండలంలోని వన్నెల్ కే గ్రామానికి చెందిన ఆరేళ్ల పాప మద్ది మనీశ్వరి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. నాలుగు రోజుల క్రితం మండల కేంద్రంలోని శ్రీ గీతా కాన్వెంట్ స్కూల్ నుంచి మనీశ్వరిని కిడ్నాప్ చేసిన రజితను ఆదివారం కేరళ పోలీసులు త్రివేండ్రంలో పట్టుకున్నారు. ప్రియుడిపై కోపంతో అభం శుభం తెలి యని ఆరేళ్ల పాపను కిడ్నాప్ చేసిన రజితను పట్టు కునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించింది. ఇటు పోలీసులకు, అటు పాఠశాల యాజమాన్యంకు నాలుగు రోజులుగా కంటిమీద కును కు లేకుండా చేసిన ఈ కథాంశం ఎట్టకేలకు సు ఖాంతం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నా రు. కిడ్నాప్‌ను ఛేదించిన కథాంశం గురించి ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఐడెంటిటీ కార్డుతో గుర్తింపు..
కిడ్నాప్‌నకు పాల్పడ్డ రజిత తన రెండేళ్ల పాపతో పాటు కిడ్నాప్ చేసిన మనీశ్వరితో ఆదివారం కేరళలోని త్రివేండ్రంలో గల ఒక చర్చి దగ్గర కూర్చున్నారు. అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తు న్న పోలీసులు ఆమె దగ్గర ఇద్దరు పిల్లలు ఉండడంతో పిల్లలను ఎత్తుకుపోయే ముఠాగా భావించి ఆరా తీశారు. దీంతో ఆమె తన దగ్గర ఉన్న పాఠశాల గుర్తింపుతో పాటు, పాప మెడలో ఉన్న ఐడెంటిటీ కార్డును చూపింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఇక్కడి పోలీసులకు వాకబు చేసుకునేందుకుగాను సమాచారం అందించారు.
దీంతో ఆమె ఆరేళ్ల పాపను కిడ్నాప్ చేసిందని, ఇక్కడ కేసు కూడా నమోదైందని తెలిపి, ఎఫ్‌ఐఆర్ కాపీని వారికి పంపించారు. వెంటనే ఇద్దరు పిల్లలతో పాటు రజితను కేరళ పోలీసులు అదుపులోకి తీసుకుని వారి ఆధీనంలో ఉంచుకున్నారు. ఇక్కడి నుంచి సోమవారం ఉదయం కేరళకు వెళ్లి వారిని తీసుకురానున్నట్లు ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపారు. పాప సురక్షితంగా ఉన్నట్లు తెలియగానే పాప తల్లిదండ్రులు, బంధువులు పాప రాక కోసం ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment