నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో ఈనెల 15న ప్రారంభమైన కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 35 వైద్య బృందాలు కంటి శిబిరాల్లో వైద్యసేవలు అందిస్తున్నాయి. ఇప్ప టి వరకు జిల్లా వ్యాప్తంగా 23,986 మం దికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందు లో 4,590 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశా రు. 7,207 మందికి వారి కళ్లకు సరిపడే అద్దాల కోసం ఆర్డర్ చేశారు. 2,566 మం దికి శస్త్ర చికిత్స అవసరమని గుర్తించారు. ఈనెల 27 నుంచి శస్త్ర చికిత్సలు ప్రారంభం కానున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, వాసవి కంటి ఆస్పత్రి, బోధన్‌లోని లయన్స్‌కంటి ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు జరుగనున్నా యి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు వైద్యశిబిరాలు కొనసాగుతున్నా యి.
మొత్తం 15, 66, 787 జిల్లా జనాభా ఉండగా దీనికి అనుగుణంగా శిబిరాల ని ర్వహణను రూపొందించారు. గ్రామాల్లో ప్రతి రోజు 360 మందికి, పట్టణ ప్రాం తా లో 460 మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 32 ఆరోగ్య కేంద్రాల పరిధి లో శిబిరాలు కొనసాగుతున్నాయి. 2019 ఫిబ్రవరి వరకు కంటి వైద్యశిబిరాలు నిర్వహించనున్నారు. మెడికల్ ఆఫీసర్‌లు, కం టి వైద్యులు సేవలను అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు డాటాను నమోదు చేస్తున్నారు. మరోవైపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, జిల్లా కలెక్టర్ రామ్మోహన్‌రావు శిబిరాలను తనిఖీ చేస్తున్నారు. ఈ శిబిరాలకు వచ్చేవారిలో ఎక్కువగా వృద్ధులు, 40 ఏళ్లు పైబడినవారికే కంటి సమస్యలు వెలుగులోకి వస్తున్నా యని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.
పకడ్బందీగా నిర్వహిస్తున్నాం : జిల్లా వైద్యాధికారి సుదర్శనం కంటివెలుగు కార్యక్రమం పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. వైద్యసిబ్బంది, వైద్యాధికారులు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో, పట్టణల్లో ఏర్పాటు చేసిన వైద్యశిబిరల్లో అన్ని సౌకర్యలు కల్పించా ము. షెడ్యుల్ ప్రకారం వైద్యశిబిరాలు నిర్వహించి పరీక్షలు పూర్తి చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment