eye operation
-
‘మాట’తో చేస్తున్న సేవకు ఆనందంగా ఉంది: శ్రీనివాస్ గనగోని
మాట (మన అమెరికా తెలుగు అసోసియేషన్ ) ప్రారంభించిన పదినెలల్లోనే 22 బ్రాంచిలు ఏర్పాటు చేసి దాదాపు 5000 మందితో అనేక సేవ కార్యక్రమాలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు అసోసియేషన్ వ్యవస్థాపకులు, అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని. మాట అధ్వర్యంలో ఫిబ్రవరి 17 నుంచి వివిధ సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్చి 10 వరకు ఈ సేవ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో జరగుతున్న కంటి కాటరాక్ట్ ఆపరేషన్ల క్యాంప్ నేటితో(ఫిబ్రవరి 28) ముగియనుంది. ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మాట అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని మాట్లాడుతూ.. ఇండియాలో ఈ నెల 17న వరంగల్‌లో 500 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు మరియు జనరల్ మెడిసిన్ ట్రీట్మెంట్లు చేశాము. 18న ఆశలపల్లిలో మరో 300 మందికి క్యాన్సర్ టెస్ట్‌లతో పాటు జనరల్ టెస్ట్‌లు కూడా చేసి మందులను ఉచితంగా పంచిము. అలాగే 19న కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో శంకర్ నేత్రాలయ వారితో కలిసి కంటి ఆపరేషన్లకు సంబంధించి 2300మంది వరకు టెస్ట్‌లు చేశాము. దాదాపు 200 మందికి ఆపరేషన్లు నిర్వహించి 100 మందికి ఉచిత కళ్లజోళ్లను పంపిణి చేశాము. మరో 250 మందిని చెన్నైకి పంపించి వైద్యం చేయిస్తున్నాం. ఇదంతా చేయటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని మాట అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని అన్నారు. ఫెస్టివల్స్ ఫర్ జోయ్ అధ్యక్షురాలు, ప్రముఖ యాంకర్ సుమ కనకాల మాట్లాడుతూ– ‘‘ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయాలంటే ఎంతో మానవత్వం ఉండాలి. అలాంటి మానవత్వం ఉన్న ఎంతో మంది కలిసి చేయబట్టే దాదాపు 2000మందికి పైగా ఈ రోజు ఐ స్క్రీనింగ్ టెస్ట్‌లు చేయగలిగారని, దాదాపు 195 ఆపరేషన్లు జరిగినందుకు శంకర్ నేత్రాలయ టీమ్‌ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’’ అన్నారు. రాజీవ్ కనకాల మాట్లాడుతూ–‘‘ గతంలో నన్ను అందరూ సుమ భర్త అని ఎవరన్నా అంటుంటే చిరగ్గా ఉండేదని ఇప్పుడు సుమ ఇలాంటి మంచిపనులు చేస్తున్నందుకు సుమ భర్త అంటుంటే ఎంతో గర్వంగా ఉందని కాలర్ ఎగరేసుకుని మరి సుమ భర్తనే అని చెప్పుకోవాలి అనిపిస్తుంది’’ అన్నారు. కార్యక్రమంలో శంకర్ నేత్రాలయ ప్రతినిధి అరుల్, డాక్టర్ విజయ్ భాస్కర్ బొలగం, ప్రవాసాంధ్రుడు ప్రదీప్ సామల టివి ఫెడరేషన్ సభ్యులు విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
నిజం గెలిచి కాదు.. కంటి ఆపరేషన్‌కే బెయిల్
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): చంద్రబాబుకు కంటి ఆపరేషన్ కోసం హైకోర్టు నాలుగు వారాల పాటు తాత్కాలిక బెయిల్ ఇస్తే.. టీడీపీ నేతలు న్యాయం గెలిచిందంటూ హంగామా చేయటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నిజం, సత్యం, ధర్మం గెలిచి చంద్రబాబు బయటకు రాలేదనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు. మంగళవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్ ఎందుకు ఇచ్చారనే విషయాన్ని హైకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. చంద్రబాబు గతంలో ఒక కంటికి ఆపరేషన్ చేయించుకున్నారని.. మరో కంటికి కూడా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పడంతో మానవతా దృక్పథంతో కోర్టు తాత్కాలిక బెయిల్ ఇచ్చిందని వివరించారు. అందువల్ల చంద్రబాబు ఆపరేషన్ చేయించుకొని.. 4 వారాల తర్వాత మళ్లీ జైలులో సరెండర్ కావాల్సిందేనన్నారు. శరీరంపై దురదలు వస్తున్నాయంటే ఏసీబీ కోర్టు మొన్న ఏసీ ఏర్పాటు చేయమన్నదని.. ఇప్పుడు జైలులో కంటి ఆపరేషన్ చేయలేరు కనుక హైకోర్టు తాత్కాలిక బెయిల్ ఇచ్చిందన్నారు. అంతేగానీ ఏదో సత్యం, ధర్మం, న్యాయం గెలిచి.. చంద్రబాబు బయటకు రాలేదన్నారు. ప్రస్తుతం చంద్రబాబుపై కేసు విచారణలో ఉందని.. ఇప్పటికే కొందరు సహ నిందితులను ఆయన విదేశాలకు పంపించారని.. వారిని కూడా విచారించాల్సిన అవసరముందన్నారు. చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్ వస్తే.. లోకేశ్ యుద్ధం మొదలైందని హెచ్చరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పుడు యుద్ధం మొదలైతే మరి ఎర్ర డైరీ పట్టుకుని ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలికినప్పుడు, ఏం పీకారంటూ సవాల్ విసిరినప్పుడు ఏం మొదలైందని ప్రశ్నించారు. టీడీపీ నేతలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. జ్ఞానేశ్వర్‌కు జ్ఞానోదయంఅయ్యింది ఎక్కడైతే ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభించారో.. అక్కడే టీడీపీ జెండాను చంద్రబాబు పీకేశారన్నారు. తెలంగాణలో టీడీపీ దుకాణం మూతపడిందని.. అక్కడ ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జ్ఞానేశ్వర్‌కు జ్ఞానోదయమై రాజీనామా చేశారని చెప్పారు. జ్ఞానేశ్వర్‌ను పార్టీ అధ్యక్షుడిగా పెట్టి, ఆయన చేత డబ్బులు ఖర్చు పెట్టించి, బీసీలకు పట్టం కడతామని పెద్దపెద్ద ఉపన్యాసాలిచ్చి.. చివరకు చంద్రబాబు, లోకేశ్ కలిసి తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారని అన్నారు. ఇతర పార్టీల గెలుపు కోసం టీడీపీని తాకట్టు పెట్టారని జ్ఞానేశ్వర్ స్పష్టంగా చెప్పారంటే.. టీడీపీ దుస్థితేంటో అర్థం చేసుకోవచ్చన్నారు. ఏపీలో కూడా ఎన్నికల ముందో, ఆ తర్వాతో టీడీపీ జెండా పీకేయటం ఖాయమన్నారు. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లోకేశ్ ఎత్తలేదంటే.. ఆయన సంస్కారమేంటో, పార్టీ పట్ల నిబద్ధతేంటో అర్థం చేసుకోవచ్చన్నారు. సమావేశంలో మార్కెట్ యార్డు చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బెయిల్ రాదని తెలిసిపోయింది !..అందుకే బాబు గారి కొత్త డ్రామా..?
-
ఆ గ్రామ పెద్దలకే అలా జరగడంతో.. భయంతో వణికిపోతున్న జనం
ఆదిలాబాద్: పదిరోజుల వ్యవధిలో మండలంలోని డోంగర్‌గామ్ గ్రామపెద్దలు మడావి దేవ్‌రావ్, గ్రామపటేల్ పెందోర్ బాదుపటేల్ కంటిచూపు పోగా గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. 10రోజుల క్రితం గ్రామానికి చెందిన మడావి దేవ్‌రావ్ కంటిచూపు కోల్పోయాడు. అతడి కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా కేంద్రంలోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించినా చూపు రాలేదు. నాలుగు రోజుల క్రితం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించినా ఫలితం లేకపోయింది. బుధవారం రాత్రి ఉన్నట్టుండి గ్రామపెద్ద, గ్రామపేటల్ పెందోర్ బాదుపటేల్ కంటిచూపు పోయింది. పదిరోజుల వ్యవధిలో ఇద్దరు గ్రామపెద్దల చూపు పోవడంతో గ్రామ ఆదివాసీలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా, 40రోజుల క్రితం ఓ ప్రజాప్రతినిధి డోంగర్‌గామ్ గ్రామాన్ని సందర్శించాడు. గ్రామ పొలిమేరలోని హనుమాన్ విగ్రహానికి బంగారు కళ్లు చేయిస్తానని అప్పటికే ఉన్న వెండికళ్లు తీసుకువెళ్లాడు. బంగారు కళ్లు చేయిస్తానన్న సదరు ప్రజాప్రతినిధి జాప్యం చేయడంతోనే గ్రామపెద్దలు వరుసగా చూపు కోల్పోతున్నారని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు దృష్టి సారించి కంటిచూపు కోల్పోతున్న వారిని పరీక్షించి చూపు వచ్చేలా చూడాలని కోరుతున్నారు. -
రెండు కళ్ళకి ఒకేసారి శుక్లం ఆపరేషన్ చేయించవచ్చా..?
-
శుక్లం శాపం, దృష్టి లోపం.. కారణాలు, లక్షణాలు, చికిత్స
కంటిశుక్లం అత్యంత విలువైన కంటి చూపును తగ్గించే తీవ్రమైన సమస్య. దీనిపై ప్రజలలో ఇంకా అవగాహన పెరగాల్సి ఉంది. ఇది నిదానంగా పెరిగే సమస్య కావడం వల్ల చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. తద్వారా సమస్య తీవ్రత పెరిగేందుకు కారణమవుతున్నారు. ఈ నేపధ్యంలో కంటి శుక్లం– శస్త్రచికిత్స/క్యాటరాక్ట్ ఆపరేషన్ అవసరం...పై అపోలో స్పెక్ట్రా ఆసుపత్రికి చెందిన వైద్యులు, ప్రముఖ క్యాటరాక్ట్ సర్జన్ డా. అల్పా అతుల్ పూర్బియా అందిస్తున్న సమాచారం ఇది... కంటి శుక్లం..కారణాలు... కంటి లెన్స్ పుట్టుకతో స్పష్టంగా ఉంటుంది, ప్రధానంగా నీరు మరియు ప్రోటీన్లతో కూడి ఉంటుంది. ప్రోటీన్లు కాలక్రమేణా విచ్ఛిన్నం కావడంతో, లెన్స్ తెల్లగా లేదా బూడిద రంగులోకి మారడం ప్రారంభిస్తుంది, ఇది స్పష్టమైన చూపును నిరోధిస్తుంది. దీనికి సాధారణంగా వయస్సు పెరగడం కాగా, అతినీలలోహిత కిరణం/సూర్య కాంతికి గురికావడం వంటివి కూడా కంటిశుక్లంను ప్రేరేపించడానికి కారణాలే. ఇక ఇతర కారణాలలో అతిగా ధూమపానం, దీర్ఘకాలిక మధుమేహం, దీర్ఘకాలిక స్టెరాయిడ్స్ వాడకం వంటివి కూడా ఉండవచ్చు. అలాగే ఆల్కహాల్ దుర్వినియోగం, ఊబకాయం, రేడియేషన్ థెరపీ మొదలైనవి కూడా ఉన్నాయి. ప్రమాదవశాత్తు కంటికి అయిన గాయాలు కూడా కంటిశుక్లం వృద్ధికి కారణం కావచ్చు. కొన్ని సార్లు పుట్టుకతో కూడా కంటిశుక్లం వచ్చే అవకాశం ఉంది. చాలా అరుదుగా పిల్లలలో అభివృద్ధి చెందే కంటిశుక్లంని డెవలప్మెంటల్ క్యాటరాక్ట్ అంటారు. గుర్తించాల్సిందే... కంటిశుక్లం నిదానంగా అభివృద్ధి చెందే గుణం కలిగి ఉంటుంది కాబట్టి ముందుగా జాగ్రత్త పడడం కష్టమవుతుంది. దీనిని ముందుగా గుర్తించడానికి రాత్రిపూట దృష్టికి అంతరాయం, తక్కువ కాంతిలో చూడటం కష్టతరం అవడం వంటి లక్షణాలు ఉపకరిస్తాయి. కంటి శుక్లం ఉన్న రోగులు సాధారణంగా లైట్ చుట్టూ ఒక కాంతిని చూస్తారు. అలాగే కంటి శుక్లం ఉన్నప్పుడు ప్రకాశవంతమైన లైట్ల మెరుపు బాధాకరంగా ఉంటుంది, కంటిశుక్లం ఉన్న వ్యక్తులు ప్రకాశవంతమైన సూర్యకాంతిలో సరిగ్గా చూడటం కష్టంగా ఉండవచ్చు లేదా రాత్రి సమయంలో కొన్నిసార్లు మరింత చెదిరిన దృష్టిని గమనించవచ్చు. వారికి ఇండోర్ లైట్లలో కూడా చూపు కష్టంగా ఉండవచ్చు. వీధి లైట్లు ఎదురుగా వచ్చే వాహనాల నుండి వచ్చే హెడ్లైట్ల వల్ల కలిగే కాంతి కారణంగా రాత్రి సమయంలో డ్రైవింగ్ సమస్యగా మారవచ్చు చికిత్స...? కంటిశుక్లం బాగు చేసేందుకు మందులతో చేయగలిగిన వైద్య చికిత్స లేదు. మసకబారిన చూపును, దృష్టిని పునరుద్ధరించడానికి శస్త్రచికిత్స ద్వారా కంటిశుక్లం తొలగించడమే మార్గం. . కంటిశుక్లం లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లయితే, అద్దాలు లేదా కాంటాక్ట్ లెన్స్ అవసరం కావచ్చు, కానీ కాలక్రమేణా కంటిశుక్లం మరింత తీవ్రమవుతుంది. తర్వాత తర్వాత సాధారణ రోజువారీ కార్యకలాపాలకు కూడా ఇది ఆటంకం కలిగిస్తే శస్త్రచికిత్స చేయక తప్పదు. కంటిశుక్లం తొలగింపు శస్త్రచికిత్స ప్రక్రియను ఇంట్రాకోక్యులర్ లెన్స్ ఇంప్లాంటేషన్స్ తో ఫాకోఎమల్సిఫికేషన్ అంటారు. ఈ ప్రక్రియలో, కంటిశుక్లం వృద్ధి చెందిన అసలు లెన్స్, కృత్రిమ (ఇంట్రాకోక్యులర్ లెన్స్)తో భర్తీ చేయబడుతుంది. ఇది చాలా సురక్షితమైన ప్రక్రియ. ఈ శస్త్రచికిత్స తర్వాత కొన్ని రోజుల పాటు దురద, తేలికపాటి అసౌకర్యం కంటిలో నీరు కారడం వంటివి కనిపించవచ్చు. అయితే నేడు అందుబాటులో ఉన్న తాజా సాంకేతికతతో విజువల్ రికవరీ చాలా వేగంగా ఉంది. శస్త్రచికిత్స తర్వాత కోలుకునే కాలం ఒకరి నుండి మరొకరికి భిన్నంగా ఉండవచ్చు. కొంతమంది కొద్ది రోజుల్లోనే సాధారణ స్థితికి చేరుకుంటారు, మరికొందరికి కోలుకోవడానికి వారాలు పడుతుంది. ఇతరత్రా సమస్యలు లేనట్లయితే వైద్యులు ఒక వారం విశ్రాంతిని సిఫార్సు చేస్తారు. సాధారణంగా అయితే కొన్ని గంటలలోపే, కంటిలో కాలుష్యం లేదా ధూళి కణాలు ప్రవేశించకుండా నిరోధించడానికి రోగిని రక్షించే గ్లాస్ లేదా కంటికి ఐ ప్యాడ్‌తో ఇంటికి తిరిగి పంపుతారు. ––డా. అల్పా అతుల్ పూర్బియా, క్యాటరాక్ట్ సర్జన్, అపోలో స్పెక్ట్రా ఆసుపత్రి, కొండాపూర్ -
రాష్ట్రపతికి విజయవంతంగా కంటి శస్త్ర చికిత్స.. డిశ్చార్జ్
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కంటి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయింది. రాష్ట్రపతి తన రెండవ కంటికి కంటిశుక్లం శస్త్రచికిత్సను శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ (రెఫరల్ & రీసెర్చ్) చేయించుకున్నారు. చికిత్స విజయవంతంగా పూర్తి కావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్రపతి భవన్ అధికారులు తెలిపారు. అయితే ఇదివరకే ఆయన మొదటి కన్ను 2021 ఆగస్టు 19న ఆర్మీ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు. 75 ఏళ్ల కోవింద్, జూలై 25, 2017 న భారతదేశ 14వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. చదవండి: ఇదేం వింత.. బాలిక ఎడమ కంటి నుంచి కన్నీళ్లతో పాటు రాళ్లు కూడా.. -
8 మంది కంటి వెలుగు బాధితుల డిశ్చార్జి
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు ఆపరేషన్ వికటించి హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎనిమిది మందిని సోమవారం డిశ్చార్జి చేశారు. పూర్వ వరంగల్ జిల్లాకు చెందిన 19 మంది కంటి వెలుగు కింద పరీక్షలు చేయించుకోగా, వారికి వరంగల్ జయ నర్సింగ్ హోమ్‌లో క్యాటరాక్ట్ ఆపరేషన్ చేశారు. అందులో 17 మందికి ఆపరేషన్ వికటించిన సంగతి తెలిసిందే. వారికి ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో మూడు రోజులుగా చికిత్స చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో అందులో కోలుకున్న 8 మందిని డిశ్చార్జి చేసినట్లు ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. మిగిలిన వారికి చికిత్స అందుతోందని, ఎవరికీ కంటి చూపు కోల్పోయే ప్రమాదం లేదని పేర్కొన్నారు. డిశ్చార్జి అయిన వారిలో గోరంట్ల సుజాత (55), అజ్మీర మేఘ్య (70), గోపరాజు బుచ్చమ్మ (65), భగవాన్ (70), ఎం.శాంతమ్మ (58), ఎం.రాజయ్య (70), బోలె సరోజన (45), కె.సరోజన (48) ఉన్నారు. పూర్తిగా నయం కాకుండానే డిశ్చార్జి! డిశ్చార్జి అయిన 8 మందిలో ఇద్దరు మాత్రం తమకు పూర్తిగా నయం కాలేదని ఆరోపించారు. కె.సరోజన కుమారుడు హరిప్రసాద్ మాట్లాడుతూ.. తన తల్లి ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందన్నారు. ఆమెకు కళ్లు కనిపించడం లేదన్నారు. డిశ్చార్జి అయిన అందరి పరిస్థితీ అలాగే ఉందని తెలిపారు. డాక్టర్లను అడిగితే సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు. తన తల్లికి సగమే నయమైందని గోపరాజు బుచ్చమ్మ కుమారుడు కుమారస్వామి అన్నారు. 8 మందికి నయం కాలేదన్న ప్రచారాన్ని డాక్టర్ శ్రీనివాసరావు ఖం డించారు. నయం కానప్పుడు అందరినీ కాకుండా 8 మందినే ఎందుకు డిశ్చార్జి చేస్తామని ప్రశ్నించారు. ఈ సంఘటనకు రాజకీయ రంగు పులుముకుంది. ఆపరేషన్ వికటించి ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రతిపక్షాల నేతలు రెండు రోజులుగా పరామర్శిస్తున్నారు. -
23986 మందికి పరీక్షలు
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో ఈనెల 15న ప్రారంభమైన కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 35 వైద్య బృందాలు కంటి శిబిరాల్లో వైద్యసేవలు అందిస్తున్నాయి. ఇప్ప టి వరకు జిల్లా వ్యాప్తంగా 23,986 మం దికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందు లో 4,590 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశా రు. 7,207 మందికి వారి కళ్లకు సరిపడే అద్దాల కోసం ఆర్డర్ చేశారు. 2,566 మం దికి శస్త్ర చికిత్స అవసరమని గుర్తించారు. ఈనెల 27 నుంచి శస్త్ర చికిత్సలు ప్రారంభం కానున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, వాసవి కంటి ఆస్పత్రి, బోధన్‌లోని లయన్స్‌కంటి ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు జరుగనున్నా యి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు వైద్యశిబిరాలు కొనసాగుతున్నా యి. మొత్తం 15, 66, 787 జిల్లా జనాభా ఉండగా దీనికి అనుగుణంగా శిబిరాల ని ర్వహణను రూపొందించారు. గ్రామాల్లో ప్రతి రోజు 360 మందికి, పట్టణ ప్రాం తా లో 460 మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 32 ఆరోగ్య కేంద్రాల పరిధి లో శిబిరాలు కొనసాగుతున్నాయి. 2019 ఫిబ్రవరి వరకు కంటి వైద్యశిబిరాలు నిర్వహించనున్నారు. మెడికల్ ఆఫీసర్లు, కం టి వైద్యులు సేవలను అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు డాటాను నమోదు చేస్తున్నారు. మరోవైపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు శిబిరాలను తనిఖీ చేస్తున్నారు. ఈ శిబిరాలకు వచ్చేవారిలో ఎక్కువగా వృద్ధులు, 40 ఏళ్లు పైబడినవారికే కంటి సమస్యలు వెలుగులోకి వస్తున్నా యని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. పకడ్బందీగా నిర్వహిస్తున్నాం : జిల్లా వైద్యాధికారి సుదర్శనం కంటివెలుగు కార్యక్రమం పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. వైద్యసిబ్బంది, వైద్యాధికారులు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో, పట్టణల్లో ఏర్పాటు చేసిన వైద్యశిబిరల్లో అన్ని సౌకర్యలు కల్పించా ము. షెడ్యుల్ ప్రకారం వైద్యశిబిరాలు నిర్వహించి పరీక్షలు పూర్తి చేస్తాం. -
వెంకయ్యకు కంటి ఆపరేషన్
హైదరాబాద్: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో ఆదివా రం కుడి కన్నుకు శస్త్రచికిత్స జరిగింది. ఆస్పత్రి వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో మూడు గంటల పాటు ఆయనకు ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం బంజారాహిల్స్ రోడ్ నం.12లోని స్వగృహానికి వెళ్లారు. కంటి చికిత్స నిమిత్తం ఆయన ఢిల్లీ నుంచి శనివారం నగరానికి వచ్చారు. -
రానా కంటికి శస్త్రచికిత్స
ప్రముఖ కథనాయకుడు దగ్గుబాటి రానా కంటి ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయన తండ్రి సురేశ్ బాబు వెల్లడించారు. రానా కుడి కన్నుకు గతంలో ఓ హాస్పిటల్లో చికిత్స నిర్వహించారు. కాగా కొద్ది రోజులగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న రానా ఈ సారి విదేశాల్లో చికిత్స చేయించుకోనున్నారు. చికిత్స నిమిత్తం సెట్స్‌పై ఉన్న షూటింగ్‌లకు విరామం ఇచ్చారు. రానా ప్రస్తుతం పీరియాడిక్ జానర్లో తెరకెక్కుత్తున్న 1945, హథీ మేరీ సాథీ, రాజా మార్తండ వర్మ చిత్రాల్లో నటిస్తున్నారు. -
కంటి ఆపరేషన్ ఇష్టం లేక..
ఎమ్మిగనూరురూరల్: కంటి ఆపరేషన్ చేయించుకోవటం ఇష్టం లేని ఓ వ్యక్తి రసాయన మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడు పెద్దరంగన్న వివరాల మేరకు.. పట్టణంలోని వెంకటాపురం కాలనీ చెందిన నేదిబొట్టు నాగన్న(65)కు నెల రోజుల కిత్రం ఇంట్లో పడుకొని ఉండగా కంట్లో పురుగు పడింది. అప్పటి నుంచి కన్నును బాగరాపిడి చేయటంతో కంటి సమస్య మొదలైంది. కుమారులు పట్టణంలోని కంటి వైద్య నిపుణులు డాక్టర్ హేమంత్‌కుమార్ దగ్గరకు తీసుకెళ్లారు. కంటికి ఇన్ఫెక్షన్ అయిందని ఆపరేషన్ చేయాలని లేకపోతే మరో కన్నుకూడా కోల్పోవాల్సి వస్తుందని డాక్టర్ చెప్పారు. అయితే తన రెండు కన్నులు పోయినా ఫర్వాలేదని, తాను ఆపరేషన్ చేయించుకోనని నాగన్న మెండికేశాడు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. దీంతో కుటుంబసభ్యులు తెలిసిన చోటల్లా వెతికినా ఆచూకీ లభించలేదు. ఈక్రమంలో ఆదివారం బనవాసి ఏపీ గురుకుల పాఠశాల ప్రహారీ వద్ద మద్యం సీసాలో రసాయన మందు కలిపి సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అటుగా వచ్చిన కూలీలు గమనించి మృతుడి కుమారులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఈమేరక కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ వేణుగోపాల్ పేర్కొన్నారు. -
చిన్న వయస్సు... పెద్ద మనస్సు
అనంతపురం, తాడిపత్రి టౌన్: చిన్నారుల్లో మానవత్వ పరిమళమిది... రోజూ తమకు విద్యాబుద్ధులు చెప్పే పేద ఉపాధ్యాయుడు ప్రమాదంలో కంటిచూపు కోల్పోవడంతో తల్లడిల్లిపోయినవారు తమ ప్యాకెట్ మనీ దాచిపెట్టి ఆయన శస్త్ర చికిత్సకు డబ్బులు అందజేశారు. తాడిపత్రిలోని యల్లనూరు రోడ్డులో ఉన్న టార్గెట్ పాఠశాలలో మ్యా«థ్య్ టీచర్‌గా పనిచేస్తున్న నాగరాజుకు కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో కంటి చూపు పోయింది. హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకోవాలంటే రూ.లక్షకు పైగా ఖర్చు వస్తుందన్నారు. ఆయన పేదవాడు కావడంతో అంత మొత్తం సమకూర్చుకోలేకపోతున్నాడు. ఇది గమనించిన పాఠశాల కరస్పాండెంట్ జయచంద్ర ఆ«ధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు నాగరాజు కంటి శస్త్ర చికిత్సకు చేయూతనివ్వాలని నిశ్చయించుకున్నారు. ఓ వారం రోజులు డబ్బులు దాచి రూ.60,090 నాగరాజుకు అందించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ మరికొందరు దాతలు స్పందిస్తే ఓ ఉపాధ్యాయుడిని కష్టకాలంలో ఆదుకున్నవారవుతారని విజ్ఞప్తి చేశారు. -
సీఎం కేసీఆర్‌కు నేడు కంటి ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు బుధవారం ఉదయం కంటి శస్త్రచికిత్స చేయనున్నారు. చికిత్స కోసం సీఎం గత శుక్రవారమే (సెప్టెంబర్ 1న) ఢిల్లీకి వెళ్లారు. శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిశారు. ఆదివారం నుంచి మూడ్రోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఇదే సమయంలో శస్త్ర చికిత్సకు అవసరమైన పరీక్షలు పూర్తయినట్లు తెలిసింది. డాక్టర్ సత్యదేవ్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఈ శస్త్ర చికిత్స చేయనుంది. -
శంకర నేత్రాలయంలో అరుదైన శస్త్ర చికిత్స
ఏలూరు (మెట్రో) : స్థానిక ఆర్‌ఆర్‌పేటలోని శంకర నేత్రాలయంలోని అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించి ఇద్దరికి చూపును ప్రసాదించారు వైద్యులు. మెట్రో నగరాల్లోనూ లభించని అధునాతన నల్లగుడ్డు మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి చూపును అందించినట్లు శంకర నేత్రాలయ వైద్యుడు నాదెండ్ల విష్ణువర్దన్ తెలిపారు. మంగళవారం నేత్రాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముంబై, హైదరాబాద్, చెన్నై వంటి పట్టణాల్లో అందుబాటులో ఈ శస్త్ర చికిత్స ఉన్నప్పటికీ భారీ ఖర్చుతో కూడుకున్నదని తెలిపారు. ఈ నల్లగుడ్డు మార్పిడి శస్త్ర చికిత్సను ఏలూరులో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. పూర్తి ఆధునిక పద్ధతులతో, అన్ని వసతులు ఏర్పాటు చేసినందునే ఇద్దరికి నల్లగుడ్డు మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తిచేశామన్నారు. శస్త్రచికిత్స చేసిన వైద్యురాలు హేమలత మాట్లాడుతూ నల్లగుడ్డు మార్పిడితో పాటు కంటిలో ఉండే పొరలనూ మార్చే అధునాతన చికిత్స ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు, క్లాసిక్ శస్త్రచికిత్సద్వారా చూపు మందగించిన వారికి పూర్తిస్థాయిలో చూపును అందించే ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. సమావేశంలో వైద్యులు ఎన్. రవికిరణ్, ఆర్.పద్మ పాల్గొన్నారు. -
కంటి వైద్యం కోసం వెళితే కన్నే పోయింది..
గుంటూరు ఈస్ట్: శారదా కాలనీ 2వ లైనులో నివసించే∙షేక్ బాజీ బీ అనే వృద్ధురాలు కంటి వైద్యం కోసం ఆసుపత్రికి పోతే కన్ను పోయిందని అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సోమవారం గ్రీవెన్స్‌లో ఆశ్రయించింది. కుడి కన్నులో పొర ఏర్పడటంతో కాటూరి మెడికల్ కళాశాలకు వెళ్లి మే 2వ తేదీ పరీక్ష చేయించుకున్నాక 3వ తేదీ ఆపరేషన్ చేశారంది. ఇంటికి వెళ్లిన దగ్గర నుంచి కన్ను విపరీతమైన నొప్పి ఏర్పడి కన్ను నీరు కారిందని వాపోయింది. ఒకటి రెండు సార్లు అదే ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా కన్ను పోయిందని కన్నీళ్లు పెట్టుకుంది. కాకానిలోని శంకర్ ఐ ఆసుపత్రికి వెళ్లమని ఉన్నతాధికారులు సూచించారంది. జూన్ నెల 15వ తేదీ శంకర్ ఐ ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోగా కాటూరి మెడికల్ కళాశాల వైద్యుల నిర్లక్ష్యంతోనే కన్ను పోయినట్లు నిర్ధారించారంది. ఈ నెల 8వ తేదీన అపరేషన్ చేసి కన్నును తొలగించారని గోడు వెల్లబోసుకుంది. విచారణ చేపట్టి న్యాయం చేయాలని అర్బన్ ఎస్పీని కోరింది. -
ఆపరేషన్ వికటించి చూపు కోల్పోయిన మహిళ
కుషాయిగూడ: కంటి ఆపరేషన్ వికటించడంతో ఓ మహిళ కంటి చూపును కోల్పోయింది. ఇదేమిటని ప్రశ్నించిన బాధితుల పట్ల ఆసుపత్రి సిబ్బంది దురుసుగా వ్యవహరించి దుర్బాషాలడటంతో భాదితులు కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగుచూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా, వలిగొండ మండలం, ముద్దాపురం గ్రామంలో ఇటీవల మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎం.ఎస్.రెడ్డి లయన్స్ కంటి ఆసుపత్రి వారు ఉచిత కంటి వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ వైద్య పరీక్షలు జరిపిన డాక్టర్లు గ్రామానికి చెందిన పదిమందికి కంటి ఆపరేషన్ అవసరమని సూచించారు. దీంతో గ్రామానికి చెందిన సావిత్రమ్మ (58) కంటి ఆపరేషన్ చేయించుకునేందుకు ఏప్రిల్ -22న ఎంఎస్‌రెడ్డి లయన్స్ కంటి ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు ఆసుపత్రి వైద్యులు కంటి ఆపరేషన్ నిర్వహించి మూడు రోజుల తరువాత డిశార్జు చేసి ఇంటికి పంపించారు. ఈక్రమంలో ఆమె తీవ్రమైన కంటి నొప్పితో బాదపడింది. విషయాన్ని డాక్టర్లకు చెప్పగా కొద్ది రోజులు నొప్పి ఉంటుందని సర్దిచెప్పి పంపారు. వారం రోజులైన నొప్పి తగ్గక పోవడంతో ఆసుపత్రికి తిరిగి వచ్చింది. పరిక్షించిన డాక్టర్లు ఆమెను ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రికి తరలించి అదే నెల 29న తిరిగి కంటి ఆపరేషన్ చేయించారు. ఐదు నెలలు గడిచిన కంటిచూపు రాలేదు. దీంతో భాదితులు ఎంఎస్‌రెడ్డి లయన్స్ ఆసుపత్రికి వెళ్లి ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా మా పట్ల దురుసుగా వ్యవహారిస్తు దుర్బాషాలడారని తెలిపారు. దీంతో న్యాయం కోసం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఆసుపత్రి నిర్లక్ష్యంపై మానవ హక్కుల కమీషన్‌ను కూడ ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఈ విషయంపై ఆసుపత్రి చైర్మన్ పుల్లయ్యను వివరణ కోరగా ఆమె మేము చెప్పిన విధంగా జాగ్రత్తలు పాటించక పోవడం వల్లే సమస్య తలెత్తిందని తెలిపారు. ఆపరేషన్ జరిగిన తరువాత మా పర్యవేక్షణలో ఉన్న ఆమె విజన్ చక్కగా ఉందని వివరణ ఇచ్చారు. -
కంటి ఆపరేషన్‌తో చూపేపోయింది!
మాట కూడా కోల్పోయిన రైతు ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన మదనపల్లె రూరల్ : చూపుకోసం ఓ రైతు ఒక కంటికి ఆపరేషన్ చేయించుకుంటే... అతడి రెండు కళ్లుపోయాయి. కాళ్లు చేతులు చచ్చుబడిపోయి... మాట కూడా కోల్పోయాడు. బాధితుడిని తీసుకొచ్చి బంధువులు శనివారం మదనపల్లెలో ఆస్పత్రి వద్ద ఆందోళన చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుని బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బి.కొత్తకోట మండలం బీసీ కాలనీకి చెందిన రైతు వళ్లం నరసింహులు(55) రైతు. పల్లెల్లో తిరుగుతూ గాజుల వ్యాపారం కూడా చేస్తుంటాడు. ఒక కన్ను చూపు తగ్గిందని రెండు నెలల క్రితం మదనపల్లె బెంగళూరు రోడ్డులోని కంటి ఆస్పత్రికి వెళ్లాడు. ఆపరేషన్ చేస్తే చూపు వ స్తుందని వైద్యులు చెప్పారు. రూ.20 వేలు చెల్లించి ఆపరేషన్ చేయించుకున్నాడు. తరువాత 5 రోజులు గడచినా అతనికి చూపురాలేదు. మరో కన్ను కూ డా మసకబారిందని బాధితుడు వైద్యులకు చెప్పాడు. ఖరీదైన మందులు వాడి తే చూపు వస్తుందని నమ్మబలికించారు. కానీ నెల రోజులు గడచినా రెండు కళ్లు తెరవలేకపోయాడు. విషయం తెలుసుకున్న వైద్యులు రోగిని కార్పొరేట్ ఆస్పత్రులకు రెఫర్ చేశారు. బంధువులు ఆయనను తమిళనాడు, కర్ణాటకలోని కార్పొరేట్ ఆస్పత్రులకు తీసుకెళా ్లరు. అక్కడి వైద్యులు అతనికి శాశ్వతంగా చూపు రాదని తేల్చిచెప్పారు. అతనికి కాళ్లు చచ్చుబడిపోయాయి. మాట కూడా కోల్పోయాడు. దీంతో బాధితులు శనివారం మదనపల్లెలో ఆస్పత్రికి వచ్చి నిలదీశారు. వైద్యులు పొంతనలేని సమాధానం ఇచ్చారనే ఆగ్రహంతో వారు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సంఘటనకు కారణమైన డాక్టర్‌ను అరెస్టుచేయాలని డిమాండ్‌చేశారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఫిర్యాదుచేస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆం దోళన విరమించారు. పోలీ సులకు ఫిర్యాదుచేశారు. ఈ విషయమై సంబంధిత డాక్టర్‌ను వివరణ కోరగా లెన్స్ ఆపరేషన్ చేసినంత మాత్రా న కంటిచూపు పోయే అవకాశం లేదని తెలిపారు. -
అద్దాలకు సెలవు
పదునైన అస్త్రం లేసిక్ లేసిక్... స్థూలంగా చెప్పుకోవాలంటే తీక్షణమైన లేజర్ కిరణాల సాయంతో మన కంటిలోని కార్నియా వంపును సరిదిద్దే సమర్థమైన ప్రక్రియ! అద్దాల బెడద లేకుండా.. దృష్టి దోషాన్ని అధిగమించేందుకు అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక విధానం. అయితే ఈ సర్జరీ చేసే ముందు కొన్ని కీలకమైన అంశాలను పరీక్షించటం అవసరం. వయసు : 18 పైబడితేనే! దృష్టి దోషాల్లో తరచుగా కనబడేది హ్రస్వదృష్టి. దీన్నే వైద్యపరిభాషలో ‘మయోపియా’ అంటారు. ఇది చాలావరకు ఎదుగుదలలో భాగంగానే వచ్చే సమస్య. కంటి ఎదుగుదల, శరీరం ఎదుగుదల ఒకే తీరులో లేకపోవటం వల్ల వీరిలో కాంతి కిరణాలు రెటీనా మీద సరిగా కేంద్రీకృతం కావు. దీనివలన సాధారణంగా వీరు 11-12 ఏళ్ల వయసులోనే అద్దాలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ దృష్టిదోషం 11-15 ఏళ్ల మధ్య వేగంగా పెరుగుతూ.. చాలావరకు 18-20 ఏళ్లు వచ్చేసరికి స్థిరపడుతుంది. అందుకే మయోపియాకు లేసిక్ సర్జరీని 18 ఏళ్లలోపు వారికి చేయరు. ఆ తర్వాత కూడా కనీసం ఏడాది పాటు పవర్ మారకుండా, స్థిరంగా ఉందని నిర్ధారించుకున్నాకే చేస్తారు. కార్నియా మందం, వంపు రెండూ ముఖ్యం లేజర్ చికిత్సకు ముందు కార్నియా మందం, కార్నియా వంపులను గుర్తించే పరీక్షలు తప్పనిసరి. ఈ సర్జరీ ఎవరికి చెయ్యవచ్చు, ఎవరికి చెయ్యకూడదన్నది వీటిని బట్టి స్పష్టంగా తెలుస్తుంది. మొదటి కీలక పరీక్ష : కార్నియా మందం (పేకోమెట్రీ) కార్నియా అనేది మన కనుగుడ్డు మీద ఉండే తెల్లటి పారదర్శకమైన పొర. లేసిక్ సర్జరీ గురించి నిర్ణయం తీసుకునే ముందు... ఈ కార్నియా పొర మందం ఎంత ఉందో చూడటం తప్పనిసరి. దీన్ని ‘పేకోమీటర్’ సాయంతో కొలుస్తారు. కార్నియా మందం మనిషిమనిషికీ మారుతుంటుంది. మన భారతీయుల్లో సగటున ఈ మందం 510-520 మైక్రాన్ల వరకూ ఉంటుంది. దీని మందం కనీసం 500 మైక్రాన్లు ఉంటేనే లేసిక్ సమయంలో దీని నుంచి పైపొర (ఫ్లాప్) లేపటానికి వీలుంటుంది. ఫ్లాప్ తీసిన తర్వాత కూడా కింద కార్నియా కనీసం 250-280 మైక్రాన్ల మందం ఉండటం అవసరం. అంతకన్నా తక్కువ మందం ఉంటే మున్ముందు కార్నియా పల్చబడి, ముందుకు తోసుకురావచ్చు. దీంతో లేసిక్ వల్ల తగ్గాల్సిన పవర్ కాస్తా... అంతకుముందుకన్నా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. పైగా వీరు అద్దాలు, కాంటాక్ట్ లెన్స్‌లు వాడినా కూడా దృష్టిలో స్పష్టత ఉండదు. దీన్నే ‘కెరటక్టేసియా’ అంటారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే మందం చూడాలి. రెండో పరీక్ష : కార్నియా వంపు (టోపోగ్రఫీ) కార్నియా పొర వంపు (కర్వేచర్) ఎంత ఉందో చెప్పేది టోపోగ్రఫీ. సగటున ఇది 43-44 డయాప్టర్లు ఉంటుంది. ఒకవేళ ఇది మరీ చదునుగా (40 కన్నా తక్కువగా) ఉంటే.. పైపొర ఫ్లాప్ తియ్యటం కొంత కష్టం. ఇలా ఫ్లాప్ తీసేటప్పుడు అది పూర్తిగా ఊడివచ్చేయచ్చు. తర్వాత దాన్ని స్థిరపరిచేందుకు కాంటాక్ట్ లెన్స్ గానీ, కుట్లు గానీ వేయాల్సి వస్తుంది. అలాగే కార్నియా మరీ వంపుగా ఉబ్బెత్తుగా (47 కన్నా ఎక్కువగా) ఉంటే, వీరికి ఫ్లాప్ తీసేటప్పుడు ఒక్కోసారి దానిలో రంధ్రాలు పడే అవకాశం ఉంటుంది. వీరికి కూడా సర్జరీ కష్టమవుతుంది. లేజర్ చేసినా చూపు మసకగా ఉండే ప్రమాదముంది. అందుకే వంపు పరీక్ష కీలకం. వంపునకు సంబంధించి మరో కీలక అంశం ఎంత చక్కదిద్డగలమనేది! పవర్‌ను చక్కదిద్దటానికి కార్నియా వంపు తగ్గించటం కీలకం. ఈ కార్నియా వంపు సుమారు 0.7 డయాప్టర్లు తగ్గిస్తే... పవర్ సుమారుగా 1 తగ్గుతుంది అనుకోవచ్చు. ఉదాహరణకు కార్నియా వంపు 43 డయాప్టర్లు ఉన్న వ్యక్తికి - 10 డయాప్టర్లు తగ్గిస్తే అంతిమంగా వంపు 36 డయాప్టర్లకు వస్తుంది. ఇది ఎవరికైనా సరే.. 35 డయాప్టర్లు కంటే తక్కువ ఉంటే దృష్టి బాగుండదు. కాబట్టి వంపు తక్కువగా ఉన్నవాళ్లకు లేసిక్ చెయ్యటం వల్ల ఇబ్బందులు వస్తాయి. అయితే ఇలాంటి వారికి కంటిలోనే అమర్చే కాంటాక్స్ లెన్సులు (ఇంప్లాంటబుల్ కాంటాక్ట్ లెన్స్‌లు - ఐసీఎల్) వంటి ఇతరత్రా మార్గాలు బాగా పనికొస్తాయి. మరీ పల్చబడిందా? అదీ చూడాలి! గట్టిగా కళ్లను రుద్దే అలవాటు నుంచి రకరకాల కారణాల రీత్యా కొందరిలో కార్నియా పొర పల్చగా అయిపోయే అవకాశం ఉంటుంది. దీన్నే ‘కెరటోకోనస్’ అంటారు. లేసిక్ సర్జరీ చేసే ముందు ఈ సమస్య లేదని కచ్చితంగా నిర్ధారించుకోవటం చాలా అవసరం. ఇది టోపోగ్రఫీ పరీక్షలోనే తెలుస్తుంది. ఒకవేళ ఈ సమస్య ఉందని అనుమానంగా ఉంటే.. కొంతకాలం తర్వాత మళ్లీ పరీక్షించి చూస్తారు. అన్నీ కలిపి... ఆర్బ్స్కాన్ ! అన్నింటినీ కలిపి... ఇప్పుడు ‘ఆర్బ్స్కాన్’ అనే పరీక్ష చేస్తారు. దీనిలో కార్నియా మందం, వంపులే కాకుండా.. కార్నియాకు ముందువైపు ఉపరితలం, వెనకవైపు ఉపరితలం ఎలా ఉంది? అన్నదీ తెలుస్తుంది. ఎవరికైనా కంట్లో కార్నియా పల్చబడే ‘కెరటోకోనస్’ మార్పులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నా దీనిలో తెలుస్తుంది. ఇంకా ఏమేం పరీక్షలు ? కంట్లో నీటి ఉత్పత్తి ఎలా ఉందన్నదీ కీలకమే. దీనికి ‘షిర్మర్స్ టెస్ట్’ చేస్తారు. ఎటువంటి మత్తు చుక్కలూ వెయ్యకుండా కంట్లో 5 నిమిషాల పాటు ప్రత్యేకమైన పేపర్ స్ట్రిప్పులు పెడితే అది కనీసం 15 ఎం.ఎం వరకూ నీటిని పీల్చుకోవాలి. ఇది తక్కువ ఉంటే కళ్లు పొడిబారే (డ్రై ఐస్) సమస్య ఉందని అనుమానించాలి. ఇదెందుకు కీలకమంటే కార్నియా నుంచి పైపొర (ఫ్లాప్) లేపినప్పుడు, లేజర్ చేసినప్పుడు అక్కడ నాడులు దెబ్బతింటారుు. ఇవి పునరుత్తేజమయ్యేందుకు 36 నెలలు పడుతుంది. అంతకాలం కంట్లో కొంత పొడిదనం (డ్రెనైస్) ఉంటుంది. తీవ్రమైన డ్రైఐస్ సమస్య ఉంటే (23 ఎంఎం ఉంటే) పొడిదనం ఎక్కువై దృష్టి మరీ ఇబ్బందిగా ఉండే ప్రమాదం ఉంది. అందుకని కంట్లో నీటి ఉత్పత్తి చూసి, అది మరీ తక్కువగా ఉంటే కొంతకాలం మందులు వాడి, కన్నీటి ఉత్పత్తిని పెంచి... అప్పుడు లేసిక్ చేస్తారు. దీర్ఘకాలంగా కాంటాక్స్ లెన్సులు వాడేవారికి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, షోగ్రెన్స్ వంటి సమస్యలున్న వారికి కళ్లు పొడిబారే సమస్య ఉండొచ్చు. కాబట్టి వీరి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అలాగే నిద్రలో కనురెప్పలు పూర్తిగా మూయకుండా ఉండిపోయే (లెగాప్థాల్మాస్) వారికి... పొడిగా ఉండటమే కాదు.. వీరిలో ఫ్లాప్ మానకుండా దెబ్బతిని పోయే ముప్పూ ఉంటుంది. కాబట్టి నీటి ఉత్పత్తి పరీక్ష తప్పనిసరి. తర్వాతి పరీక్ష... ఆబరోమెట్రీ కంట్లో కిరణాలన్నీ ఒకేచోట కేంద్రీకృతం కాకపోవటాన్ని ‘ఆబరేషన్స్’ అంటారు. ఇవి రకరకాల స్థాయిల్లో ఉంటాయి. లేసిక్ సర్జరీలో కార్నియాను బల్లపరుపుగా చేస్తే ఇవి మరింతగా పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే చాలా ఎక్కువ పవర్ ఉండి, ఈ ఆబరేషన్స్ కూడా ఎక్కువగా ఉండేవారికి లేసిక్ చేస్తే రాత్రిపూట చూపులో స్పష్టత, ముఖ్యంగా ‘కాంట్రాస్ట్’ సరిగా ఉండకపోవచ్చు. (గ్లేర్, హేలోస్) అందుకని ముందే ఈ ఆబరేషన్స్ను కొలుస్తారు. దీని ప్రకారం లేసిక్ సమయంలో పవర్ తగ్గించటంతో పాటు వీటిని కూడా చక్కదిద్దుతారు. దీన్నే ‘కస్టమైజ్డ్ ట్రీట్మెంట్’ అంటారు. కంట్లో ఒత్తిడి... అదీ చూడాలి ఇప్పటికే నీటికాసుల (గ్లకోమా) సమస్య ఉన్నవారికి కంట్లో పీడనం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివారికి ‘లేసిక్’ చెయ్యటం వల్ల ఇబ్బందులు ఉండొచ్చు. ఫ్లాప్ తీసే సమయంలో కంట్లో పీడనం మరింత పెరగొచ్చు. ఈ పీడనం మూలంగా అప్పటికే దృష్టినాడి దెబ్బతిని ఉంటే... సర్జరీ తర్వాత పీడనం పెరిగి సమస్య ముదరొచ్చు. అందుకని సర్జరీకి ముందు కంట్లో పీడనం ఎంత ఉందన్నది కూడా కొలుస్తారు. (ఇలాంటి వారికి లేసిక్ కంటే పీఆర్కే మేలు కావచ్చు) ఎవరికి ఏది ? కార్నియా మందం 500 కంటే ఎక్కువ ఉంటే లేసిక్ చెయ్యచ్చు. ఇలా మయోపియా 8, 9 వరకూ సరిచెయ్యచ్చు. అదే ప్లస్ పవర్ అరుుతే +4, +5 వరకు కూడా సరిచేస్తారు. కార్నియా మందం కొద్దిగా తక్కువున్నా.. 460-500 మధ్య ఉండి, -4, -5 పవర్ వరకు కూడా ‘పీఆర్కే’ చెయ్చచ్చు. గర్భిణులు, పాలిచ్చే తల్లుల్లో హార్మోన్ల మార్పుల వల్ల కార్నియా మందం, వంపు మారుతుంటాయి. అందుకే పాలివ్వటం ఆపేసిన మూడు నెలల వరకూ కూడా లేసిక్ చెయ్యరు. లేసిక్ ఎలా చేస్తారు? ముందుగా మత్తు కోసం కంట్లో చుక్కల మందు వేస్తారు. దీంతో నొప్పి తెలియదు. అనంతరం మైక్రోకెరటోమ్ అనే పరికరంతో కార్నియా పైపొరను గుండ్రంగా కత్తిరించి... ఆ ఫ్లాప్‌ను కాస్త పైకి లేపి... పక్కకు తీసి జరుపుతారు. ఇటీవలి కాలంలో ఈ పొర కత్తిరించి ఫ్లాప్ తియ్యటానికి ఈ పరికరాలు, బ్లేడ్ వాడాల్సిన అవసరం లేకుండా ‘ఫెమటో సెకండ్ లేజర్’ అనేది అందుబాటులోకి వచ్చింది. ఈ లేజర్ సహాయంతో ఫ్లాప్ లేపుతారు. లేజర్‌తో మరింత కచ్చితత్వంతో ఫ్లాప్ తియ్యటం సాధ్యపడుతుంది కాబట్టి కార్నియా వంపు ఎక్కువ తక్కువలున్న వారికి దీనితో మరింత ప్రయోజనకరం. పొర తీసి పక్కకు జరిపిన తర్వాత ఆ కింది భాగం వంపును అవసరమైన మేరకు లేజర్‌తో బల్లబరుపుగా సరిచేసి, ఆ తర్వాత పక్కకు జరిపిన పొరను యథాస్థానంలో వెనక్కి జరిపేస్తారు. దాన్ని పొడిగా చేసి, యాంటీబయాటిక్ చుక్కల మందులు ఇస్తారు. ఒకటి రెండు రోజులు విశ్రాంతి, నిద్ర అవసరం. ఈ సర్జరీ చేసిన 2, 3 గంటల్లోనే పైపొర సర్దుకుంటుంది. ఒకటి రెండు గంటల పాటు కంట్లో చికాకుగా ఉండొచ్చు. ఆ తర్వాత తగ్గిపోతుంది. దాదాపు మర్నాటికే చూపు సాధారణ స్థితికి వచ్చేస్తుంది. కన్ను రుద్దకుండా ఉండేందుకు పైన రక్షణగా ‘షీల్డ్’ పెడతారు. మర్నాటి నుంచి యాంటీ బయాటిక్స్, స్టిరాయిడ్స్, కృత్రిమ కన్నీటి చుక్కల మందులు ఇస్తారు. కంటికి ఒత్తిడి తగలకుండా ఒక వారం పది రోజులు జాగ్రత్త తీసుకోవటం, ముఖం కడుక్కునేటప్పుడు కంట్లో నీరు పోకుండా చూసుకోవటం ముఖ్యం. ఇలా రెండు కళ్లకూ ఒకేసారి లేసిక్ చేస్తారు. పీఆర్కే ... పీఆర్కే అంటే ‘ఫోటో రిఫ్రాక్టివ్ కెరటెక్టమీ (పీఆర్కే)’. కార్నియాలో ఐదు పొరలుంటాయి. పైపొరను ఎపిథీలియం అంటారు. దీని మందం అంతా ఒకే తీరులో ఉండదు. అసమంగా ఉండే ఈ పైపొరను తొలగించి, మిగతా భాగానికి లేజర్ చేసి, జీరో పవర్ కాంటాక్ట్ లెన్స్ అమరుస్తారు. 3-4 రోజుల్లో అంతా సర్దుకుంటుంది. అప్పుడు కాంటాక్ట్ లెన్సు తీసేస్తారు. 7-8 రోజుల్లో చూపు స్పష్టత వస్తుంది. ఇలా -4 నుండి -6 వరకూ పవర్ ఉన్నవారికి పీఆర్కే బాగా ఉపయోగపడుతుంది. అంతకన్నా ఎక్కువ పవర్ ఉన్నప్పుడు పీఆర్కే చేస్తే పవర్ తిరిగి రావొచ్చు. కొందరిలో చూపు మసకబారొచ్చు (హేజ్). కాబట్టి ఎవరికి ఏది బాగా ఉపయోగపడుతుందన్నది నిర్ధారించటం ముఖ్యం. ఫలితాలు పవర్ ఏమాత్రం లేకుండా, అద్దాల అవసరం లేకుండా చెయ్యటం లక్ష్యం. చాలామంది విషయంలో దీన్ని సాధించొచ్చు. కొన్నిసార్లు మాత్రం కొద్దిగా పవర్ మిగలొచ్చు. ముఖ్యంగా -1 నుంచి -6 వరకు ఫలితాలు ఆశించినట్టే ఉంటాయిగానీ అంతకుమించి ఎక్కువ పవర్ సరిదిద్దాలని చూసినప్పుడు కొద్దిగా పవర్ మిగలొచ్చు. అవసరమైతే మూడు వారాల తర్వాత మరోసారి లేసిక్తో సరిచెయ్యెచ్చు. కన్ను పొడిబారే (డ్రైనెస్) సమస్య రావచ్చు. దీన్ని ముందే అంచనా వేస్తారు. కాబట్టి కృత్రిమ కన్నీటి చుక్కల వంటివి 2,3 నెలల పాటు ఇస్తారు. పవర్ తిరిగి వచ్చేస్తుందా? అన్నది పెద్ద అనుమానం. కార్నియా మందం బాగుంటే సాధారణంగా పవర్ తిరిగి రావటమన్నది ఉండదు. పల్చటి కార్నియాలు, కెరటోకోనస్ వంటి సమస్యలున్న వారికి పవర్ తిరిగి వచ్చే అవకాశం ఎక్కువ, అందుకే ముందుగానే స్క్రీనింగ్ కచ్చితంగా చెయ్యటం అవసరం. మొత్తానికి... కార్నియా పొరమీద ఫ్లాప్ తీసేందుకు మైక్రోకెరటోమ్, ఫెమటోసెకండ్ లేజర్ వంటివి మరింత కచ్చితత్వాన్ని సంతరించుకోవటం, కార్నియా పట్ల అవగాహన పెరగటం, రాబోయే దుష్ర్పభావాలను ముందుగానే ఊహించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం... ఏది ఎవరికి సరైనదో నిర్ధారించటం.. వీటన్నింటి కారణంగా ఇప్పుడు లేసిక్ సర్జరీ చాలా సురక్షితమైనదిగా ఆవిర్భవించిందని చెప్పొచ్చు.