ఎమ్మిగనూరురూరల్: కంటి ఆపరేషన్ చేయించుకోవటం ఇష్టం లేని ఓ వ్యక్తి రసాయన మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడు పెద్దరంగన్న వివరాల మేరకు.. పట్టణంలోని వెంకటాపురం కాలనీ చెందిన నేదిబొట్టు నాగన్న(65)కు నెల రోజుల కిత్రం ఇంట్లో పడుకొని ఉండగా కంట్లో పురుగు పడింది. అప్పటి నుంచి కన్నును బాగరాపిడి చేయటంతో కంటి సమస్య మొదలైంది. కుమారులు పట్టణంలోని కంటి వైద్య నిపుణులు డాక్టర్ హేమంత్‌కుమార్ దగ్గరకు తీసుకెళ్లారు. కంటికి ఇన్‌ఫెక్షన్ అయిందని ఆపరేషన్ చేయాలని లేకపోతే మరో కన్నుకూడా కోల్పోవాల్సి వస్తుందని డాక్టర్ చెప్పారు. అయితే తన రెండు కన్నులు పోయినా ఫర్వాలేదని, తాను ఆపరేషన్ చేయించుకోనని నాగన్న మెండికేశాడు.
ఈక్రమంలో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. దీంతో కుటుంబసభ్యులు తెలిసిన చోటల్లా వెతికినా ఆచూకీ లభించలేదు. ఈక్రమంలో ఆదివారం బనవాసి ఏపీ గురుకుల పాఠశాల ప్రహారీ వద్ద మద్యం సీసాలో రసాయన మందు కలిపి సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అటుగా వచ్చిన కూలీలు గమనించి మృతుడి కుమారులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఈమేరక కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ వేణుగోపాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment