నాగరాజుకు ఆర్థికసాయం అందజేస్తున్న విద్యార్థులు
అనంతపురం, తాడిపత్రి టౌన్: చిన్నారుల్లో మానవత్వ పరిమళమిది... రోజూ తమకు విద్యాబుద్ధులు చెప్పే పేద ఉపాధ్యాయుడు ప్రమాదంలో కంటిచూపు కోల్పోవడంతో తల్లడిల్లిపోయినవారు తమ ప్యాకెట్ మనీ దాచిపెట్టి ఆయన శస్త్ర చికిత్సకు డబ్బులు అందజేశారు. తాడిపత్రిలోని యల్లనూరు రోడ్డులో ఉన్న టార్గెట్ పాఠశాలలో మ్యా«థ్య్ టీచర్‌గా పనిచేస్తున్న నాగరాజుకు కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో కంటి చూపు పోయింది. హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకోవాలంటే రూ.లక్షకు పైగా ఖర్చు వస్తుందన్నారు.
ఆయన పేదవాడు కావడంతో అంత మొత్తం సమకూర్చుకోలేకపోతున్నాడు. ఇది గమనించిన పాఠశాల కరస్పాండెంట్ జయచంద్ర ఆ«ధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు నాగరాజు కంటి శస్త్ర చికిత్సకు చేయూతనివ్వాలని నిశ్చయించుకున్నారు. ఓ వారం రోజులు డబ్బులు దాచి రూ.60,090 నాగరాజుకు అందించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ మరికొందరు దాతలు స్పందిస్తే ఓ ఉపాధ్యాయుడిని కష్టకాలంలో ఆదుకున్నవారవుతారని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment