మాట కూడా కోల్పోయిన రైతు
ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
మదనపల్లె రూరల్ : చూపుకోసం ఓ రైతు ఒక కంటికి ఆపరేషన్ చేయించుకుంటే... అతడి రెండు కళ్లుపోయాయి. కాళ్లు చేతులు చచ్చుబడిపోయి... మాట కూడా కోల్పోయాడు. బాధితుడిని తీసుకొచ్చి బంధువులు శనివారం మదనపల్లెలో ఆస్పత్రి వద్ద ఆందోళన చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుని బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బి.కొత్తకోట మండలం బీసీ కాలనీకి చెందిన రైతు వళ్లం నరసింహులు(55) రైతు. పల్లెల్లో తిరుగుతూ గాజుల వ్యాపారం కూడా చేస్తుంటాడు.
ఒక కన్ను చూపు తగ్గిందని రెండు నెలల క్రితం మదనపల్లె బెంగళూరు రోడ్డులోని కంటి ఆస్పత్రికి వెళ్లాడు. ఆపరేషన్ చేస్తే చూపు వ స్తుందని వైద్యులు చెప్పారు. రూ.20 వేలు చెల్లించి ఆపరేషన్ చేయించుకున్నాడు. తరువాత 5 రోజులు గడచినా అతనికి చూపురాలేదు. మరో కన్ను కూ డా మసకబారిందని బాధితుడు వైద్యులకు చెప్పాడు. ఖరీదైన మందులు వాడి తే చూపు వస్తుందని నమ్మబలికించారు. కానీ నెల రోజులు గడచినా రెండు కళ్లు తెరవలేకపోయాడు.
విషయం తెలుసుకున్న వైద్యులు రోగిని కార్పొరేట్ ఆస్‌పత్రులకు రెఫర్ చేశారు. బంధువులు ఆయనను తమిళనాడు, కర్ణాటకలోని కార్పొరేట్ ఆస్పత్రులకు తీసుకెళా ్లరు. అక్కడి వైద్యులు అతనికి శాశ్వతంగా చూపు రాదని తేల్చిచెప్పారు. అతనికి కాళ్లు చచ్చుబడిపోయాయి. మాట కూడా కోల్పోయాడు. దీంతో బాధితులు శనివారం మదనపల్లెలో ఆస్పత్రికి వచ్చి నిలదీశారు. వైద్యులు పొంతనలేని సమాధానం ఇచ్చారనే ఆగ్రహంతో వారు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు.
ఈ సంఘటనకు కారణమైన డాక్టర్‌ను అరెస్టుచేయాలని డిమాండ్‌చేశారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఫిర్యాదుచేస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆం దోళన విరమించారు. పోలీ సులకు ఫిర్యాదుచేశారు. ఈ విషయమై సంబంధిత డాక్టర్‌ను వివరణ కోరగా లెన్స్ ఆపరేషన్ చేసినంత మాత్రా న కంటిచూపు పోయే అవకాశం లేదని తెలిపారు.
కంటి ఆపరేషన్‌తో చూపేపోయింది!
Published Sun, May 31 2015 3:57 AM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM
Advertisement