
ప్రభుస్వామి ఆలయం (ఇన్‌సెట్‌లో) గర్భగుడిలోని లింగం
సదాశివనగర్(ఎల్లారెడ్డి) : అదో పురాతన ఆలయం.. 256 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రభుస్వా మి ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. దగ్గి గ్రామంలో కోరిన కోర్కెలు తీర్చే స్వామి గా భక్తుల విశ్వాసం పొందిన ప్రభుస్వామి ఆలయం ఇప్పటివరకూ అభివృద్ధికి నోచలేదు. గుట్టపై కొలువదీరిన స్వామి వారిని దర్శించు కోవడానికి ఉమ్మడి జిల్లాల నుంచే కర్ణాటక, మ హారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వస్తారు. ప్రతి మాఘ అమావాస్య రోజున నిర్వహించే జాతర ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తు లు మొక్కులు చెల్లించుకుంటారు. తుక్కోజివాడి గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన దగ్గి.. ప్రస్తుతం గ్రామపంచాయతీగా ఏర్పాటైంది.
ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు కావడంతో ఇప్పటికైనా ఆలయం అభివృద్ధి జరుగుతుందని గ్రామస్తులు భావిస్తున్నారు. ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయానికి కనీస వసతులు లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. శివుని 101 అవతారాల్లో ప్రభుస్వామి అవతారం ఒకటని, ఏకనాథ అవతారమని.. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఆల యం ఈ ప్రాంతంలో ఎక్కడా లేదని భక్తులు పేర్కొంటున్నారు. గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆలయ అభివృద్ధిపైనా దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ముప్పై ఏళ్ల నుంచి నిత్య పూజలు..
ప్రభుస్వామి ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది. భక్తుల కోర్కెలు తీర్చే భగవంతుడిగా ప్రభుస్వామి పేరొందారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. ముప్పై ఏళ్ల నాటి నుంచి ఈ గుట్ట మీదికి వచ్చి నిత్య పూజలు చేస్తున్నా.
– పాపయ్య, ఆలయ అర్చకుడు
Comments
Please login to add a commentAdd a comment