సాక్షి, హైదరాబాద్: జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ను ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్‌ఎస్‌లో ఎలా విలీ నం చేస్తారని, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న జాతీయ పార్టీని అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ లో ఎలా కలుపుతారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. భారత రాజ్యాంగంతోపాటు సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పుల ప్రకారం పార్టీల విలీన అధికారం స్పీకర్‌కు లేదని ఆయన వెల్లడించారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి శనివారం ఆయన ఓ లేఖ రాశారు.
కాం గ్రెస్ తరఫున గెలిచి టీఆర్‌ఎస్‌లోకి వెళుతున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యేలతో ఓ సమావేశం నిర్వహించి కాం గ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు తీర్మానిస్తారని మీడియాలో వార్తలు వస్తున్నాయని, అలాంటి ప్రక్రియకు రాజ్యాంగం అనుమతి ఇవ్వదని లేఖలో పేర్కొన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమి టీ అనుమతి లేకుండా సీఎల్పీ సమావేశాలు జరగడానికి వీల్లేదని తమ పార్టీ రాజ్యాంగం చెబుతోందని, అలాంటి వినతిపత్రాలు తమ దృష్టికి వస్తే ఈ లేఖను కేవియట్‌గా పరిగణనలోకి తీసుకుని తమకు నోటీసులివ్వడంతో పాటు పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆ లేఖలో ఆయన కోరారు.
వారిని అనర్హులుగా ప్రకటించండి..
‘దశాబ్దాల పాటు ప్రజాసేవలో ఉన్న మీరు స్పీకర్‌గా ఎన్నికయినప్పుడు ఎమ్మెల్యేలందరూ సంతోషించా రు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు మిమ్మల్ని అభినందిం చాయి. మీరు అత్యున్నతమైన స్పీకర్ పదవికి మరిం త వన్నె తెస్తారని ఆశించాయి. దీనిలో భాగంగానే మీ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీగా మేము కూడా సహకరించాం. కానీ, రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ, ప్రజాస్వామిక విరుద్ధమైన కొన్ని చర్యల పట్ల మీరు సరిగా స్పందించడం లేదనే భావన వెలిబుచ్చేందుకు నేను బాధపడుతున్నాను. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఓ టీడీపీ ఎమ్మెల్యే తాము టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు బహిరంగంగా చేసిన ప్రకటనలు మీ దృష్టికి వచ్చే ఉంటాయి.
కాంగ్రెస్‌కి సంబంధించిన ఈ ఎమ్మెల్యేల ను అనర్హులుగా ప్రకటించాలని మేమిచ్చిన దరఖాస్తు లు మీ దగ్గర పెండింగ్‌లోనే ఉన్నాయి. ఎవరైనా సరే కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లేందుకు మాకు అభ్యంతరం లేదు. కానీ వారు కాంగ్రెస్ టికెట్ ద్వారా పొందిన పదవికి రాజీనామా చేసి పార్టీ మారాలి. రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలను పరిరక్షించేందు కు గాను రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఈ ఎమ్మెల్యేలను మీరు అనర్హులుగా ప్రకటించాలని కోరుతున్నాం. అనర్హత పిటిషన్లు పెండింగ్‌లో ఉండగానే కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ కార్యాలయానికి వెళ్లి వాళ్ల పార్టీ బీఫారాలు తీసుకెళ్లడంతో పాటు సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తామని బహిరంగంగా ప్రకటించారు.
మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం వారంతా కలిసి ఓ సమా వేశం పెట్టుకుని సీఎల్పీని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయాలని తీర్మానం చేస్తారని తెలుస్తోంది. అలాంటి సందర్భంలో మీరు కొన్ని విషయాలను పరిగణనలో కి తీసుకోవాలని కోరుతున్నాను. రాజ్యాంగం ప్రకా రం ఒక పార్టీని మరో పార్టీలో విలీనం చేసే అధికారం స్పీకర్‌కు లేదు. టీపీసీసీ చీఫ్ అనుమతి లేకుండా సీఎల్పీ సమావేశం నిర్వహించకూడదు. పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వెంటనే అనర్హులుగా ప్రకటించండి. ఆ నిర్ణయం తీసుకునేంత వరకు వారి నుంచి ఎలాంటి దరఖాస్తులు, వినతిపత్రాలు తీసుకోవద్దు.
కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకా రం ఇతర పార్టీల్లో కలిసే అధికారాలు రాష్ట్ర శాఖలకు ఉండవు. ఒక జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీలో విలీనం చేయకూడదు. మీ సుదీర్ఘ రాజకీయ పయనంలో ఒక జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీలో కలపడం లేదా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న జాతీయ పార్టీని అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ లో కలపడం లాంటివి మీరు చూసి ఉండరు. నా లేఖ ను కేవియట్‌గా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాను. సీఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నట్లు, విలీ నం చేస్తున్నట్లు మీకు ఎలాంటి వినతి వచ్చినా మాకు ముందుగా నోటీసులివ్వండి. వాళ్లిచ్చే తీర్మా నం ఆధారంగా నిర్ణయం తీసుకునే అ«ధికారం కూడా మీకు లేదు. మీ దగ్గర పెండింగ్‌లో ఉన్న పిటిషన్ల ప్రకారం వెంటనే పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించండి’ అని ఉత్తమ్ స్పీకర్‌ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment