
కొయ్యగుట్టలో గిరిజనులతో కలిసి నృత్యం చేస్తున్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, బాన్సువాడరూరల్: వచ్చే మిర్గం నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి నిజాంసాగర్ ఆయకట్టుకింద రెండు పంటలకు సాగునీరు అందిస్తామని బాన్సువాడ అసెంబ్లీ టీఆర్‌ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన మండలంలోని కొయ్యగుట్ట కాలనీ, కొయ్యగుట్ట తండా, కేవ్లానాయక్ తండా, తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు.
అర్హులైన నిరుపేదలందరికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. తండాల్లో జగదాంబ సేవాలాల్ మందిరాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన రైతులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు అందిస్తామన్నారు. గిరిజన మహిళలతో కలిసి కాసేపు నృత్యం చేశారు. బద్యానాయక్, అంజిరెడ్డి, నార్లసురేష్, మోహన్‌నాయక్, గోపాల్‌రెడ్డి, శ్రీధర్, బన్సీనాయక్, అంబర్‌సింగ్, ప్రేమ్‌సింగ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment