
'గద్వాలను కొత్త జిల్లాగా చేయండి'
గద్వాల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి డీకే అరుణ, తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మని సోమవారం కలిసి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్: గద్వాల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి డీకే అరుణ, తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మని సోమవారం కలిసి విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి చెందడానికి అన్ని అర్హతలున్నా గద్వాల ప్రాంతం వెనకబడి ఉందని వివరించారు. జిల్లా ఏర్పాటుకు అనువైన అన్ని సౌకర్యాలు గద్వాలకు ఉన్నాయని తెలిపారు. జిల్లా ఏర్పాటు చేయాలని గద్వాల ప్రాంత ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు.