
వివరాలు వెల్లడిస్తున్న ఎస్సై వెంకటేష్
గద్వాల క్రైం: వేర్వేరు ప్రాంతాల్లోని పేకాట స్థావరాలపై పోలీసులు ఆదివారం మెరుపుదాడులు చేశారు. ఆ వివరాలు... గద్వాల మండలంలోని కుర్వపల్లి, వీరాపురం గ్రామాల శివారులో కొందరు పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం అందడంతో రూరల్ పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి పేకాటస్థావరాలపై దాడులు చేశారు.
కుర్వపల్లి శివారు వద్ద 16మంది పేకాట ఆడుతున్నారు. పోలీసులు వస్తున్నారని తెలియడంతో తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కుర్వ గోపాల్, కుర్వ విజయ్, కుర్వ రామకృష్ణ పోలీసులకు చిక్కారు. మిగతా వారు తప్పించుకున్నారు.
రూ.8,880 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరాపురంలోని అగ్రిగోల్డ్ వెంచర్ వద్ద దాడులు చేయగా పిచ్చికుంట్ల శివ, పిచ్చికుంట్ల రాజు, కమత వెంకటరెడ్డి, పిచ్చికుంట్ల శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఒకరు తప్పించుకున్నారని చెప్పారు. వీరి నుంచి రూ.17,070 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటేష్ పేర్కొన్నారు. మొత్తం రూ.25,950 నగదు, ఏడుగురు పేకాటరాయుళ్లును అరెస్టు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment