seven arrested
-
పేకాట స్థావరాలపై దాడులు
గద్వాల క్రైం: వేర్వేరు ప్రాంతాల్లోని పేకాట స్థావరాలపై పోలీసులు ఆదివారం మెరుపుదాడులు చేశారు. ఆ వివరాలు... గద్వాల మండలంలోని కుర్వపల్లి, వీరాపురం గ్రామాల శివారులో కొందరు పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం అందడంతో రూరల్ పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి పేకాటస్థావరాలపై దాడులు చేశారు. కుర్వపల్లి శివారు వద్ద 16మంది పేకాట ఆడుతున్నారు. పోలీసులు వస్తున్నారని తెలియడంతో తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కుర్వ గోపాల్, కుర్వ విజయ్, కుర్వ రామకృష్ణ పోలీసులకు చిక్కారు. మిగతా వారు తప్పించుకున్నారు. రూ.8,880 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరాపురంలోని అగ్రిగోల్డ్ వెంచర్ వద్ద దాడులు చేయగా పిచ్చికుంట్ల శివ, పిచ్చికుంట్ల రాజు, కమత వెంకటరెడ్డి, పిచ్చికుంట్ల శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఒకరు తప్పించుకున్నారని చెప్పారు. వీరి నుంచి రూ.17,070 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటేష్ పేర్కొన్నారు. మొత్తం రూ.25,950 నగదు, ఏడుగురు పేకాటరాయుళ్లును అరెస్టు చేశామన్నారు. -
ఆవు మాంసం వడ్డించారంటూ దాడి..
కోడెర్మా, జార్ఖండ్: పెళ్లి విందులో ఆవు మాంసాన్ని (బీఫ్) వడ్డించారంటూ ముస్లిం వ్యక్తిపై గ్రామస్తులు దాడి చేసిన ఘటన కోడెర్మా జిల్లా దోమ్‌చాంచ్ తాలుకా, నవాడీ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి జుమాన్ మియాన్ తన కొడుకు నిఖా సందర్భంగా బంధువులకు, స్నేహితులకు విందు ఇచ్చాడు. అయితే అతని ఇంటి వెనకాల ఆవు కాళ్లు, కొన్ని ఎముకలు దొరకడంతో, పెళ్లి వేడుకలో ఆవు మాంసం వడ్డించారని గ్రామస్తులు భావించారు. మూకుమ్మడిగా అతని ఇంటిపై దాడి చేసి జుమాన్ను తీవ్రంగా కొట్టారని పోలీసులు వెల్లడించారు. జుమాన్పై దాడితో పాటు ఆ చుట్టుపక్కల ఇళ్ల ముందు గల వాహనాలను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ పోలీసు యంత్రాంగం మత ఘర్షణలు తెలెత్తకుండా భారీ స్థాయిలో జిల్లా వ్యాప్తంగా భద్రతా బలగాలను మోహరించింది. శాంతిభద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకున్నామని కోడెర్మా ఎస్పీ శివాణి తివారి తెలిపారు. గ్రామంలో 144 సెక్షన్ విధించామన్నారు.‘ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశాం. పరిస్థితి అదుపులోనే ఉంద’ని ఆమె చెప్పారు. సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ కాకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఆవు మాంసం వడ్డించిన మాట నిజమేనా..? అని విలేకరులు ప్రశ్నించగా.. గ్రామస్తుల ఆరోపణలకు కారణమైన ఆవు కాళ్లు, ఎముకలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించాం, రిపోర్టు వచ్చాక తదుపరి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. కాగా, ఇదే తరహా ఘటన జార్ఖండ్‌లో గతేడాది చోటుచేసుకుంది. రాంఘర్ పట్టణంలో గత జూన్ 29 న కారులో ఆవు మాంసాన్ని తరలిస్తున్నాడనే నెపంతో మటన్ వ్యాపారి అలీముద్దీన్ అన్సారీపై కొందరు దాడి చేశారు. అయితే పట్టుబడిన మాంసాన్ని ఫోరెన్సిక్ పరీక్షలకై పంపగా.. రిపోర్టుల్లో అన్సారీ దగ్గర దొరికింది ఆవు మాంసమే అని తేలింది. దాంతో గోవధ శాలలు నిర్వహిస్తున్న11 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారందరికీ జీవితఖైదు విధిస్తూ రాంఘర్ కోర్టు తీర్పునిచ్చింది. -
అద్దె ఇల్లు వెతుకుతుంటే.. గ్యాంగ్ రేప్
తన భర్తతో కలిసి అద్దె ఇంటి కోసం వెతుకుతున్న ఓ మహిళపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలోని అంబోలి ప్రాంతంలో తాను సోమవారం రాత్రి ఇంటి కోసం వెతుకుతున్నానని, ఇంతలో కొందరు వ్యక్తులు అక్కడకు వచ్చారని.. వాళ్లలో ముగ్గురు తన భర్తను అక్కడినుంచి బలవంతంగా బయటకు తీసుకెళ్లారని బాధితురాలు (28) పోలీసులకు తెలిపింది. తర్వాత మిగిలిన వాళ్లు తనను ఆ ఇంట్లోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరుగా తనపై అత్యాచారం జరిపారని వాపోయింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమెపై మొత్తం ఎనిమిది మంది అత్యాచారం జరిపినట్లు తెలుస్తోందని, వారిలో ఏడుగురిని ఇప్పటికే అరెస్టు చేశామని ముంబై పోలీసు అధికార ప్రతినిధి అశోక్ దూఢే తెలిపారు. నిందితుల్లో ఒకడికి ఇప్పటికే నేర చరిత్ర ఉందని చెప్పారు. -
హత్య కేసులో ఏడుగురు అరెస్ట్
చెన్నేకొత్తపల్లి : రామగిరి మండలం పేరూరుకు చెందిన బెస్త శ్రీనివాసులు (36)హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. చోరీల విషయంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలోనే అతడిని మట్టుబెట్టినట్లు దొంగల ముఠా సభ్యులు ఒప్పుకున్నారు. ఆగస్టు ఆరో తేదీన జరిగిన ఈ హత్య కేసులో నిందితులైన సిద్దన్న, రోగప్పగారి నాగరాజు, రాము, చెన్నప్పగారి కేశన్న, గడ్డం నాగరాజు, బొమ్మయ్య, మాదన్నలు వీఆర్వో రామ్మోహన్ ఎదుట లొంగిపోయారు.వీరిని పోలీసులు సోమవారం అరెస్ట్ చూపారు. ఇందుకు సంబంధించిన వివరాలను చెన్నేకొత్తపల్లిలోని సర్కిల్ పోలీస్‌స్టేషన్‌లో రామగిరి సీఐ యుగంధర్, ఎస్ఐ శేఖర్‌తో కలిసి డీఎస్పీ వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. నిందితులను ధర్మవరం కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. -
పేకాట శిబిరంపైదాడి: ఏడుగురి అరెస్ట్
గోల్నాక (హైదరాబాద్): పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అంబర్‌పేట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎస్సై విజయభాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట ఎంసీహెచ్ కాలనీ, క్వార్టర్ నంబర్ 17లో ఇమ్రాన్‌అలీ అనే వ్యక్తి పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నాడు. బుధవారం తెల్లవారు జామున 1.15 గంటల సమయంలో ఇమ్రాన్‌అలీ మరో ఆరుగురితో కలసి మూడు ముక్కలాట ఆడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు శిబిరంపై దాడి చేసి మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.18,100, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
బంగారం బిస్కెట్లు స్మగ్లర్ల అరెస్టు
విశాఖపట్నం: దుబాయ్ నుంచి విశాఖకు బంగారం బిస్కెట్లు స్మగ్లింగ్ చేస్తున్న ఏడుగురు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. నిందితుల నుంచి భారత మార్కెట్ ప్రకారం రూ.1.14 కోట్ల విలువైన 4.20 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ జి.రాజేందిరన్ సోమవారం తెలిపారు. ఈ నెల 6వ తేదీన ఎయిర్ ఇండియా ఫైలట్ ఏ1-952 దుబాయ్ నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖ చేరుకుంది. దానిలో నుంచి దిగిన ఇద్దరు మహిళా ప్రయాణికుల వద్ద బంగారం ఉన్నట్లు భద్రతా తనిఖీల్లో బయటపడింది. దీంతో వారిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇంత భారీ స్మగ్లింగ్ బంగారాన్ని పట్టుకోవడం విశాఖ విమానాశ్రయంలో అంతర్జాతీయ సేవలు ప్రారంభించాక మూడు రోజుల్లో ఇది రెండోసారి అని, అయితే మహిళలు స్మగ్లింగ్‌లో దొరకడం విశాఖలో ఇదే తొలిసారి అని రాజేందిరన్ వివరించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను హైదరాబాద్‌లోని ఆర్ధిక నేరాలు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా ఈ నెల 22 వరకూ వారిద్దరికీ రిమాండ్ విధించారని తెలిపారు. యథావిధిగా నిందితుల వివరాలు అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ నెల 2న దుబాయ్ నుంచి విశాఖకు బంగారం బిస్కెట్లు స్మగ్లింగ్ చేస్తున్న ఏడుగురు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్న విషయం విధితమే. వారి నుంచి నుంచి రూ.1.14 కోట్ల విలువైన 4.20 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వెంటనే మరో స్మగ్లింగ్ ఉదంతం వెలుగుచూడటం సంచలనమైంది. -
'బెట్టింగ్'కు పాల్పడుతున్న ఏడుగురు అరెస్టు
ప్రొద్దుటూరు (వైఎస్సార్ జిల్లా): ఇండియా- దక్షిణాఫ్రికా మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వివరాలు.. వెస్సార్ జిల్లా చాపాడు మండల కేంద్రానికి చెందిన చల్లా బ్రహ్మయ్య అనే వ్యక్తి మరో ఆరుగురితో కలిసి సూరత్ దాబాలో బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2.01 లక్షల నగదు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.