అద్దె ఇల్లు వెతుకుతుంటే.. గ్యాంగ్ రేప్
అద్దె ఇల్లు వెతుకుతుంటే.. గ్యాంగ్ రేప్
Published Tue, Nov 1 2016 2:01 PM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM
తన భర్తతో కలిసి అద్దె ఇంటి కోసం వెతుకుతున్న ఓ మహిళపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలోని అంబోలి ప్రాంతంలో తాను సోమవారం రాత్రి ఇంటి కోసం వెతుకుతున్నానని, ఇంతలో కొందరు వ్యక్తులు అక్కడకు వచ్చారని.. వాళ్లలో ముగ్గురు తన భర్తను అక్కడినుంచి బలవంతంగా బయటకు తీసుకెళ్లారని బాధితురాలు (28) పోలీసులకు తెలిపింది. తర్వాత మిగిలిన వాళ్లు తనను ఆ ఇంట్లోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరుగా తనపై అత్యాచారం జరిపారని వాపోయింది.
ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమెపై మొత్తం ఎనిమిది మంది అత్యాచారం జరిపినట్లు తెలుస్తోందని, వారిలో ఏడుగురిని ఇప్పటికే అరెస్టు చేశామని ముంబై పోలీసు అధికార ప్రతినిధి అశోక్ దూఢే తెలిపారు. నిందితుల్లో ఒకడికి ఇప్పటికే నేర చరిత్ర ఉందని చెప్పారు.
Advertisement
Advertisement