విశాఖపట్నం: దుబాయ్ నుంచి విశాఖకు బంగారం బిస్కెట్లు స్మగ్లింగ్ చేస్తున్న ఏడుగురు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. నిందితుల నుంచి భారత మార్కెట్ ప్రకారం రూ.1.14 కోట్ల విలువైన 4.20 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ జి.రాజేందిరన్ సోమవారం తెలిపారు. ఈ నెల 6వ తేదీన ఎయిర్ ఇండియా ఫైలట్ ఏ1-952 దుబాయ్ నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖ చేరుకుంది. దానిలో నుంచి దిగిన ఇద్దరు మహిళా ప్రయాణికుల వద్ద బంగారం ఉన్నట్లు భద్రతా తనిఖీల్లో బయటపడింది. దీంతో వారిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఇంత భారీ స్మగ్లింగ్ బంగారాన్ని పట్టుకోవడం విశాఖ విమానాశ్రయంలో అంతర్జాతీయ సేవలు ప్రారంభించాక మూడు రోజుల్లో ఇది రెండోసారి అని, అయితే మహిళలు స్మగ్లింగ్‌లో దొరకడం విశాఖలో ఇదే తొలిసారి అని రాజేందిరన్ వివరించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను హైదరాబాద్‌లోని ఆర్ధిక నేరాలు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా ఈ నెల 22 వరకూ వారిద్దరికీ రిమాండ్ విధించారని తెలిపారు. యథావిధిగా నిందితుల వివరాలు అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ నెల 2న దుబాయ్ నుంచి విశాఖకు బంగారం బిస్కెట్లు స్మగ్లింగ్ చేస్తున్న ఏడుగురు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్న విషయం విధితమే. వారి నుంచి నుంచి రూ.1.14 కోట్ల విలువైన 4.20 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వెంటనే మరో స్మగ్లింగ్ ఉదంతం వెలుగుచూడటం సంచలనమైంది.
బంగారం బిస్కెట్లు స్మగ్లర్ల అరెస్టు
Published Mon, Jun 8 2015 9:24 PM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM
Advertisement
Advertisement