playing cards game
-
పేకాట కేసులో గుత్తా సుమన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
-
మంత్రి బంధువునని చెప్పినా డోంట్‌కేర్
కర్నూలు (సెంట్రల్): కర్నూలు జిల్లాలో పోలీసులు పేకాటరాయుళ్ల ఆట కట్టించారు. రాష్ట్ర మంత్రి దూరపు బంధువు తమను అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు ఏమాత్రం ఉపేక్షించలేదు. పేకాటరాయుళ్లకు చెందిన 36 కార్లతో పాటు రూ. 5.34 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ గౌతమిసాలి గురువారం విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరులో కర్ణాటక మద్యం అక్రమంగా విక్రయిస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు మూడు బృందాలను ఆటోల్లో అక్కడికి పంపారు. మంత్రి జయరాం దూరపు బంధువు నారాయణతో పాటు మరికొందరు పోలీసు ఆటోలను అడ్డుకుని దాడి చేశారు. ఆటోల అద్దాలు పగులగొట్టారు. పోలీసులను తోసివేయడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు అదనపు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ టెంట్లు వేసుకుని పేకాట ఆడుతున్నవారు కనిపించారు. వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మిగిలినవారు పరారయ్యారు. వారి కోసం గాలిస్తున్నారు. పోలీసులపై ప్రశంసలు.. మంత్రి జయరాం బంధువులమని చెప్పినపట్పికీ పోలీసులు కఠినంగా వ్యవహరించడంపట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారినైనా వదలొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు పేకాట రాయుళ్ల ఆటకట్టించారు. తమ విధులకు ఆటంకం కలిగించినవారిలో మంత్రి బంధువులతో సహా ఎంతటివారు ఉన్నాసరే ఉపేక్షించేది లేదని, నిబంధనలమేరకు కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ గౌతమిసాలి స్పష్టం చేశారు. -
కరోనా: నిప్పు రాజేసిన పేకాట, హౌసీ
సాక్షి, అమరావతి: విజయవాడలోని కృష్ణలంక.. అక్కడి వీధులన్నీ మూడు మీటర్ల నుంచి ఐదు మీటర్ల వెడల్పున్నవే. ఆ వీధుల్లోనే ద్విచక్ర వాహనాలు, కార్లు పార్కింగ్ కూడా. పైగా జనసాంద్రత ఎక్కువే. ఇరుకిరుకు వీధుల్లోనే అవసరం లేకపోయినా రాకపోకలు. ఇక అక్కడ భౌతిక దూరం కేవలం మాటలకే పరిమితం కాగా.. అదే ప్రాంతంలోని జనం గుంపులు, గుంపులుగా చేరి‘పేకాట’, ‘హౌసీ’ వంటి సరదా ఆటలు.. ఫలితం జిల్లాలోనే అతి ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదైన హాట్‌స్పాట్‌గా కృష్ణలంక నిలిచింది. ఓ లారీ డ్రైవర్ నుంచి.. ఇటీవల కోల్‌కతా నుంచి కృష్ణలంకలో గుర్రాల రాఘవయ్య వీధిలోని తన ఇంటికి చేరుకున్న ఓ లారీ డ్రైవర్ వచ్చి రావడంతోనే.. ఆయా ఆటల్లో చురుకుగా పాల్గొనడం వల్లే అతడి ద్వారా వైరస్ విస్తరణ జరిగిందని కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు. అలా ఒకరి నుంచి మరొకరి ఆ వైరస్ సోకి.. ఇప్పుడు నగరంలోనే కృష్ణలంక హాట్‌స్పాట్‌గా మారింది. మొత్తం 95 మంది వరకు ఒక్క ఆ ప్రాంతంలోనే కరోనా వైరస్ బారిన పడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేటికీ కరోనా బాధితుల సంఖ్య అక్కడ పెరుగుతూనే ఉండటం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. కృష్ణ.. కృష్ణా.. 3.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో కృష్ణలంక విస్తరించి ఉంది. ఇంత తక్కువ విస్తీర్ణం గల స్థలంలో ఎక్కువ ఇళ్లు ఉండటం.. 80వేల జనాభా ఉండటం కారణంగా వైరస్ నియంత్రణ సాధ్యం కావడం లేదు. కృష్ణలంకతోపాటు బృందావన కాలనీ, బ్యాంక్ కాలనీ, పీఅండ్‌టీ కాలనీ, ప్రగతినగర్, రాణిగారితోట, రణదీర్‌నగర్, గుమ్మడివారి వీధి, బాల భాస్కర్ నగర్, చండ్రరాజేశ్వర నగర్, ఫక్కీరుగూడెం, ఇజ్రాయేల్ పేట, గుర్రాల రాఘవయ్య వీధి తదితర ప్రాంతాలన్నీ పక్కపక్కనే ఉన్నాయి. నగరంలో ఇలాంటి ఇరుకిరుకు ప్రాంతాలు సుమారు 20కిపైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. -
కుషాయిగూడలో పేకాట రాయుళ్ల అరెస్టు!
సాక్షి, హైదరాబాద్: కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కమలానగర్లో పేకాట శిబిరంపై ప్రత్యేక పోలీసులు బృందాలు మంగళవారం దాడులు చేశాయి. డాల్ఫిన్స్ బాయ్స్ హాస్టల్‌పై దాడి చేసి 10 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. రూ.94 వేల నగదు, 9 మొబైల్ ఫోన్లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎం.శ్రీకాంత్, ఎ.సందీప్, వి.సాయి, ఎ.భరత్, ఎ.కార్తీక్, కె.సాయికిరణ్, బి.రాజు, ఎస్.రాజు, వి.కల్యాణ్, డి.వాసును కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
జూదాగ్ని
పేకాటతో ఎందరో జీవితాలు పేక మేడల్లా కూలిపోతున్నాయి. జూదం సాధారణ, మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాత్రనకా పగలనకా భార్యాపిల్లలతో కలిసి కాయకష్టం చేసి, అల్లిన బుట్టలు ఇతర సామగ్రిని ఇతర రాష్ట్రాలకు వెళ్లి విక్రయిస్తూ జీవనం సాగించే వారి జీవితాలు కూడా పేకాట తీవ్రతకు బుగ్గవుతున్నాయి. వ్యసనాలకు బానిసలైన వారి కుటుంబాలు అప్పుల భారంతో మగ్గుతున్నాయి. పేకాట కోసం చేసిన అప్పులు కట్టలేదని గృహ నిర్బంధం చేసిన ఘటనలు కూడా కోకొల్లలుగానే ఉన్నాయి. గురువారం చిల్లకూరు మిక్స్డ్ కాలనీకి చెందిన సచ్చాల శివ అనే యువకుడు కలెక్టరేట్ వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనే ఇందుకు నిదర్శనం. గూడూరు: నెల్లూరు జిల్లాలో పేకాట మూడు ముక్కలు.. ఆరు ఆటలుగా సాగుతోంది. పేకాటకు పేద, మధ్య, ధనికులు బానిసలై జూదాగ్నికి బలవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో హైటెక్ స్థాయిలో పేకాట సాగుతోంది. వీటి స్థావరాలకు కోడ్లు కేటాయించి.. పోలీసులకు తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. ముఖ్యంగా గూడూరు మండలంలోని మేగనూరు గ్రామ పరిసరాల్లో జూదరులు ప్రత్యేకంగా ప్లేస్–1, ప్లేస్–2, ప్లేస్–3 అనే స్థలాలను ఏర్పాటు చేసుకుని పేకాట ఆడుతున్నారు. ఒక రోజు ఆడిన చోట మరుసటి రోజు ఆడకుండా స్థలాలు మార్చుతూ, ప్లేస్ అనే కోడ్‌తో పేకాట ఆడుతున్నట్లు సమాచారం. ఈ విషయం కొందరు పోలీసులకు కూడా తెలుసని సమాచారం. మండలంలోని పురిటిపాళెం సమీపంలోని మామిడిమానును గుర్తుగా చేసుకుని కూడా జూదరులు వాటిని పేకాట స్థావరాలుగా చేసుకున్నారు. మండలంలోని కొండాగుంట సమీపంలో కూడా పేకాట ఆడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ యువకుడు పేకాట ఆడడంతో పాటు జూదరులకు ఎప్పుడు ఏం కావాలో తెలుసుకుని వాటిని సప్లయ్ చేస్తుంటాడు. అందుకు గాను ఒక్కో ఆటకు ఒక్కొక్కరి వద్ద రూ.1000 వరకూ తీసుకుని, జూదరులకు ఉదయం టిఫిన్ నుంచి రాత్రి పూట చికెన్, మటన్‌తో కూడిన విందు భోజనాలను అందజేస్తుంటాడని తెలుస్తోంది. ఇలా ఉదయం నుంచి రాత్రి వరకూ మూడు ఆటలు ఆడేలా, అవసరాన్ని బట్టి స్థలాలను మార్చుతూ సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో మనుబోలు మండలం బద్దెవోలు గ్రామానికి వెళ్లే మార్గంలో ఒక చోట ఆడుతుండేవారు. దీనిపై జూదరుల కుటుంబ సభ్యులే పోలీసులకు సమాచారం ఇచ్చి పేకాటకు అడ్డుకట్ట వేశారు. చిల్లకూరు సమీపంలోని శ్మశాన వాటిక ప్రాంతంలోని పావురాల తోట కూడా పేకాటకు స్థావరంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిల్లకూరు మండలం నాంచారమ్మపేట– పోటుపాళెం మధ్య ఉన్న జామాయిల్ తోటల్లో జూదరులు పేకాట ఆడుతుంటారని సమాచారం. వర్షాలు మొదలైతే ఏకంగా పట్టణంలోని లాడ్జిల్లో రూంలు బుక్ చేసుకునైనా పేకాట ఆడుతుంటారని తెలుస్తోంది. చితికిపోతున్న ఎరుకుల కుటుంబాలు చిల్లకూరు సమీపంలోని మిక్స్డ్ కాలనీలో సుమారు 250 కుటంబాలు ఉండగా వారిలో 50 కుటుంబాలకు పైగా ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన వారు జీవనం సాగిస్తున్నారు. వీరు భార్యా పిల్లలతో కలిసి బుట్టలు అల్లుకుని వాటిని కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో విక్రయిస్తారు. ఆ మొత్తంతో అక్కడి నుంచి ఊరకే రాకుండా అక్కడ దొరికే ప్లాస్టిక్ టబ్‌లు, బకెట్లతో పాటు మరికొన్ని వస్తువులను కొనుగోలు చేసి అక్కడ నుంచి తీసుకు వచ్చి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తూ జీవనం సాగిస్తారు. ఇలా వారికి రెండు వైపులా ఆదాయం ఉండడంతో వారి నెల సంపాదన బాగానే ఉంటుంది. అయితే వీరు నిరక్షరాస్యులు కావడంతో ఇప్పటికీ అనాదిగా ఉన్న ఆచారాలను నమ్ముతూ కుల కట్టుబాట్లకు విలువనిస్తూ వాటిని పాటిస్తున్నారు. మాటమీద నిలబడి నమ్మకంతో ఏదైనా తెగనమ్మి అప్పులు కడుతుంటారు. కట్టుబాటు మీరితే సలసలా కాగే నూనెలో చేయి పెట్టాల్సి ఉంది. వారి కుల పెద్దలు మూకుమ్మడిగా శిక్ష విధిస్తారన్న భయంతోనే వీరు పేకాటకు బానిసలవుతున్నారు. దీనిని ఆసరా చేసుకున్న కొందరు మిక్స్డ్ కాలనీలోని పురుషులను పలు రకాల వ్యసనాలకు బానిసలను చేయడమే కాకుండా వారికి అప్పులు ఇస్తూ కట్టు బానిసలుగా చేసి వారిపై పెత్తనం చేస్తున్నారు. దీంతో చిల్లకూరులో ఉన్న 50 కుటుంబాల్లో 30 కుటుంబాల వారు ఒక్కో కుటుంబం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ అప్పుల పాలయ్యారు. ఈ అప్పులు తీర్చేందుకు వారు ఇంటిల్లిపాది ఏళ్ల తరబడి వ్యాపారాలు చేసినా వడ్డీలు కడుతున్నారే తప్ప అసలు మొత్తాలు తీర్చిన దాఖలాలు లేవు. దీంతో వారి అప్పులు యథాతథంగా మిగిలాయి. ఈ విషయాలు బయటకు రాకపోతుండడంతో పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా ఎలాంటి అవకాశాలు ఉండడం లేదు. ప్రస్తుతం రాపూరు సమీపంలోని అటవీ ప్రాంతాల్లో జోరుగా పేకాట సాగుతున్నట్లు తెలుస్తోంది. అప్పులిచ్చే వారు వాహనాలను పంపి దగ్గరుండి పేకాట ఆడిస్తూ వారి వద్ద రూ.10 వేలకు రూ.2 వేలు పట్టుకుని రూ.8 వేలు ఇస్తున్నట్లు సమాచారం. ఇలా పోగొట్టుకున్న వారికి మళ్లీ అదే తరహాలో అందరికీ అప్పులు ఇస్తూ ఎవరు గెలిచినా.. ఎవరు ఓడినా కూడా ఆ మొత్తం అంతా అప్పులిచ్చే వారి చేతుల్లో ఉంటుంది. ఆడే వారేమో అప్పులతో అల్లాడుతుంటారు. మా కుటుంబాలు చితికిపోతున్నాయి నేను కిడ్నీ వ్యాధిగ్రస్తురాల్ని. నా పెద్ద కొడుకు చంద్ర పేకాటలో రూ.21 లక్షలు పోగొట్టి అప్పుల పాలయ్యాడు. నా చిన్న కొడుకు శివ బుట్టలు అల్లి, ప్లాస్టిక్ సామగ్రి విక్రయించి కొంత అప్పు తీర్చాడు. అది పోను చంద్ర ఇంకా అప్పు ఉన్నాడు. – లక్ష్మమ్మ, శివ తల్లి ఆచారాలతోనే మా కుటుంబాలు నాశనం మా కుల కట్టుబాట్లతో మేము నాశనమైపోతున్నాము. చదువులకు దూరమైపోతున్నాము. మా అన్న చేసిన అప్పులతో 9వ తరగతి వరకూ చదివిన నేను చదువు ఆపేసి చేసిన అప్పులు తీరుస్తున్నాను. అధికారులు మా జీవితాలపై దృష్టి పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుని మాకు జీవనోపాధి కల్పించాలి. – శివ, (ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డ యువకుడు) -
పేకాట స్థావరాలపై దాడులు
గద్వాల క్రైం: వేర్వేరు ప్రాంతాల్లోని పేకాట స్థావరాలపై పోలీసులు ఆదివారం మెరుపుదాడులు చేశారు. ఆ వివరాలు... గద్వాల మండలంలోని కుర్వపల్లి, వీరాపురం గ్రామాల శివారులో కొందరు పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం అందడంతో రూరల్ పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి పేకాటస్థావరాలపై దాడులు చేశారు. కుర్వపల్లి శివారు వద్ద 16మంది పేకాట ఆడుతున్నారు. పోలీసులు వస్తున్నారని తెలియడంతో తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కుర్వ గోపాల్, కుర్వ విజయ్, కుర్వ రామకృష్ణ పోలీసులకు చిక్కారు. మిగతా వారు తప్పించుకున్నారు. రూ.8,880 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరాపురంలోని అగ్రిగోల్డ్ వెంచర్ వద్ద దాడులు చేయగా పిచ్చికుంట్ల శివ, పిచ్చికుంట్ల రాజు, కమత వెంకటరెడ్డి, పిచ్చికుంట్ల శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఒకరు తప్పించుకున్నారని చెప్పారు. వీరి నుంచి రూ.17,070 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటేష్ పేర్కొన్నారు. మొత్తం రూ.25,950 నగదు, ఏడుగురు పేకాటరాయుళ్లును అరెస్టు చేశామన్నారు. -
పేకాట ఆడుతున్న నలుగురి అరెస్ట్
సిద్దిపేటటౌన్ : స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగారెడ్డిపల్లి శివారు మార్కెట్ యార్డు ప్రాంతంలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఏఎస్సై తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు గురువారం సాయంత్రం టూ టౌన్ పోలీసులు పేకట ఆడుతున్న గంగాపూర్ శేఖర్(30), పంతం శ్రీనివాస్(36), కోటగిరి పర్శరాములు(24), వంగ ప్రభాకర్(28) అనే వ్యక్తులను పేకాట ఆడుతుండగా పట్టుకుని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ. 13,180 వేలు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా లింగారెడ్డిపల్లికి చెందిన వారే అని ఏఎస్ఐతెలిపారు. -
పందెం నోట్లు.. గెలిచినోళ్లకు పాట్లు
ఏలూరు (టూటౌన్)/పాలకొల్లు, న్యూస్‌లైన్ : అతడో కూలీ. ఏలూరు మండలం వెంకటాపు రం పంచాయతీ పరిధిలోని బగ్గయ్యపేటలో నివాసం ఉంటున్నాడు. సంక్రాంతి రోజుల్లో పేకాట శిబిరానికి వెళ్లాడు. ఆసు.. రాణి.. కింగ్.. జోకర్ వంటి పేక ముక్కలు కలిసొచ్చాయి. ఐదారు ఆటల్లో రూ.1,500 గెలిచాడు. ఆ డబ్బుతో ఆనందంగా ఇంటికొచ్చాడు. రెండు రోజుల క్రితం ఏలూరు నగరంలోని ఓ వస్త్ర దుకాణానికి వెళ్లి జీన్ ప్యాంటు కొన్నాడు. క్యాష్ కౌంటర్లో రూ.500 నోట్లు రెండు ఇచ్చాడు. అందులో ఒకటి నకిలీదని తేలింది. క్యాషియర్ నిలదీయడంతో సిగ్గుపడిపోయూడు. ఆ నోటు తీసుకుని అక్కడే చించివేశాడు. పాలకొల్లు ప్రాంతానికి చెందిన మరో కూలీ కోడి పందేలకు వెళ్లాడు. డేగ పుంజుపై రూ.500, నెమలి పుంజుపై మరో రూ.500 పైపందెం కట్టాడు. మొత్తం నాలుగు పందేల్లో గెలవడంతో అతడికి రూ.2000 వచ్చింది. గెలిచిన ఆనందంతో మద్యం దుకాణానికి వెళ్లాడు. రూ.500 నోటు ఇచ్చి మద్యం సీసా అడిగాడు. దానిని పరిశీలించిన మద్యం అమ్మకందారు అతడివైపు ఎగాదిగా చూసి అది నకిలీ నోటని చెప్పాడు. అవాక్కవడం ఆ కూలీ వంతైంది. మారుమాట్లాడకుండా వెనక్కి వచ్చేశాడు. నాలుగైదు రోజులుగా జిల్లాలో చాలాచోట్ల ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నారుు. భారీగా నకిలీ నోట్ల చలామణి సంకాంత్రి సంబరాలు ముగిశాయి. కోడి పందాలు, జూదాలు ముమ్మరంగా సాగాయి. కోట్లాది రూపాయలు చేతులు మారాయి. డబ్బు పోగొట్టున్న వారు విచారంలో మునిగిపోయూరు.. పందాలు గెలిచినోళ్లు హుషారెత్తిపోయూరు. కానీ.. వారి ఆనందం ఎన్నో రోజులు నిలబడలేదు. కోడిపందాలు, జూదాలు నిర్వహించిన వారు లెక్కలు తేల్చుకుంటున్న తరుణంలో బయటపడుతున్న నకిలీ నోట్లు వారిని బేజారెత్తిస్తున్నాయి. ఇటీవల కాలంలో దొంగనోట్లు మార్పిడి విచ్చలవిడిగా సాగిపోతోంది. పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉన్నా మార్పిడి ముఠాలు గుట్టుచప్పుడు కాకుండా తమపని తాము చేసుకుపోతున్నారు. అడపాదడపా వీరిని పోలీసు అరెస్టులు చేయడం, కోర్టుకు పంపడం చేస్తున్నా బెయిల్ విడుదలైన అనేకమంది అదేపనిలో నిమగ్నమవుతున్నారు. ఈసారి సంక్రాంతి కోడి పందాలను నకిలీ నోట్ల మార్పిడికి లక్ష్యంగా ఎంచుకున్నారు. జూదగాళ్ల అవతారం ఎత్తి పెద్దమొత్తంలో పందాలు కాసి నకిలీ నోట్లను చలామణిలో పెట్టారు. పాలకొల్లు మండలం పూలపల్లిలో రెండుచోట్లు భారీ పందాలు నిర్వహించగా యలమంచిలి, పోడూరు మండలాల్లో మోస్తరు పందాలు జరిగాయి. ఈ శిబిరాల్లోకి చొరబడిన వ్యక్తులు పెద్దమొత్తంలో పందాలు కాశారు. ఒడ్డిన సొమ్ములో కొన్ని నకిలీ, మరికొన్ని అసలు నోట్లు పెట్టి ఇవ్వగా, జూదాల నిర్వహకులు హడావిడిలో వాటిని తీసుకున్నారు. పందాల తంతు ముగియడంతో ప్రస్తుతం సొమ్ము పంపకాలు, లాభనష్టాల బేరీజు వేసుకుంటున్న తరుణంలో నకిలీ నోట్లు బయట పడుతున్నాయి. వాటిని మార్చే సందర్భంలో కొందరు దొరికిపోతున్నారు. అక్కడిక్కడే వాటిని చింపేసి బయటపడుతున్నారు. మరికొందరైతే వాటిని దర్జాగా మార్చుకుని బయటపడుతున్నారు. వస్త్ర దుకాణాలు, మద్యం షాపులు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకుల వద్ద దొంగనోట్లు ఎక్కువగా బయటపడుతున్నాయి.