
పేకాట ఆడుతూ పట్టుబడిన వారిని చూపుతున్న పోలీసులు
సిద్దిపేటటౌన్ : స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగారెడ్డిపల్లి శివారు మార్కెట్ యార్డు ప్రాంతంలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఏఎస్సై తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు గురువారం సాయంత్రం టూ టౌన్ పోలీసులు పేకట ఆడుతున్న గంగాపూర్ శేఖర్(30), పంతం శ్రీనివాస్(36), కోటగిరి పర్శరాములు(24), వంగ ప్రభాకర్(28) అనే వ్యక్తులను పేకాట ఆడుతుండగా పట్టుకుని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ. 13,180 వేలు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా లింగారెడ్డిపల్లికి చెందిన వారే అని ఏఎస్‌ఐతెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment