రేపే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన: ఈసీ | EC Officially Declare Schedule Announcement OF LS Elections | Sakshi
Sakshi News home page

లోక్‌సభ సహా ఏపీ, పలురాష్ట్రాల ఎన్నిక షెడ్యూల్‌ ప్రకటన రేపే: వెల్లడించిన ఈసీ

Published Fri, Mar 15 2024 12:33 PM | Last Updated on Fri, Mar 15 2024 1:19 PM

EC Officially Declare Schedule Announcement OF LS Elections - Sakshi

సాక్షి, ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల ఎప్పుడనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా స్పందించింది. రేపు.. శనివారం(16 మార్చి) మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని.. ఈ మేరకు ప్రెస్‌మీట్‌ ఉంటుందని ఈసీఐ ప్రతినిధి ట్వీట్‌ ద్వారా తెలియజేశారు.

లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, సిక్కిం, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను రేపు ఈసీ అధికారికంగా వెల్లడించనుంది. 

ఈసీ డేటా ప్రకారం..  అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్‌ 2వ తేదీతో,  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో, ఒడిషా అసెంబ్లీ గడువు జూన్‌ 24వ తేదీతో ముగియనున్నాయి.

ఈసీలతో సీఈసీ భేటీ
కేంద్ర ఎన్నికల సంఘంలో.. ఇద్దరు సభ్యుల కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో షెడ్యూల్‌ ప్రకటన జాప్యం అవుతుందేమోనని అంతా భావించారు. ఈ నేపథ్యంలో.. గురువారం ప్రధాని నేతృత్వంలోని హైపవర్డ్‌ కమిటీ ఈసీ సభ్యుల ఎంపిక కోసం భేటీ అయ్యింది. తదనంతరం.. రెండు పేర్లను రాష్ట్రపతికి పంపగా.. వెంటనే ఆమోద ముద్ర లభించింది. అలా.. ఎన్నికల సంఘానికి నిన్న ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్ల నియామకం ఆఘమేఘాల మీద జరిగింది.

శుక్రవారం ఉదయం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ సమక్షంలో జ్ఞానేష్ కుమార్, డాక్టర్‌ సుఖ్ బీర్ సింగ్ సంధు ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం కీలక భేటీ జరిగింది. ఈ భేటీలోనే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన తేదీపై నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement