ముంబై: టీమిండియా సొంతగడ్డపై ఆడే షెడ్యూల్‌ను భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పర్యటనలు–టెక్నికల్ కమిటీ మంగళవారం ఖరారు చేసింది. వచ్చే 2023–24 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌లో మేటి జట్లయిన ఆ్రస్టేలియా, ఇంగ్లండ్‌లు ఉండటంతో క్రికెట్ కిక్ మరింత క్రేజీని పెంచనుందనడంలో అతిశయోక్తి లేదు.
ఈ కొత్త సీజన్‌లో సొంతగడ్డపై టీమిండియా 16 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందులో 5 టెస్టులు, మూడు వన్డేలు, 8 టి20 మ్యాచ్‌లున్నాయి. ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌కప్ భాగ్యానికి నోచుకోలేకపోయిన వేదికలకు ఈ సీజన్‌లో న్యాయం చేశారు. ఆయా రాష్ట్రాల క్రికెట్ ప్రియులకు గట్టి ప్రత్యర్థులతో వినోదాన్ని అందివ్వనున్నారు.
ఈ సీజన్ సంగతులివి...
కొత్త సీజన్ ఆ్రస్టేలియా జట్టు రాకతో మొదలవుతుంది. మెగా ఈవెంట్‌కు ముందు మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. మొహాలీ, ఇండోర్, రాజ్‌కోట్ 50 ఓవర్ల మ్యాచ్‌లకు వేదికలు కాగా... వన్డే ప్రపంచకప్ ముగిశాక ఐదు టి20ల ద్వైపాక్షిక టోర్నీ ఆడుతుంది. కొత్త ఏడాదిలో మూడు టి20లను అఫ్గానిస్తాన్‌తో ఆడుతుంది. ఇదయ్యాక వెంటనే
ఇంగ్లండ్‌తో సమరానికి సిద్ధమవుతుంది. ఇరు జట్ల మధ్య జనవరి 25 నుంచి ఐదు టెస్టుల సిరీస్ మొదలవుతుంది.
ఇదీ... హైదరాబాద్, వైజాగ్ ముచ్చట
వచ్చే సీజన్ తెలుగు రాష్ట్రాల క్రికెట్ ప్రియుల్ని తెగ మురిపించనుంది. గట్టి ప్రత్యర్థి ఆసీస్‌తో ఐదు టి20ల సిరీస్ వైజాగ్‌లో మొదలైతే... హైదరాబాద్‌లో ముగుస్తుంది. ఈ నవంబర్ 23న వైజాగ్‌లోని వైఎస్ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్, డిసెంబర్ 3న హైదరాబాద్‌లో ఆఖరి మ్యాచ్ జరుగుతాయి. మళ్లీ కొత్త సంవత్సరం జనవరి 25–29 వరకు ఇంగ్లండ్‌తో తొలి టెస్టు హైదరాబాద్‌లో, ఫిబ్రవరి 2–6 వరకు రెండో టెస్టు వైజాగ్‌లోని వైఎస్‌ఆర్ స్టేడియంలో నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment