టీమిండియా హోం సీజన్‌ (2024-25) షెడ్యూల్ విడుదల | BCCI Announced Team India 2024-25 Home Season Schedule | Sakshi
Sakshi News home page

టీమిండియా హోం సీజన్‌ (2024-25) షెడ్యూల్ విడుదల

Published Thu, Jun 20 2024 5:56 PM | Last Updated on Fri, Jun 21 2024 1:48 PM

BCCI Announced Team India 2024-25 Home Season Schedule

2024-2025 హోం సీజన్‌కు సంబంధించి టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ (జూన్‌ 20) ప్రకటించింది. ఈ సీజన్‌ సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌తో మొదలై వచ్చే ఏడాది (2025) ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో ముగుస్తుంది. ఈ మధ్యలో భారత్‌.. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌  ఆడుతుంది.

2024-25 హోం సీజన్‌ షెడ్యూల్‌ వివరాలు..

బంగ్లాదేశ్ టూర్‌ ఆఫ్‌ ఇండియా

తొలి టెస్ట్‌ (చెన్నై): సెప్టెంబర్‌ 19 నుంచి 23 వరకు
రెండో టెస్ట్‌ (కాన్పూర్‌): సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 1 వరకు

తొలి టీ20 (ధర్మశాల): అక్టోబర్‌ 6
రెండో టీ20 (ఢిల్లీ): అక్టోబర్‌ 9
మూడో టీ20 (హైదరాబాద్‌): హైదరాబాద్‌

న్యూజిలాండ్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా

తొలి టెస్ట్‌ (బెంగళూరు): అక్టోబర్‌ 16 నుంచి 20 వరకు
రెండో టెస్ట్‌ (పూణే): అక్టోబర్‌ 24 నుంచి 28 వరకు
మూడో టెస్ట్‌ (ముంబై): నవంబర్‌ 1 నుంచి 5 వరకు

ఇంగ్లండ్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా

తొలి టీ20 (చెన్నై): జనవరి 22
రెండో టీ20 (కోల్‌కతా): జనవరి 25
మూడో టీ20 (రాజ్‌కోట్‌): జనవరి 28
నాలుగో టీ20 (పూణే): జనవరి 31
ఐదో టీ20 (ముంబై): ఫిబ్రవరి 2

తొలి వన్డే (నాగ్‌పూర్‌): ఫిబ్రవరి 6
రెండో వన్డే (కటక్‌): ఫిబ్రవరి 9
మూడో వన్డే (అహ్మదాబాద్‌): ఫిబ్రవరి 12

టీ20 వరల్డ్‌కప్‌ 2024 తర్వాత టీమిండియా షెడ్యూల్‌..

ఇండియా టూర్‌ ఆఫ్‌ జింబాబ్వే (5 టీ20లు)

ఇండియా టూర్‌ ఆఫ్‌ శ్రీలంక (3 వన్డేలు, 3 టీ20లు)

బంగ్లాదేశ్ టూర్‌ ఆఫ్‌ ఇండియా (2 టెస్ట్‌లు, 3 టీ20లు)

న్యూజిలాండ్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా (3 టెస్ట్‌లు)

ఇండియా టూర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా (5 టెస్ట్‌లు)

ఇంగ్లండ్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా (3 వన్డేలు, 5 టీ20లు)

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement