
దేశవాళీ క్రికెట్‌ను కాదని ఐపీఎల్ సన్నాహకాల్లో నిమగ్నమై ఉన్న ఆటగాళ్లకు బీసీసీఐ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. రంజీల్లో ఆడకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. జాతీయ జట్టు సభ్యులు, గాయాల బారిన ఆటగాళ్లు మినహా అందరూ రంజీల్లో పాల్గొనాలని పిలుపునిచ్చింది.
ఇషాన్ కిషన్ ఎపిసోడ్ నేపథ్యంలో బీసీసీఐ సీరియస్‌గా ఉందని తెలుస్తుంది. బీసీసీఐ పిలుపును ఖాతరు చేయని వాళ్లకు త్వరలో నోటీసులు అందుతాయని సమాచారం. నోటీసులు అందుకున్న ఆటగాళ్లపై తీవ్ర చర్యలు ఉంటాయని తెలుస్తుంది.
కాగా, గత కొద్దికాలంగా జాతీయ జట్టులో లేని ఇషాన్ కిషన్.. దేశవాలీ టీమ్‌కు అందుబాటులో ఉండకుండా ఐపీఎల్ 2024 సన్నాహకాల్లో బిజీగా ఉన్నాడు. బరోడాలో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంప్‌లో ఇషాన్.. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు.
జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాలీ క్రికెట్ ఆడాలని కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన సూచనలను సైతం ఇషాన్ లెక్క చేయకుండా ఐపీఎల్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఇషాన్ చర్యల పట్ల బోర్డు చాలా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా బీసీసీఐ-ఇషాన్ కిషన్ మధ్య పరోక్ష యుద్దం నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. జితేశ్ శర్మను జాతీయ జట్టులోకి ఎంపిక చేసినప్పటి నుంచి ఇషాన్-బీసీసీఐ మధ్య వార్ జరుగుతుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment