బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023 అనంతరం టీమిండియా.. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఇందుకోసం భారత సెలెక్టర్లు ఇవాళ (ఫిబ్రవరి 19) 18 మంది సభ్యులతో కూడిన జంబో జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. హార్ధిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు.
అయితే వ్యక్తిగత కారణాల చేత రోహిత్ తొలి వన్డేకు దూరంగా ఉంటాడని, ఆ మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ హార్ధిక్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఈ ఒక్క అంశం తప్పించి భారత జట్టులో ఎలాంటి విశేషాలు లేవు. కాగా, ఆసీస్‌తో తొలి వన్డే మార్చి 17న ముంబై వేదికగా జరుగనుండగా, రెండో వన్డే 19న వైజాగ్‌లో, మూడో వన్డే 22న చెన్నైలో జరుగనుంది.
ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్ధిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చహల్, శార్ధూల్ ఠాకూర్
Comments
Please login to add a commentAdd a comment