
కమల్‌హాసన్ ‘థగ్ లైఫ్’ రష్యాలో ఆరంభం కానుందట. 1987లో వచ్చిన ‘నాయగన్’ (తెలుగులో ‘నాయకుడు’) చిత్రం తర్వాత హీరో కమల్‌హాసన్–దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. ‘జయం’ రవి, దుల్కర్ సల్మాన్, త్రిష, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్, ఐశ్వర్యా లక్ష్మీ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇందులో రంగరాయ శక్తివేల్ నాయకర్ పాత్రలో నటిస్తున్నారు కమల్‌హాసన్. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ చెన్నైలో ్రపారంభమైంది. కమల్‌హాసన్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణను రష్యాలో ప్లాన్ చేశారట మణిరత్నం. ప్రధాన తారాగణం అంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారని కోలీవుడ్ సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్.
Comments
Please login to add a commentAdd a comment