అతను మ్యాచ్ ఫినిషర్: కోహ్లీ
లండన్: చాంపియన్ ట్రోఫీలో వరుసగా విఫలమౌతున్న భారత్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్ విరాట్ కోహ్లీ వెనుకేసుకొచ్చాడు. హార్ధిక్ అమూల్యమైన ఆటగాడని కితాబిచ్చాడు. ఎటువంటి సందర్భంలోనైనా మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల సత్తా ఉన్నవాడని పొగిడాడు. పాండ్య అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాడు. అటు బంతితో ఇటు బ్యాట్‌తో రాణించగల సత్తా ఉన్నవాడు.
శ్రీలంకతో మ్యాచ్‌లో 5బంతుల్లో9 పరుగులు, పాకిస్తాన్ మ్యాచ్‌లో 6బంతుల్లో 20పరుగులు చేశాడు. అయితే బౌలింగ్‌లో మాత్రం నాలుగు మ్యాచ్‌ల్లో 3 వికెట్లు మాత్రమే తీశాడని కెప్టెన్ తెలిపాడు. టీంలో సీనియర్ ఆటగాళ్లు, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సమీలను తీసుకోవాలని చాలా మంది ప్రశ్నించారని విరాట్ తెలిపాడు. తాను మాత్రం మొండిగా పాండ్యాకే ఓటు వేసినట్లు చెప్పాడు. పాండ్యాకు మరికొన్ని అవకాశాలు ఇవ్వాలని భావించినట్లు కోహ్లీ తెలిపాడు. కీలక సమయంలో మ్యాచ్ ఫినిషర్‌గా ఉపయోగపడుతున్నాడని పేర్కొన్నాడు.
లక్ష్య ఛేదన చేయాల్సి వచ్చినప్పుడు ఎనిమిదో స్థానం వరకూ బ్యాటింగ్ సామర్థ్యం ఉండాలన్నాడు. ఆ సమయంలో హార్ధిక్ జట్టును విజయతీరాలకు చేర్చగల సత్తా ఉన్నవాడు. ఫీల్డింగ్ విషయంలోను విశేషంగా రాణిస్తున్నాడని విరాట్ పొగిడాడు. చాంపియన్ ట్రోఫీలో తన ప్రదర్శన బాగానే ఉందన్నాడు, కీలక సమయంలో వికెట్లు తీసి రాణిస్తున్నాడంటూ వెనుకేసుకొచ్చాడు. చివరి యుద్ధంలో జట్టును మార్చే యోచన లేదని కోహ్లీ తెలిపాడు.