రాణించిన ధోని, బ్రావో!
హైదరాబాద్: కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, బ్రావోలు రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఛాంపియన్స్ లీగ్ ట్వెంటీ20 ట్రోఫిలో భాగంగా హైదరాబాద్ లో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ధోని సేన బ్యాటింగ్ కు దిగింది.
స్మిత్ 20, మెక్కాలమ్ 22, రైనా 28 పరుగులు చేసి చేశారు. చివర్లో 20 బంతుల్లో ధోని 2 సిక్సర్లు, 3 ఫోర్లు, బ్రావో 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు సాధించడంతో 158 పరుగుల లక్ష్యాన్ని కోల్ కతా ముందు చెన్నై ఉంచింది. కోల్ కతా బౌలర్లలో చావ్లా 2, నరైన్, పఠాన్ చెరో వికెట్ పడగొట్టారు.
కడపటి వార్తలు అందేసరికి కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 9 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. డస్కోటే 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. సూర్య కుమార్ యాదవ్ 19 చేసి అవుటయ్యాడు