పాక్ అభిమానుల దురాగతం
లండన్: ఒక జట్టు గెలిచినప్పుడు అభిమానులకు ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. కానీ అది కాస్తా హెచ్చుమీరతే విపరీతాలు జరుగుతాయి. అలాగే పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు హద్దు మీరి రెచ్చిపోయారు. పాక్ ఫైనల్లో ప్రవేశించిన అత్యుత్సాహంలో భారత్ మాజీ కెప్టెన్, సౌరవ్‌గంగూలీపై దాడులకు పాల్పడ్డారు. పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించిన తరువాత ఈ దాడులకు పాల్పడ్డారు. ఈసంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సౌరవ్ గంగూలీ తన కారులో ప్రయాణిస్తుండగా అడ్డుపడిన పాక్ అభిమానులు, కారుపై ఎక్కడంతోపాటు దాడి చేయడం ప్రారంభించారు. పాకిస్తాన్ జిందాబాద్ ఇండియా ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. పాక్ జెండా పట్టుకుని కారు దాదా కారు కదలకుండా నలువైపులా నిర్భందించారు. అయితే కారు లోపలి నుంచి గంగూలీ చిరునవ్వు నవ్వి కొద్ది సేపటి తర్వాత వెళ్లిపోయారు.
ఈనెల 15న జరిగిన చాంపియన్ ట్రోఫీ రెండో సెమీస్ మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌పై గెలిచి ఫైనల్ చేరింది. ఈనెల 18న ఆదివారం భారత్ చిరకాల ప్రత్యర్థి పాక్‌తో భారత్ కప్పుకోసం తలపడనుంది. జూన్ నాలుగున భారత్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాక్ ఓడిపోయిన విషయం తెలిసిందే.