T20 World Cup 2022: India Set To Rest Suryakumar Yadav For Warm-Up Match Vs New Zealand - Sakshi
Sakshi News home page

T20 WC 2022: న్యూజిలాండ్‌తో వార్మప్‌ మ్యాచ్‌.. సూర్యకుమార్‌ దూరం!

Published Tue, Oct 18 2022 10:23 AM | Last Updated on Tue, Oct 18 2022 11:28 AM

India set to rest SURYA kumar yadav for WARMUP match vs NewZealand - Sakshi

ఆస్ట్రేలియాతో తొలి వార్మప్‌ మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు రెండో వార్మప్‌ మ్యాచ్‌కు సిద్దమైంది. బ్రేస్బేన్‌ వేదికగా బుధవారం న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అతడు స్థానంలో ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడాకు అవకాశం ఇవ్వాలి అని జట్టు మేనేజేమెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్‌ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ అధ్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 33 బంతులు ఎదుర్కొన్న సూర్య.. 50 పరుగులు చేశాడు. అదే విధంగా సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు కూడా రెస్ట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇక న్యూజిలాండ్‌ విషయానికి వస్తే.. తమ తొలి వార్మప్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం పాలైంది. కేవలం 98 పరుగులకే కివీస్‌ ఆలౌటైంది. ఇక భారత్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు స్టార్‌ ఆటగాడు డెవాన్‌ కాన్వే, ఆల్‌రౌండర్‌ జిమ్మీ నిషమ్‌ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అశ్విన్, చాహల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ

న్యూజిలాండ్‌: డెవాన్‌ కాన్వే మార్టిన్ గప్టిల్, కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నిషమ్‌, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌతీ
చదవండి: Pat Cummins: ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్‌గా పాట్‌ కమిన్స్‌.. తొలి ఫాస్ట్‌ బౌలర్‌గా రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement