
దౌలత్ జద్రాన్
హరారే: ఐసీసీ ప్రపంచకప్ క్వాలిఫయర్ వార్మప్ మ్యాచ్‌లో మాజీ చాంపియన్ వెస్టిండీస్‌కు అఫ్గానిస్తాన్ షాకిచ్చింది. పేసర్ దౌలత్ జద్రాన్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టడంతో అఫ్గాన్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 29 పరుగుల తేడాతో విండీస్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 35 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్‌లో ఒక దశలో అఫ్గాన్ 71 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
టెయిలెండర్లు గుల్బదిన్ నయీబ్ (48; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సమీవుల్లా షెన్వారి (42; 2 సిక్సర్లు) తొమ్మిదో వికెట్‌కు 91 పరుగులు జోడించి పరిస్థితి చక్కదిద్దారు. అనంతరం విండీస్ లక్ష్యాన్ని 35 ఓవర్లలో 140 పరుగులుగా నిర్దేశించారు. అయితే గేల్ (9), శామ్యూల్స్ (34; 4 ఫోర్లు)లాంటి సీనియర్లున్న విండీస్ 26.4 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌటైంది. ఇన్నిం గ్స్ 20వ ఓవర్ వేసిన జద్రాన్ వరుస బంతుల్లో హెట్‌మైర్ (1), పావెల్ (9), బ్రాత్‌వైట్ (0)లను ఔట్ చేసి ‘హ్యాట్రిక్’ సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment