విండీస్‌కు ఝలక్ ఇచ్చిన అఫ్గానిస్తాన్..56 పరుగుల తేడాతో సంచలన విజయం
అఫ్గాన్ నిర్ధేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్.. అఫ్గాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. విండీస్ బ్యాటర్లలో రోస్టన్ ఛేజ్(54) అజేయమైన అర్ధశతకంతో జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఇతనికి నికోలస్ పూరన్(35) సహకరించినప్పటికీ భారీ లక్ష్యం కావడంతో ఛేదన కష్టమైంది. అఫ్గాన్ స్పిన్నర్ నబీ తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. 4 ఓవర్లలో 2 మెయిడిన్లు వేసి కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. నవీన్ ఉల్ హక్, కరీమ్ జనత్‌కు చెరో వికెట్ దక్కింది.
విండీస్ టార్గెట్ 190.. 5 ఓవర్ల తర్వాత 21/2
190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ జట్టు ఆరంభంలోనే తడబడింది. తొలి 5 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 21 పరుగులు మాత్రమే చేయగలిగింది. సిమన్స్(0), ఎవిన్ లూయిస్(3)లను మహ్మద్ నబీ పెవిలియన్‌కు పంపాడు. క్రీజ్‌లో రోస్టన్ చేజ్(9), హెట్‌మైర్(1) ఉన్నారు.
చెలరేగిన ఆఫ్గాన్ ఓపెనర్లు.. విండీస్ టార్గెట్ 190
విండీస్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్(35 బంతుల్లో 56; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), మహ్మద్ షెహజాద్(35 బంతుల్లో 54; 6 ఫోర్లు, సిక్స్) అర్ధశతకాలతో చెలరేగడంతో అఫ్గాన్ భారీ స్కోర్ సాధించగలిగింది. వీరికి రహ్మానుల్లా(26 బంతుల్లో 33), జద్రాన్(19 బంతుల్లో 23) తోడవ్వడంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో ఆండ్రీ రసెల్ కట్టుదిట్టంగా బౌల్ చేసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. విండీస్ బౌలర్లలో మెక్‌కాయ్ 2 వికెట్లు పడగొట్టగా.. రామ్‌పాల్, హేడెన్ వాల్ష్, రసెల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
13 ఓవర్ల తర్వాత అఫ్గాన్ స్కోర్ 122/1
తొలి వికెట్‌కు 90 పరుగులు జోడించిన అనంతరం ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్(35 బంతుల్లో 56; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔట్ కావడంతో అఫ్గాన్ తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ మహ్మద్ షెహజాద్(32 బంతుల్లో 48; 5 ఫోర్లు, సిక్స్), రహ్మానుల్లా గుర్బాజ్(13 బంతుల్లో 12) ధాటిగా బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. 13 ఓవర్ల తర్వాత అఫ్గాన్ స్కోర్ 122/1.
చెలరేగి ఆడుతున్న అఫ్గాన్ ఓపెనర్లు
విండీస్‌తో జరుగుతున్న వార్మప్ పోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్‌కు ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్(35 బంతుల్లో 56; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), మహ్మద్ షెహజాద్(20 బంతుల్లో 28; 3 ఫోర్లు, సిక్స్) శుభారంబాన్ని అందించారు. వీరిద్దరు చెలరేగి బ్యాటింగ్ చేసి తొలి వికెట్‌కు 8.5 ఓవర్లలో 90 పరుగులు జోడించారు.
దుబాయ్: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లలో ఇవాళ అఫ్గానిస్తాన్-వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment