రాహుల్, ఇషాన్ మెరుపు ఇన్నింగ్స్.. ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం
ఇంగ్లండ్ నిర్ధేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు కేఎల్ రాహుల్(24 బంతుల్లో 51; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్(46 బంతుల్లో 70 రిటైర్డ్ హర్ట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు)లు టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని అందించారు. అనంతరం కోహ్లి(11), సూర్యకుమార్ యాదవ్(8) నిరాశపరచినా రిషబ్ పంత్(14 బంతుల్లో 29; ఫోర్, 3 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా(10 బంతుల్లో 12; 2 ఫోర్లు)లు జట్టును విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా టీమిండియా 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో విల్లే, మార్క్ వుడ్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ పడగొట్టారు.
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. సూర్యకుమార్ యాదవ్(8) ఔట్
విల్లే వేసిన ఇన్నింగ్స్ 17.3వ ఓవర్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్(9 బంతుల్లో 8; ఫోర్) ఔటయ్యాడు. దీంతో 168 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో రిషభ్ పంత్(23), హార్ధిక్ పాండ్యా ఉన్నారు. టీమిండియా గెలవాలంటే 15 బంతుల్లో 21 పరుగులు చేయాలికస ఉంది.
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. కోహ్లి(11) ఔట్
కేఎల్ రాహుల్ పెను విధ్వంసం తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ కోహ్లి(13 బంతుల్లో 11).. లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో ఆదిల్ రషీద్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 126/2. క్రీజ్‌లో ఇషాన్ కిషన్(39 బంతుల్లో 61; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), పంత్ ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా..కేఎల్ రాహుల్(51) ఔట్
189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఓపెనర్లు ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్(24 బంతుల్లో 51; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఇంగ్లండ్ బౌలింగ్ లైనప్‌ను తునాతునకలు చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో పెను విధ్వంసమే సృష్టించాడు. అయితే మార్క్ వుడ్ వేసిన 8.2 ఓవర్లో మొయిన్ అలీ క్యాచ్ పట్టడంతో రాహుల్ పెవిలియన్ బాట పట్టాడు. 8.2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 82/1. క్రీజ్‌లో ఇషాన్ కిషన్, కోహ్లి ఉన్నారు.
ఆఖర్లో చెలరేగిన మొయిన్ అలీ..టీమిండియా టార్గెట్ 189
భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో చెలరేగి బ్యాటింగ్ చేసిన మొయిన్ అలీ(20 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు).. ఆ ఓవర్లో ఏకంగా 21 పరుగులు పిండుకున్నాడు. ఫలితంగా ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెయిర్‌స్టో(36 బంతుల్లో 49; 4 ఫోర్లు, సిక్సర్), లివింగ్‌స్టోన్ (20 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) సహా మలాన్(18), జేసన్ రాయ్(17), బట్లర్(18) తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ జట్టు టీమిండియాకు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు.. బుమ్రా, చాహర్ తలో వికెట్ పడగొట్టారు.
లివింగ్‌స్టోన్ (30) క్లీన్ బౌల్డ్.. ఇంగ్లండ్ 129/4
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ చెలరేగి బౌలింగ్ చేస్తున్నాడు. ఇదివరకే బట్లర్, మలాన్‌లను పెవిలియన్‌కు పంపిన అతను.. ఇన్నింగ్స్ 14.5వ ఓవర్లో లివింగ్‌స్టోన్ (20 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 129 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది. క్రీజ్‌లో బెయిర్‌స్టో(38), మొయిన్ అలీ ఉన్నారు.
మలాన్(18) క్లీన్ బౌల్డ్.. 10 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 79/3
ఇన్నింగ్స్ 9.2వ ఓవర్లో స్పిన్నర్ రాహుల్ చాహర్ బౌలింగ్‌లో డేవిడ్ మలాన్(18 బంతుల్లో 18; 3 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 10 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 79/3. క్రీజ్‌లో బెయిర్‌స్టో(21), లివింగ్‌స్టోన్(1) ఉన్నారు.
షమీ ఆన్ ఫైర్.. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
ఇన్నింగ్స్ 4వ ఓవర్లో బట్లర్‌ను పెవిలియన్‌కు పంపిన షమీ.. 6వ ఓవర్లో మరో వికెట్‌ను పడగొట్టాడు. ఫైన్ లెగ్‌లో బుమ్రా క్యాచ్ పట్టడంతో ఓపెనర్ జేసన్ రాయ్(13 బంతుల్లో 17; 2 ఫోర్లు) పెవిలియన్ బాట పట్టాడు. 5.3 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 47/2. క్రీజ్‌లో డేవిడ్ మలాన్(10), బెయిర్‌స్టో ఉన్నారు.
బట్లర్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన షమీ..ఇంగ్లండ్ తొలి వికెట్ డౌన్
టాస్ ఓడి కోహ్లి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను.. టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్ జోస్ బట్లర్(13 బంతుల్లో 18; 3 ఫోర్లు)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 3.4 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 36/1. క్రీజ్‌లో జేసన్ రాయ్(16), డేవిడ్ మలాన్ ఉన్నారు.
దుబాయ్: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లలో ఇవాళ భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అక్టోబర్ 23 నుంచి ప్రారంభంకానున్న సూపర్ 12 స్టేజ్ మ్యాచ్‌ల నేపథ్యంలో ఇరు జట్లకు నేటి మ్యాచ్ కీలకం కానుంది. రెండు జట్టు నేటి మ్యాచ్‌లో పూర్తి స్థాయి జట్లతో బరిలోకి దిగనున్నాయి. భారత్ ఈనెల 20న ఆస్ట్రేలియాతో మరో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే. సూపర్ 12 లీగ్ మ్యాచ్‌ల్లో భాగంగా 23న ఇంగ్లండ్.. విండీస్‌తో తలపడనుండగా, 24న భారత్.. దాయాది పాక్‌ను ఢీకొట్టనుంది.
తుది జట్లు:
టీమిండియా:
ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి(కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్‌అశ్విన్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, రాహుల్ చహర్.
ఇంగ్లండ్: జేసన్ రాయ్, జోస్ బట్లర్(కెప్టెన్), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లే, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
అంచనా జట్లు:
భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, రాహుల్ చాహర్
ఇంగ్లండ్: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, జేసన్ రాయ్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, జోస్ బట్లర్, బెయిర్‌స్టో, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, తైమల్ మిల్స్, డేవిడ్ విల్లే, సామ్ బిల్లింగ్స్
Comments
Please login to add a commentAdd a comment