ఇంగ్లండ్ బౌలర్ల విజృంభన.. 13 పరుగుల తేడాతో కివీస్‌పై విజయం
164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 150 పరుగులకే కుప్పకూలి, 13 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఇంగ్లీష్ బౌలర్లు మార్క్ వుడ్ 4 వికెట్లతో విజృంభించగా.. ఆదిల్ రషీద్ 3, వోక్స్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించారు. కివీస్ ఇన్నింగ్స్‌లో మార్టిన్ గప్తిల్(41), డేవాన్ కాన్వే(21), సౌథీ(10), సోధి(25), టాడ్ ఆస్టల్(16) రెండంకెల స్కోర్ చేశారు. అంతకుముందు ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జోస్ బట్లర్ రాణించడంతో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.
ధాటిగా ఆడుతున్న గప్తిల్.. 5 ఓవర్ల తర్వాత కివీస్ స్కోర్ 48//1
164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్(15 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించాడు. 3వ ఓవర్‌లో మార్క్ వుడ్ బౌలింగ్‌లో మరో ఓపెనర్ సీఫర్ట్(8) ఔటైనప్పటికీ.. గప్తిల్ ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేశాడు. దీంతో 5 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ 48//1గా ఉంది. క్రీజ్‌లో గప్తిల్‌కు తోడుగా డెవాన్ కాన్వే(1) ఉన్నాడు.
రాణించిన జోస్ బట్లర్.. న్యూజిలాండ్ టార్గెట్ 164
ఇంగ్లండ్ బ్యాటర్లు జోస్ బట్లర్(51 బంతుల్లో 73; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో(21 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), సామ్ బిల్లింగ్స్(17 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. వీరు మినహా మిగతా ఇంగ్లండ్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో ఐష్ సోధి మూడు వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్, సౌథీ తలో వికెట్ దక్కించుకున్నారు.
సోధి మాయాజాలం.. 15 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 109/5
టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు తొలి బంతికే షాక్ తగిలింది. ఓపెనర్ జేసన్ రాయ్‌ను సౌథీ క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం జోస్ బట్లర్(51 బంతుల్లో 73; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడడంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా పయనించింది. అయితే కివీస్ స్పిన్నర్ ఐష్ సోధి తన స్పిన్ మాయాజాలంతో 3 వరుస వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ ఆశలకు గండి పడింది. తొలుత డేవిడ్ మలాన్(11), ఆతర్వాత ఇయాన్ మోర్గాన్(10)లను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపిన సోధి.. జట్టు స్కోర్ 102 పరుగల వద్ద నుండగా బట్లర్‌ను కూడా ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన లివింగ్‌స్టోన్(1)ను.. గ్లెన్ ఫిలిప్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ తమ ఐదో వికెట్‌ను కోల్పోయింది. 15 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 109/5. క్రీజ్లో సామ్ బిలింగ్స్(1), జానీ బెయిర్‌స్టో(7) ఉన్నారు.
అబుదాబీ: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లలో ఇవాళ న్యూజిలాండ్-ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
తుది జట్లు:
న్యూజిలాండ్: మార్టిన్ గప్తిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే, టిమ్ సీఫర్ట్, గ్లెన్ ఫిలిప్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాట్నర్, టిమ్ సౌథీ, కైల్ జేమీసన్, ఐష్ సోథీ,టాడ్ ఆస్టల్, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, లోకి ఫెర్గూసన్.
ఇంగ్లండ్: జేసన్ రాయ్, జోస్ బట్లర్(కెప్టెన్), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, ఇయాన్ మోర్గాన్, సామ్ బిలింగ్స్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, తైమాల్ మిల్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
Comments
Please login to add a commentAdd a comment