
T20 World Cup 2021 BAN Vs IRE : స్వదేశంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి బలమైన జట్లను ఖంగుతినిపించిన బంగ్లాదేశ్ జట్టు.. టీ20 ప్రపంచకప్-2021 వార్మప్ మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్ చేతిలో చతికిలపడింది. అబుదాబి వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్.. బంగ్లాదేశ్‌పై 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేయగా.. ఛేదనలో బంగ్లా జట్టు కేవలం 144 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది. ఐరిష్ బ్యాటర్ గారెత్ డెలాని (50 బంతుల్లో 88; 3 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.
బంగ్లా బౌలర్లు తస్కిన్ అహ్మద్ 2, నసుమ్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా జట్టుకు ఐరిష్ బౌలర్లు మార్క్ అడైర్(3/33), క్రెయిగ్ యంగ్(2/21), జోష్ లిటిల్(2/22), సిమి సింగ్(1/19), బెన్ వైట్(1/37) చుక్కలు చూపించారు. వీరి ధాటికి ఏకంగా ఏడుగురు బంగ్లా బ్యాటర్లు సింగల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో నరుల్ హసన్(24 బంతుల్లో 38; 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: అందరూ ధోనిలు కాలేరు.. పంత్‌కు కాస్త సమయం ఇవ్వండి
Comments
Please login to add a commentAdd a comment