
ముంబై: భారత బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్ న్యూజిలాండ్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్రబౌర్న్ మైదానంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ టీమ్ 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 343 పరుగులు చేసింది. లాథమ్(108), టేలర్(102) సెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్ 4 వికెట్లు పడగొట్టాడు. కేవీ శర్మ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ టీమ్ 47.1 ఓవర్లలో 310 పరుగులకు ఆలౌటైంది. గురుకీరత్ సింగ్(65), కరుణ్ నాయర్(53) అర్ధసెంచరీలు చేశారు. రిషబ్ పంత్(7) నిరాశపరిచాడు. తొలి మ్యాచ్‌లో మెరిసిన టీనేజి సెన్సేషన్ పృథ్వీ షా(22) ఈ మ్యాచ్‌లో త్వరగా అవుటయ్యాడు. 231 పరుగులకే ఎలెవన్ జట్టు 8 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఉనాద్కత్ అనూహ్యంగా విజృభించడంతో స్కోరు 300 దాటింది. ఉనాద్కత్ 24 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు సాధించాడు. ఇదే మైదానంలో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 30 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment