వెస్టిండీస్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో భారత్ మెరుగ్గా ఆడుతోంది...
భారత్ తొలి ఇన్నింగ్స్ 239/6
సెయింట్ కిట్స్: వెస్టిండీస్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో భారత్ మెరుగ్గా ఆడుతోంది. కేఎల్ రాహుల్ (127 బంతుల్లో 64 రిటైర్డ్ అవుట్; 9 ఫోర్లు; 1 సిక్స్) తన ఫామ్‌ను కొనసాగించాడు. దీంతో రెండో రోజు ఆటలో కడపటి వార్తలందే సరికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 70 ఓవర్లలో ఆరు వికెట్లకు 239 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (94 బంతుల్లో 51; 4 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు.
రహానే (24 బ్యాటింగ్), సాహా (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు విండీస్ ఎలెవన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 62.5 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అశ్విన్, జడేజా మూడేసి వికెట్లు తీశారు.