మిశ్రాకు నాలుగు వికెట్లు
బెసెటెరీ (సెయింట్ కిట్స్): భారత్, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌ల మధ్య జరిగిన తొలి వార్మప్ మ్యాచ్ డ్రా గా ముగిసింది. ఆదివారం వార్నర్‌పార్క్‌లో జరిగిన రెండో రోజు ఆటలో బోర్డు ప్రెసిడెంట్స్ జట్టు 87 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. హోప్ (229 బంతుల్లో 118; 15 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించాడు. రాజేంద్ర చంద్రిక (142 బంతుల్లో 69; 10 ఫోర్లు), వార్రీకన్ (75 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో స్పిన్నర్ అమిత్ మిశ్రా (4/67) రాణించగా, సీమర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
షమీ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ తలో వికెట్ పడగొట్టారు. ఇషాంత్ శర్మ వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. మొదటి రోజు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 93 ఓవర్లలో 6 వికెట్లకు 258 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రెండో వార్మప్ మ్యాచ్ జూలై 14 నుంచి 16 వరకు జరుగుతుంది.
తొలి వార్మప్ మ్యాచ్ డ్రా
Published Tue, Jul 12 2016 1:18 AM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM
Advertisement