భారత్, విండీస్ రెండో టెస్టు డ్రా | Classy Chase ton leads West Indies to improbable draw | Sakshi
Sakshi News home page

భారత్, విండీస్ రెండో టెస్టు డ్రా

Published Fri, Aug 5 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

భారత్, విండీస్ రెండో టెస్టు డ్రా

భారత్, విండీస్ రెండో టెస్టు డ్రా

కింగ్‌స్టన్ : వరుణుడి ప్రతాపం... వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ పోరాటంతో... కచ్చితంగా గెలుస్తామనుకున్న రెండో టెస్టును భారత్ డ్రాతో సరిపెట్టుకుంది. ఛేజ్ (269 బంతుల్లో 137 నాటౌట్; 15 ఫోర్లు, 1 సిక్సర్) అజేయ శతకంతో పాటు, బ్లాక్‌వుడ్ (54 బంతుల్లో 63; 9ఫోర్లు, 2 సిక్సర్లు), డౌరిచ్ (114 బంతుల్లో 74; 6ఫోర్లు, 1 సిక్సర్), హోల్డర్ (99 బంత్లు 64 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధసెంచరీలతో రాణించడంతో చివరి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో104 ఓవర్లలో 6 వికెట్లకు 388 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో దాదాపు 100 ఓవర్ల పాటు వర్షం వల్ల నష్టపోవడం భారత విజయావకాశాలను దెబ్బతీసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరచిన వెస్టిండీస్ ఆటగాడు ఛేజ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. మూడో టెస్టు 9 నుంచి సెయింట్‌లూసియాలో జరుగుతుంది.

రెండో టెస్టు సంక్షిప్త స్కోర్లు: వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 196 (బ్లాక్‌వుడ్ 62; అశ్విన్ 5/52)
భారత్ తొలి ఇన్నింగ్స్: 500/9 డిక్లేర్డ్ (రాహుల్ 158, రహానే 108 నాటౌట్; ఛేజ్  5/121)
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 388/6 (ఛేజ్ 137 నాటౌట్; షమీ 2/82).

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement