స్కాట్లాండ్ ఘన విజయం | Machan, Evans power Scotland to big win | Sakshi
Sakshi News home page

స్కాట్లాండ్ ఘన విజయం

Published Wed, Feb 11 2015 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM

Machan, Evans power Scotland to big win

సిడ్నీ: అసోసియేట్ జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్ వార్మప్ పోరులో స్కాట్లాండ్ జట్టు తమకన్నా బలమైన ఐర్లాండ్‌కు షాక్ ఇచ్చింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 179 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ మ్యాట్ మాకన్ (103) సెంచరీ సహాయంతో 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. మొమ్‌సెన్ (56), బేరింగ్టన్ (52) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం ఐర్లాండ్ 27 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. పాల్ స్టిర్లింగ్ (37)దే అత్యధిక స్కోరు. స్కాట్లండ్ బౌలర్ ఏసీ ఇవాన్స్ (4/17) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement