శ్రేయస్ శతక్కొట్టుడు | Iyer hits ton as india -a dominates | Sakshi
Sakshi News home page

శ్రేయస్ శతక్కొట్టుడు

Published Mon, Feb 6 2017 11:25 AM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM

శ్రేయస్ శతక్కొట్టుడు

శ్రేయస్ శతక్కొట్టుడు

హైదరాబాద్:బంగ్లాదేశ్ తో ఇక్కడ జింఖానా గ్రౌండ్లో జరుగుతున్న రెండు రోజుల వార్మప్ మ్యాచ్లో భారత్-ఎ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ శతకంతో మెరిశాడు. రెండో రోజు ఆటలో భాగంగా సోమవారం భారత ఇన్నింగ్స్ ను పాంచల్, అయ్యర్లు కొనసాగించారు. ఈ రోజు ఆటలో పూర్తి నిలకడను ప్రదర్శించిన ఈ జోడి 159 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది.

 

ఈ క్రమంలోనే 92 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు సాయంతో శ్రేయస్ సెంచరీ సాధించాడు. అనంతరం శ్రేయస్ రిటైర్డ్ అవుట్ గా వెనుదిరిగాడు. భారత్ -ఎ జట్టు 38.0ఓవర్లలో 200 పరుగుల వద్ద ఉండగా శ్రేయస్ రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement