టీ20 వరల్డ్‌కప్ 2024 మ్యాచ్‌లు నిన్నటి (మే 27) నుంచి ప్రారంభమయ్యాయి. పసికూనల మధ్య పోటీలతో మహాసంగ్రామం రిహార్సల్స్ మొదలయ్యాయి. తొలి మ్యాచ్‌లో కెనడా-నేపాల్.. రెండో మ్యాచ్‌లో పపువా న్యూ గినియా-ఒమన్.. మూడో పోటీలో ఉగాండ-నమీబియా జట్లు తలపడ్డాయి.
నేపాల్‌కు షాకిచ్చిన కెనడా
నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో కెనడా 63 పరుగుల తేడాతో గెలుపొందింది. డల్లాస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.
నికోలస్ కిర్టన్ (52), రవీందర్‌పాల్ సింగ్ (41 నాటౌట్) రాణించారు. 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్.. డిల్లన్ హెలిగర్ (4/20) ధాటికి 19.3 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌటైంది. నేపాల్ ఇన్నింగ్స్‌లో కుశాల్ మల్లా (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
పపువా న్యూ గినియాపై విజయం సాధించిన ఒమన్
పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో ఒమన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గినియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా.. ఒమన్ మరో 5 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. జీషన్ మక్సూద్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (45) ఆడి ఒమన్‌ను గెలిపించాడు.
ఉగాండను చిత్తు చేసిన నమీబియా
నిన్న జరిగిన మూడో వార్మప్ మ్యాచ్‌లో ఉగాండను నమీబియా 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఉగాండ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేయగా..నమీబియా 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. నికోలాస్ డేవిన్ మెరుపు అర్దసెంచరీ (54) చేసి నమిబీయాను గెలిపించాడు.
ఇవాళ (మే 28) జరుగబోయే వార్మప్ మ్యాచ్‌ల వివరాలు..
శ్రీలంక వర్సెస్ నెదర్లాండ్స్- ఫ్లోరిడా వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.
బంగ్లాదేశ్ వర్సెస్ యూఎస్‌ఏ- డల్లాస్ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది.
ఆస్ట్రేలియా వర్సెస్ నమీబియా- ట్రినిడాడ్ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మే 29 తెల్లవారుజామున 4:30 గంటలకు మొదలవుతుంది.
టీమిండియా తమ తొలి వార్మప్ మ్యాచ్‌ను జూన్ 1న ఆడుతుంది. న్యూయార్క్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment