
సాక్షి, హైదరాబాద్: వన్డే వరల్డ్ కప్‌కు ముందు హైదరాబాద్‌లో జరగనున్న తొలి వామప్ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించడం లేదు. ఈ నెల 29న ఉప్పల్ స్టేడియంలో పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే దానికి ఒక రోజు నగరంలో గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ కారణంగా తాము తగినంత భద్రత పోలీసులు కల్పించలేమని పోలీసులు స్పష్టం చేసేశారు.
వామప్ మ్యాచ్ తేదీని మార్చుకోవాల్సిందిగా కూడా వారు సూచించారు. అయితే బీసీసీఐ–హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) దీనిపై తగిన విధంగా చర్చించాయి. ప్రధాన మ్యాచ్ కాదు కాబట్టి సమస్య లేదని, తేదీ మార్చాల్సి అవసరం లేదనే నిర్ణయానికి వచ్చాయి. అయితే నగరంలో పరిస్థితుల నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించరాదని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment