ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్ ఫ్లేఆఫ్స్‌కు చేరడడంలో విఫలమైనప్పటికీ.. ఆ జట్టు యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తన అద్బుత ప్రదర్శనతో అందరిని అకట్టుకున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో యశస్వీ జైశ్వాల్ దుమ్మురేపాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ రాజస్తాన్‌కు తనవంతు సహకారం అందించేవాడు. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన జైశ్వాల్ 625 పరుగులు సాధించాడు.
అతడి ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీతో పాటు ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన జైస్వాల్ భారత జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. స్వదేశంలో ఆఫ్గానిస్తాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో జైశ్వాల్ చోటు దక్కనుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
అదే వేదికగా భారత వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ జట్టులో కూడా అతడికి అవకాశం ఇవ్వాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో జైశ్వాల్‌ను ఉద్దేశించి టీమిండియా వెటరన్ ఆటగాడు దినేష్ కార్తీక్ కీలక వాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్ వంటి పెద్ద ఈవెంట్‌కు జైశ్వాల్‌ను ఎంపికచేయాలి అనడం తొందరపాటే అవుతుందని కార్తీక్ తెలిపాడు.
"వన్డే జట్టులోకి యశస్వీని ఇంత వేగంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అతడు అద్భుతమైన యువ ఆటగాడు. అతడికి ప్రస్తుతం కేవలం 21 ఏళ్లు మాత్రమే. జైశ్వాల్‌కు చాలా భవిష్యత్తు ఉంది. అతడొక స్పెషల్ ప్లేయర్. కాబట్టి అతడిని ముందు భారత టీ20 జట్టులో భాగం చేయండి.
వచ్చే ఏడాది జరగున్న టీ20 ప్రపంచకప్ సమయానికి యశస్వీని సిద్దంచేయాలి. జట్టులో కుదురుకున్నాక అప్పుడు టీ20లు మాత్రమే కాకుండా వన్డేల్లో కూడా అవకాశం ఇవ్వాలి. కానీ అంతర్జాతీయ క్రికెట్ అన్నింటికంటే పూర్తి భిన్నంగా ఉంటుంది. చాలా ఒత్తిడి ఉంటుంది" అని ఐసీసీ రివ్యూ షోలో కార్తీక్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment