నేపియర్ వేదికగా న్యూజిలాండ్‌తో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ క్రమంలో భారత వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. మూడో టీ20కు సూర్యకుమార్ యాదవ్‌కు విశ్రాంతి ఇచ్చి సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని కార్తీక్ సూచించాడు.
కాగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కుతుంది అని అంతా భావించారు. కానీ మరోసారి జట్టు మేనేజేమెంట్ సంజూని బెంచ్‌కే పరిమితం చేసింది. ఈ క్రమంలో జట్టు మేనేజేమెంట్‌పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శల వర్షం కురిసింది.
ఇక క్రిక్‌బజ్‌తో కార్తీక్ మాట్లాడుతూ.. "ఈ మ్యాచ్‌కు సూర్యకుమార్ యాదవ్‌కు విశ్రాంతి ఇవ్వండి. అతడు వన్డే సిరీస్‌కు సిద్ధమవడానికి కాస్త సమయం లభిస్తుంది. సూర్య స్థానంలో శాంసన్‌ను జట్టులోకి తీసుకురండి. మిగిలిన ఆటగాళ్లు చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చారు.
కాబట్టి కేవలం ఒక్క మ్యాచ్‌తోనే పక్కన పెట్టడం సరికాదు. ఇక సంజూ ఫాస్ట్ బౌలింగ్ ఆడటానికి ఎక్కువగా ఇష్టపడతాడు. అదే విధంగా షార్ట్ పిచ్ బౌలింగ్‌లో కూడా అతడు అద్భుతంగా ఆడుతాడు. కాబట్టి సూర్య స్థానంలో శాంసన్‌ను చూడాలనుకుంటున్నాను"అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: FIFA World CUP 2022: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. జాతీయ గీతం పాడకుండా ఇరాన్ ఆటగాళ్ల నిరసన
Comments
Please login to add a commentAdd a comment